BigTV English
Advertisement

Thanuja : మోస్ట్ ఫేక్ కంటిస్టెంట్, నాన్నతో అలకలు పోయాయి రాజుతో మొదలయ్యాయి 

Thanuja : మోస్ట్ ఫేక్ కంటిస్టెంట్, నాన్నతో అలకలు పోయాయి రాజుతో మొదలయ్యాయి 

Thanuja : బిగ్ బాస్ సీజన్ 9 రక రకాల అనుమానాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఈ షో లో ఎలిమినేషన్స్ అలా ఉన్నాయి. ఎవరైతే టాప్ ఫైవ్ లో ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేశారో వార్లలో ఇద్దరినీ ఆల్రెడీ బయటకు పంపించేశారు. అగ్నిపరీక్షలో తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని శ్రీజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే లేనిపోని విషయాల్లో పెద్ద గొంతు చేసుకొని అరుస్తుంది అనే కంప్లైంట్ తప్ప శ్రీజ గేమ్ విషయంలో ఎటువంటి మైనస్ లు లేవు. అలానే తన ఎలిమినేషన్ అనేది జీర్ణించుకోలేని విషయం. చాలామంది కం బ్యాక్ ఇవ్వాలి అని సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా చేశారు.


ఒక భరణి విషయానికి వస్తే హౌస్ లో ఇంటి పెద్ద లాగా అందరితో బాగా మాట్లాడేవాడు. కెప్టెన్సీ టాస్క్ లో కూడా చాలామందికి సహాయం చేశాడు. అయితే భరణి విషయంలో ఉన్న ఏకైక కంప్లైంట్ బాండింగ్స్. తనూజ నాన్న అని పిలవడం వలన తనతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి తన గేమ్ ని పక్కన పెట్టేసాడు. అలానే దివ్య అన్నయ్య అని పిలవడం వలన కూడా కొంత గేమ్ ఎఫెక్ట్ అయింది. అయితే వీళ్ళిద్దరి వల్ల నాకేం ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు అని అంటుంటాడు భరణి.

మోస్ట్ ఫేక్ కంటెస్టెంట్ 

ఇక తనూజ విషయానికి వస్తే.. మోస్ట్ ఫేక్ కంటిస్టెంట్ అని అర్థమవుతుంది. తను ఫేక్ అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. భరణిను నాన్న నాన్న అని పిలిచి ఎమోషనల్ గా వాడుకుంటూ టాస్క్ లో హెల్ప్ తీసుకుంది. ఆ తర్వాత ఇమ్మానియేల్ తో కూడా మంచి బాండింగ్ మెయింటైన్ చేసింది. కళ్యాణ్ తో కూడా బాండింగ్ మెయింటైన్ చేసింది.


దివ్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత భరణి పట్టించుకోవడం మానేశాడు అంటూ తనుజ మరియు సంజనాలు డిస్కషన్స్ కూడా పెట్టుకున్నారు. అలానే దివ్య భరణి కలిసి టాస్కులు ఆడటం పైన కూడా చాలా చాలా కామెంట్స్ చేశారు.

అయితే భరణి ఎలిమినేట్ అయిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో భరణి దగ్గర ఎక్కువగా ఏడ్చేది తనుజ. ఇప్పుడు దువ్వాడ మాధురి దగ్గర తన అలకలు మొదలుపెట్టింది. రాజు రాజు అంటూ ముద్దు ముద్దుగా యాక్టింగ్ చేస్తుంది. తను యాక్టింగ్ చేస్తుంది అని రమ్య మోక్ష కూడా నామినేషన్స్ లో భాగంగా చెప్పేసింది. కానీ స్టార్ మా యాజమాన్యం తనుజను సపోర్ట్ చేస్తుంది అని చాలామందికి డౌట్ వస్తుంది. అఫీషియల్ అకౌంట్స్ లో కూడా తనకు ఎలివేషన్స్ ఇస్తున్నారు.

దువ్వాడ మాధురిని లైన్ లో 

మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు శ్రీజ మీ పేరు మాధురి నా మాధవీనా అని అడిగినందుకు బీభత్సమైన గొడవ పెట్టుకుంది. అందరికీ తెలుసు నా పేరు నీకు తెలియదా అంటూ పెద్ద ఆర్గ్యుమెంట్ చేసింది. ఆ ఆర్గుమెంట్ వల్లే శ్రీజ కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది.

అయితే ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఇమ్మానుయేల్ దగ్గరికి తనుజ వెళ్లి యాంగ్రీ బర్డ్ ఆ అని దువ్వాడ మాధురి గురించి అడిగింది. ఇమ్మానుయేల్ నాకేమీ తెలియదు అనుకొని సమాధానం చెప్పాడు. వెంటనే తనతో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టి ఒక్క రోజుకే కాలు మీద కాలు వేసుకొని పడుకునే అంత క్లోజ్ అయిపోయింది. ఇవన్నీ కూడా తను ఒక ఫేక్ కంటెస్టెంట్ అని చెప్పడానికి ఉదాహరణలు.

Also Read: Thanuja Kalyan: నిజంగానే తనూజపై ప్రేమ.. అప్పుడే మాట మార్చిన కళ్యాణ్.. మరో లవ్ ట్రాక్

Related News

Ayesha Eliminate: నాకీష్టమైంది నాతో ఉండదు.. ఆయేషా తీవ్ర ఆవేదన, కన్నీటితో హౌజ్ ని వీడిన రౌడీ బేబీ

Bigg Boss 9 Telugu: మాధురి కిల్.. రీతూ విన్.. తనూజకి మెడికల్ ఎమర్జేన్సీ, ఏడ్చిన దువ్వా డ

Thanuja Kalyan: నిజంగానే తనూజపై ప్రేమ.. అప్పుడే మాట మార్చిన కళ్యాణ.. మరో లవ్ ట్రాక్

Ritu Chaudhary: ఎంతపని చేశావ్ రీతూ.. పాపం పవన్ ఎంత నమ్మాడు.. ఇది ఫ్రెండ్షిప్ కాదా?

Thanuja: తనుజ వలన భరణి బయటకు దువ్వాడ కామెంట్స్ వైరల్

Bigg Boss 9 : బిగ్ బాస్ స్క్రిప్ట్ లీక్ అయిపోయింది, మినిమం రూల్స్ పాటించడం లేదు 

Aadi Reddy: బిగ్ బాస్ రివ్యూలతో లక్షల్లో సంపాదన.. ఆదిరెడ్డి నెల ఆదాయం ఎంతో తెలుసా?

Big Stories

×