Womens World Cup 2025: వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ( ICC Womens World Cup 2025) దాదాపు లీగ్ దశ పూర్తయింది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ పరువు గంగలో కలిసింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే, ఇంటి దారి పట్టింది పాకిస్తాన్. ఇందులో పాకిస్తాన్ కొన్ని ఓడిపోగా, మరికొన్ని మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దీంతో ఈ టోర్నమెంటులో ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ లలో కూడా పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ గెలవలేకపోయింది. దీంతో వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. ఈ తరుణంలోనే పాకిస్తాన్ మహిళల జట్టుపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంటి దారి పట్టిన మీరు, ఇకపై ఇంట్లో గోధుమ పిండి పిసుక్కోండి అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో పాకిస్తాన్ ఆడిన చాలా మ్యాచ్ లకు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా ఏకంగా మూడు మ్యాచ్ లు రద్దయ్యాయి. దానివల్లే పాకిస్తాన్ కు ఆ మాత్రం మూడు పాయింట్లు దక్కాయి. ఆ మూడు మ్యాచ్ లు ఒకవేళ సక్రమంగానే జరిగి ఉంటే, అన్నిటిలో కూడా పాకిస్తాన్ ఓడిపోయేది అని అంటున్నారు. అంత దారుణంగా పాకిస్థాన్ మహిళల జట్టు ప్రదర్శన ఉంది. ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక ( Sri Lanka Women vs Pakistan Women ) జట్ల మధ్య కొలంబో వేదికగా మ్యాచ్ జరిగింది. కొలంబోలో మ్యాచ్ జరిగిన ప్రతిసారి వర్షం విలన్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇవాల్టి మ్యాచ్ కు కూడా వర్షం విలన్ గా మారింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేయగా, వికెట్లు ఏమి నష్టపోకుండా 18 పరుగులు చేసింది. కేవలం 4 ఓవర్లు మాత్రమే పూర్తయ్యాయి. అప్పుడు ప్రారంభమైన వర్షం ఎక్కడ కూడా తగ్గలేదు. వర్షం తీవ్రతరం అయిన నేపథ్యంలో మ్యాచ్ రద్దు చేశారు. దీంతో పాకిస్తాన్ తో పాటు శ్రీలంకకు తలో పాయింట్ ఇచ్చింది ఐసీసీ.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్లో ( Womens World Cup 2025 ) 7 మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని పాకిస్తాన్ ఏడో స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ ఎనిమిదో స్థానంలో ఉండగా న్యూజిలాండ్ ఆరో స్థానంలో ఉండగా శ్రీలంక 5వ స్థానంలో ఉంది. ఈ చివరి నాలుగు జట్లు కూడా ఎలిమినేట్ అయ్యాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ అలాగే టీమిండియా నాలుగు జట్లు కూడా సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లాయి. పాయింట్ల పట్టికలో కూడా వరుసగా నాలుగు నిలిచాయి. ఇక సెమీస్ లో ఆసీస్ వర్సెస్ టీమిండియా, ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్లు తలపడే ఛాన్సు ఉంది.
Pakistan Team tops the Points Table of Women World Cup with actual 6-0. pic.twitter.com/ZDlmqsoJYd
— Amir Khan (@bandaofrabb) October 24, 2025