Bigg Boss 9 Day 40 Highlights: ఇమ్మాన్యుయేల్ సంజన గుసగుసలాడుకున్నారు. ‘మొన్నటిదాకా కూతురు కూతురు అని, ఇప్పుడు అలా పిలవొద్దు అంటే కష్టం. నేను ఫ్లోలో మీ కూతురు అన్నాను. నువ్వు గుచ్చి గుచ్చి అన్నావు అనగానే ఒక నిమిషం టైం ఇవ్వమన్నాడు. నేను ఇవ్వను ఆలోచించుకోవాలి అని చెప్పాను. ఒకవేళ ఇంట్లో ఎవరి వల్ల కాదు. నీ వల్లే హెల్ప్ అవుతుంది. అంటే నాకు హెల్ప్ చేస్తావా? అని అడిగాడు. మైండ్ బ్లాక్ అయ్యింది నాకు. 16 మంది ఒకవైపు, నువ్వు ఒక్కడివే ఒకవైపు ఉండి, న్యాయం నీవైపే ఉంటే నేను నీతోనే నిలబడతా అని చెప్పాను’ అని సీక్రెట్ బయటపెట్టాడు. భరణి తనూజని కూతురు అంటే అలా అనోద్దని అన్నాడట. ఈ విషయాన్నే సంజనతో చెబుతూ అసలు విషయం చెప్పాడు.
ఆ తర్వాత మరోసారి కిచెన్ దగ్గర రీతూతో ఆయెషా యుద్దానికి దిగింది. సింక్ నీట్ గా పెట్టు.. ఏంటీ ఈ కడగడం.. చూట్టూ అంత సోప్ ఉంది. అమ్మాయివి అది కూడా చెప్పాలా. నీకు తెలియదా. కాస్తా అమ్మాయిలా పని చేయ్ అంటూ రీతూని తీసిపారేసింది. నేను నీట్ గానే పెట్టాను ప్రతి దానికి గొడవ పడ్తావేంటి నెమ్మదిగా చెప్పోచ్చు కదా అని రీతూ సమాధానం ఇచ్చింది. నీకు నేను చెప్పలేను రా.. ఏమన్న అంటే భరణి చేస్తారని అంటావ్.. అంటూ చురకలు అట్టించింది. పరోక్షంగా రీతూ పని దొంగ అన్నట్టుగా మాట్లాడింది. పని తప్పించుకుంటుందన్నట్టుగా రీతూకి సెటైర్స్ వేసింది. ఆయెషా దెబ్బకు రీతూ బాత్ రూంకి వెళ్లి ఏడ్చింది.
గొడవ పడటం నా వల్ల కాదు.. తను ఎందుకు అలా చేస్తుందో అర్థం కావడం లేదంటూ సంజనతో చెప్పుకుంటూ వాపోయింది. దీంతో హౌజంత అయెషా తీరుకి బెదిరిపోతుంది. అసలు తను ఎందుకు ఇలా చేస్తుందో అడుగుతాం పదండి అని సుమన్, రీతూ, రమ్య, తనూజ కలిసి వెళ్లారు. కానీ, అయెషాను అడగడానికి వారిలో ఎవరికి ధైర్యం రావడం లేదు. అక్కడికి వెళ్లగానే అంత సుమన్ మీద నెట్టారు. సుమన్ అన్న నిన్ను ఏదో అడగాలంటూ అంటూ అయెషా ముందు ఇరికించారు.
కెప్టెన్సీలో బిగ్ బాస్ ట్విస్ట్ పెట్టాడు. గెలిచిన ఇద్దరి ఒకరికి సవాల్ విసిరి అఖిల్ కెప్టెన్ అవ్వోచ్చని మరో టాస్క్ ఇచ్చాడు. కంటెండర్ పవర్ తో నిఖిల్ కి ఈ స్పెషల్ పవర్. గెలుపు కొరకు చివరి వరకు అని పెట్టిన ఈ టాస్క్ కి తనూజ సంచాలక్. ఇందులో వీరిద్దరి బలాన్ని చూపించాలి. ఇసుక బ్యాగ్స్ ఓ వైపు తాడుకు వేలాడ దీశారు. మరోసైడ్ పట్టుకుని వాటిని బ్యాలెన్స్ చేయాలి. అలా ఎక్కువ సేపు ఎవరూ పట్టుకుంటే వారు విన్నర్. అయితే ఈ టాస్క్ లో కెప్టెన్ అవ్వోద్దు అనుకున్న వారికి మిగతా వారు ఎక్స్ ట్రా బ్యాగ్ పెట్టి వారికి మరింత బరువు పెంచాలి. అలా జరిగిన ఈ టాస్క్ లో చివరి వరకు బ్యాగ్స్ బ్యాలెన్స్ చేసి గౌరవ్ కెప్టెన్సీని తిరిగి దక్కించుకున్నాడు.