Baahubali The Epic Trailer : తెలుగు ఫిలిం ఇండస్ట్రీని బాహుబలి సినిమాతో రాజమౌళి శిఖరం మీద కూర్చోబెట్టాడు. ఈ సినిమా తర్వాతే తెలుగు సినిమాలకు ఒక గౌరవం వచ్చింది. ఈ సినిమా తర్వాతే పాన్ ఇండియా సినిమాలు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం తెలుగులో భారీ బడ్జెట్ సినిమా నిర్మితం అవుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇదంతా కూడా మొదలైంది బాహుబలి సినిమా నుంచి.
టాలీవుడ్ సినిమాని కాస్త భారతీయ సినిమా అని మాట్లాడుకునే రేంజ్ కు తీసుకెళ్ళిన ఘనత ఎస్ఎస్ రాజమౌళికి ఉంది. అసలు ఈ సినిమాను మొదలుపెట్టడం అనేది సాహసం అని చెప్పాలి. ఈ సినిమా విడుదలైనప్పుడు కూడా తెలుగులో మొదట నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత నార్త్లో విపరీతమైన పాజిటివ్ టాక్ రావడం. చిన్నపిల్లలకు సైతం ఈ సినిమా విపరీతంగా నచ్చడంతో బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అయితే బాహుబలి, బాహుబలి 2 సినిమాలు రెండు కూడా కలిపి ఒక సినిమాగా థియేటర్స్ కి రానున్న సంగతి తెలిసిందే.
బాహుబలి ఎపిక్ అనే పేరు మీద ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 31న ప్రేక్షకులు ముందుకు ఈ సినిమా రానుంది. రెండు పార్ట్స్ కూడా ఒకే సినిమాగా వస్తుంది. 31న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా కొద్దిసేపటి క్రితమే బాహుబలి ఎపిక్ ట్రైలర్ ను విడుదల చేశారు.
రెండు సినిమాలను కలిపి ఒక ట్రైలర్ చూస్తేనే మంచి కిక్ వచ్చింది. అదే ఫ్లోలో సినిమా చూస్తే ఎలా ఉండబోతుందో అని క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది. సినిమా కథ ఇంకా బాగా అర్థమయ్యేలా, ఇంకొంచెం ఆసక్తి పెరిగేలా ఈ ట్రైలర్ ఉంది అని చెప్పాలి.
ఇప్పటివరకు చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. దాదాపు 50 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తాయి అని అందరూ అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు రీ రిలీజ్ సినిమాల కలెక్షన్స్ అన్నిటిని కూడా ఈ సినిమా డామినేట్ చేస్తుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు. ఎంత మేరకు కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి.
Also Read: Megastar Chiranjeevi : 2026 లో మూడు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్