Thanuja: బిగ్ బాస్ సీజన్ 9 రోజుకో కొత్త ట్విస్ట్ ఇస్తుంది. అలానే 46 రోజుల్లో కొత్త కొత్త రంగులు కూడా బయటపడ్డాయి. అందరికీ కూడా తనుజ అంటే ఎక్కువగా నటిస్తుంది అనే అభిప్రాయం కలుగుతుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంటర్ అయ్యారు దువ్వాడ మాధురి. దువ్వాడ మాధురి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆవిడ చాలా విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ కి గురి అయ్యారు.
దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ మాధురి కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఏవీలు కూడా వీళ్ళిద్దరి బంధాన్ని వీడియోగా చేసి బిగ్ బాస్ యాజమాన్యం ప్రజెంట్ చేశారు. అయితే ఆ వీడియో మీద కూడా విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. అక్రమ సంబంధాన్ని కూడా చాలా అందంగా చూపించారంటూ చాలామంది విమర్శలు వదిలారు.
స్రవంతి అనే సీరియల్ తో విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు భరణి. అది మాత్రమే కాకుండా చాలా సీరియల్స్ చేసి తనకంటూ కొంత పేరును సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన భరణి తనదైన గేమ్ 5 వారాలపాటు ఆడాడు.
అయితే భరణి గేమ్ ఆడుతున్న తరుణంలో తనుజ ఎమోషనల్ గా భరణికి కనెక్ట్ అయ్యి నాన్న అని పిలవడం మొదలుపెట్టింది. అయితే దానిని కూడా సీరియస్ గా తీసుకొని అంతే కేర్ తీసుకునేవాడు భరణి. ఆ బంధాల ముసుగులో పడిపోయి గేమ్ ఆడటం మానేశాడు. ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రతినిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది నెటిజన్లు ఆడియన్స్ ఈ మాటలు అనడం వేరు. కానీ ప్రత్యేకంగా ఈ మాటను ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కూడా అనేసారు.
భరణి బయటకు వెళ్లి పోవడానికి కారణం ఎవరు? తనుజ. ఆ బంధాల్లో ఇరుక్కుపోయి గేమ్ సరిగ్గా ఆడక పోవడం వలనే భరణి బయటకు వచ్చేసాడు అని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే దువ్వాడ మాధురి హౌస్ లోకి ఎంటర్ ఇచ్చిన తర్వాత తననే టార్గెట్ చేసి మమ్మీ అనుకుంటూ ఆవిడకి బాగా కనెక్ట్ అయిపోయింది తనుజ. ఇప్పుడు దువ్వాడ మాధురికి తనుజ బాగా క్లోజ్ అయిపోయింది కాబట్టి దువ్వాడ రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు వేచి చూడాలి.
Also Read: Akhanda 2 : ప్రతిసారి అదేనా, వీళ్లు ముగ్గురు మారాల్సిందే