Thanuja Kalyan: బిగ్ బాస్ 9 కి వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో ఆరుగురు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే రమ్య మోక్ష కళ్యాణ్ మరియు తనుజ గురించి కొన్ని కామెంట్స్ చేసింది. ఏకంగా కళ్యాణ్ కు అమ్మాయిలు పిచ్చి అంటూ స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇలా చేయటం వలన రమ్య మోక్షకి కూడా విపరీతమైన నెగిటివిటీ వచ్చింది.
నాగార్జున కళ్యాణ మరియు రమ్య మోక్షాన్ని సీక్రెట్ రూమ్ లోకి పిలిచి ఆ వీడియోని చూపించారు. అయితే అలా మాట్లాడి ఉండకూడదు నాదే తప్పు అని సారీ కూడా చెప్పిందే రమ్య మోక్ష. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు అనుకునే తరుణంలో ఈరోజు ఎపిసోడ్ లో జరిగిన ఒక సంఘటన ఏదో ఉంది అనిపించేలా ఉంది
కెప్టెన్సీ టాస్క్ తర్వాత విన్నర్ ని కూడా ప్రకటించారు. అప్పటి వరకు బాగానే ఉన్న తనూజ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతక గురైంది. బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి కళ్లు తిరిగి పడిపోయింది. మెడికల్ రూంకి తీసుకువెళ్లారు. తనూకి అలా అవ్వడంతో ఇమ్మాన్యుయేల్ ఏడ్చాడు. అలాగే కళ్యాణ్ పడాల వెక్కి వెక్కి ఏడ్చాడు.
ఇమ్మూని పట్టుకుని ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. కాసేపు విశ్రాంతి తర్వాత మెడికల్ రూం నుంచి తనూజ బయటకు రాగానే కళ్యాణ్ నార్మల్ అయ్యాడు. బయటకు తనూజ కళ్యాణ్ ఎందుకు ఏడ్చావ్ అని అడుగుతుంది. నీ కోసం కాదు ఎలిమినేట్ అయితానేమో అనే భయంతో ఏడ్చాను అని కవర్ చేసుకున్నాడు.
నిజం చెప్పు అనగానే.. నేను నామినేషన్ నుంచి సేవ్ అయితే చెప్తే వెయిట్ చెయ్ అన్నాడు. అలాగే తనూజ రాగానే బెడ్ రూంలో పడుకుని ఉంటది. మాధురి వచ్చి తనూజని పట్టుకుని ఏడుస్తుంది. ఫుల్ ఎమోషనల్ అయ్యింది.
అయితే జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తుంటే కళ్యాణ్ ఎమోషనల్ గా తనుజాకి కనెక్ట్ అయ్యాడేమో అని ఫీలింగ్ కలుగుతుంది. వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో బాండింగ్ ఉండి ఉంటుంది అని కళ్యాణ్ ఏడుపు చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇక ముందు ముందు ఏం జరగబోతుందో చూడాలి.
Also Read: Ritu Chaudhary: ఎంతపని చేశావ్ రీతూ.. పాపం పవన్ ఎంత నమ్మాడు.. ఇది ఫ్రెండ్షిప్ కాదా?