Aadi Reddy: ఆదిరెడ్డి (Aadi Reddy)పరిచయం అవసరం లేని పేరు ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆదిరెడ్డి జీవనోపాధి కోసం సరదాగా బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన రివ్యూలను తెలియజేస్తూ ఇప్పుడు అదే తన వృత్తిగా మార్చుకొని సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన ఆదిరెడ్డి ఉద్యోగ నిమిత్తం బెంగళూరుకు వెళ్లి అక్కడ ఏదో సరదాగా బిగ్ బాస్ రివ్యూ(Bigg Boss Review) చెప్పడంతో ఆ వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ విధంగా ఆ వీడియోకి మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూ చెప్పడం మొదలుపెట్టారు. ఇలా యూట్యూబర్ గా తన ప్రయాణం 2018లో మొదలైందని ఈయన వెల్లడించారు.
బిగ్ బాస్ రివ్యూయర్ గా తాను ఇలాంటి సక్సెస్ అందుకొని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్తానని అసలు అనుకోలేదు అంటూ తన జీవితంలో బిగ్ బాస్ కార్యక్రమం ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకుందో ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు. ఇలా బిగ్ బాస్ రివ్యూ ఇస్తూ తాను మొదటిసారి 70 వేల రూపాయలు ఆదాయం తీసుకున్నానని వెల్లడించారు. అయితే ఇటీవల ఈయన బిగ్ బాస్ రివ్యూ ఇవ్వటం వల్ల నెలకు 39 నుంచి 40 లక్షల వరకు ఆదాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంలో నేను ఎలాంటి దాపరికలు పెట్టుకోలేదని, బిగ్ బాస్ ప్రసారమవుతున్న ఈ మూడు నెలలు తనకు ప్రతి నెల దాదాపు 40 లక్షల రూపాయలు వరకు యూట్యూబ్ నుంచి ఆదాయం ఉంటుందని వెల్లడించారు.
ఇక బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత తన యూట్యూబ్ వీడియోలకు ఇంత మొత్తంలో ఆదాయం రాదని కూడా ఈ సందర్భంగా ఆదిరెడ్డి తెలిపారు. ఇలా బిగ్ బాస్ రివ్యూ చెబుతూ నెలకు లక్షల్లో ఆదాయం అందుకోవడం అంటే మామూలు విషయం కాదు.. రివ్యూస్ ఇవ్వడం ద్వారా మంచి ఆదాయం వస్తుందని తెలుసుకున్న ఎంతోమంది ఆదిరెడ్డి బాటలోనే రివ్యూస్ ఇస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఇలా బిగ్ బాస్ రివ్యూలు చెబుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆదిరెడ్డి సీజన్ 6 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టారు.
సెలబ్రిటీ హోదాలో ఆదిరెడ్డి..
ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన ఫినాలే వరకు హౌస్ లో కొనసాగి బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ ద్వారా సెలబ్రెటీ హోదా అందుకున్న ఆదిరెడ్డి ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవల ప్రసారమైన ఇస్మార్ట్ జోడి కార్యక్రమంలో ఈ జంట రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ రివ్యూలు చెబుతూనే ఈయన కోట్లు విలువ చేసే ఇంటిని కట్టించారు అలాగే సెలూన్ బిజినెస్ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. బిగ్ బాస్ తన జీవితాన్ని మార్చేసిందని ఆదిరెడ్డి పలు సందర్భాలలో కూడా వెల్లడించారు. బిగ్ బాస్ రివ్యూలు ఇవ్వకముందు తాను, తన కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడ్డామని తన కష్టాల గురించి కూడా ఈ సందర్భంగా ఆదిరెడ్డి తెలియజేశారు.
Also Read: Tollywood Actresses: ఉపాసనతో పాటు కవలలకు జన్మనిచ్చిన టాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్లే!