Ritu Chaudhary: బిగ్ బాస్ సీజన్ 9 లో రీతూ చౌదరి ఆట తీరు గమనిస్తే తన గురించి ఈజీగా అర్థమయిపోతుంది. తను సొంతంగా డిపెండ్ అవ్వకుండా గేమ్ ఆడటం లేదు. కానీ ఆర్గ్యుమెంట్ లో మాత్రం ఇండివిడ్యువల్ గా ఆడుతాను అని చెబుతోంది. అయితే పవన్ మరియు రీతు చౌదరి మధ్య ఏదో ఉంది అని షో చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ విషయం మీద రమ్య మోక్ష కూడా పవన్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
రీతు చౌదరిని మరియు పవన్ ను సీక్రెట్ రూమ్ కి పిలిచి నాగార్జున కూడా మాట్లాడారు. అయితే వాళ్ళిద్దరూ కలిసి ఉండటానికి వాళ్ల రీసన్స్ వాళ్ళు చెప్పారు. అయితే ఈరోజు ఎపిసోడ్ లో పవన్ ను రీతు చౌదరి చీటింగ్ చేసింది అని క్లియర్ గా అర్థమవుతుంది.
ఈరోజు ఎపిసోడ్లో రీతుతో పవన్ కి గొడవ అయింది. సీక్రెట్ టాస్క్ లో రీతూ గెలిచి డైరెక్ట్ కంటెండర్ అయింది. దీనితో తన దగ్గర ఉన్న డబ్బులు పవన్ అడిగాడు. మొత్తం ఇవ్వకుండా కొన్ని ఇచ్చింది. ఒక వంద రూపాయలతో పవన్ కు కంటెండర్ మిస్ అయిపోయింది. నీ దగ్గర ఉన్నది మొత్తం నాకు ఇవ్వు నేను కంటెండర్ అవుతాను అని నువ్వు నన్ను ఎందుకు అడగలేదు రా అని రీతు క్వశ్చన్ చేసింది.
కంటెండర్ మిస్సయిపోవడం వలన బ్రతిమలాడుకుంటే ఇచ్చేది ఫ్రెండ్షిప్ కాదు. నీకు నువ్వుగా నాకు మనీ ఇవ్వాలి నిన్ను కూడా నేను అడుక్కోవాలా అని పవన్ అడిగాడు.
పవన్ అలా అడిగిన వెంటనే ఎప్పటిలాగానే రీతు అరవడం మొదలుపెట్టింది. తన ఆర్గ్యుమెంట్ చెప్పడం మొదలుపెట్టింది. ఫైనల్ గా కన్నీళ్లు ఆయుధాన్ని కూడా బయటకు తీసి వాడింది. ఇద్దరికీ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది.
అయితే ఈ విషయం కంటిన్యూ అవుతూ మాధురి తో కూడా గొడవ పెట్టుకుంది రీతు. నీకు అసలు మాట్లాడటం రాదు అని మాధురి రీతుకి అంది. ఇండివిడ్యువల్ గా గేమ్ ఆడుతాను అని చెప్పావు నువ్వు ఇప్పుడు ఇండివిడ్యువల్ గా ఆడుతున్నావా అని క్వశ్చన్ చేసింది మాధురి. అలానే ఈ హౌస్ లో ఉన్న చెత్త నోరు నీది అంటూ మాట్లాడటం మొదలుపెట్టింది.
దీనికి కౌంటర్ గా రీతూ చౌదరి మాట్లాడుతూ చెత్త గిత్త అనకండి. మీరు రెస్పెక్ట్ ఇస్తేనే నేను కూడా రెస్పెక్ట్ ఇస్తాను అంటూ తిరిగి కౌంటర్ ఎటాక్ చేసింది.
Also Read: Baahubali The Epic Trailer : బాహుబలి తిరిగి వచ్చాడు, మైండ్ చెదిరిపోయే ట్రైలర్ కట్