CPI Narayana About Bigg Boss and Nagarjuna: బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని కొన్నేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు సీపీఐ సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె నారాయణ. తెలుగు రాష్ట్రాల్లో ఈ షోని రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బిగ్ బాస్ షోపై కే నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిగ్ బాస్ అనేది ఒక వ్యభిచార కొంప అంటూ ఘాటు కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన తెలుగు మీడియా ఛానల్ బిగ్ టీవీకి ఇంటర్య్వూ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీపీఐ పార్టీ కార్యకలాపాలతో పాటు వివిధ అంశాలపై మాట్లాడారు. డాక్టరైన ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారో వివరించారు. అలాగే కొంతకాలంగా బిగ్ బాస్‌పై ఫైట్ చేస్తున్న బిగ్ బాస్‌ని సరి చేయడానికి పిలుపు వచ్చిన వెళ్తారా అని అడగ్గా.. అసలు వెళ్లను అన్నారు. “అదోక వ్యభిచార కొంప..అందులోకి నేనేందుకు వెళ్తాను. బిగ్ బాస్ చెడు సంప్రదాయాన్ని ప్రొత్సహిస్తోంది.. దాన్ని నిర్మూలించాలనే తాను ఫైట్ చేస్తున్నా అన్నారు. ఇది విదేశాల్లో ఉండే ప్రాశ్చ్యత్త సంస్కృతి, ఇండియాకు తీసుకువచ్చి మన సంస్కృతిని చెడగొడుతున్నారు. పెళ్లి కానీ యూత్ అమ్మాయిలు అబ్బాయిలను తీసుకువెళ్లి ఒక రూంలో పెట్టి మూడు నెలల ఉండటం ఏంటి.
వాళ్ల మన అన్నలు, చెల్లెల్లు కాదు.. ఎలాంటి బాంధవ్యం లేని వారిని తీసుకువెళ్లి ఒకే రూంలో పెట్టడం ఏంటి. భారతదేశంలో ఇలాంటి సంస్కృతి ఎక్కడైనా ఉందా. ఏమన్న అంటే సోషల్ బిహెవీయర్ అంటారు. మన భారతదేశంలో ఉన్న కుటుంబ సంబంధాలు మరెక్కడైన ఉన్నాయా? ప్రాశ్చ్యత్త దేశంలో 18 ఏళ్లు వచ్చాయంటే పిల్లలు బయటకు వెళ్లిపోతారు. తల్లిదండ్రులను చూసుకోరు. వారచ్చి మనకు నేర్పించడం ఏంటి? అలాంటి చెడు సంస్క్రతిని ప్రోత్సహిస్తున్న ఈబిగ్ బాస్‌ని బ్యాన్ చేయాలని కేసు పెట్టారు. సీపీ సజ్జనార్ టైంలో వెళ్లి కేసు ఫైల్ చేశారు. ఆయన కోర్టుకు వెళ్లమన్నారు. కోర్టు వెళ్ల రెండు నెలల తర్వాత నా పిటిషన్ని కొట్టివేశారు.
Also Read: Bigg Boss 9 Telugu: డిమోన్ అంటే ఇష్టం.. ఓపెన్ అయిన రమ్య.. మాధురి ఫుల్ సపోర్ట్
జిల్లా కోర్టుకు వెళ్లాను.. అక్కడ రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. కోవిడ్ వల్ల పెండింగ్లో పడింది. మొన్న వచ్చిన జడ్జీ ఈ కేసులో రీఓపెన్ చేసి ఆ నోటీసులు నాకు ఇచ్చారు. నేను తిరిగి నోటీసులు ఇచ్చాను. మాకు వద్దని ఎవరూ తీసుకోలేదు. మాకేం సంబంధం లేదని బిగ్ బాస్ టీం తలుపులు వేసుకుంది. నాగార్జున కూడా పారిపోయాడు. మీరే ఇవ్వండని మళ్లీ కోర్టుకే నోటీసులు ఇచ్చాను. ఇప్పుడు మళ్లీ కోర్టు నోటీసులు ఇచ్చింది. బిగ్‌బాస్ టీం తీసుకుంది కానీ, నాగార్జున తీసుకోలేదు. మళ్లీ ఆయనకు త్వరలోనే నోటీసులు వెళ్తాయి. కోర్టులోనే బిగ్ బాస్ విషయం తెలుస్తా” అని ఆయన సవాలు విసిరారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.