Bigg Boss Ayesha : తమిళ బిగ్ బాస్ లో దాదాపు 65 రోజులు పాటు ఉంది ఆయేషా. బిగ్బాస్ అనేది చాలా అద్భుతమైన అవకాశం అది రెండవసారి రావడం అనేది మామూలు విషయం కాదు అని రీసెంట్ గా జరిగిన ఒక ఎపిసోడ్ లో హౌస్మెట్స్ అందరితో కూడా చెప్పింది ఆయేషా.
హౌస్ లోకి బంధాల కోసం కాదు, గేమ్ ఆడటానికి వచ్చాము. గేమ్ జాగ్రత్తగా ఆడాలి. ఇండివిడ్యువల్ గా ఆడాలి. హౌస్ అంతా ఎలా తయారయింది అంటే ఒక బాయ్ ఫ్రెండ్, ఒక బాండింగ్ ఉంటే చాలు ఫైనల్ వరకు వెళ్లిపోవచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ సొంతంగా ఎవరు ఆడటం లేదు అని ఆ రోజు తనుజాతో మాట్లాడిన తరుణంలో ఫైర్ అయిపోయింది ఆయేషా.
ఆయెషా కెప్టెన్సీ టాస్క్ చేజార్చుకుంది. కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ జంటగా ఆడారు. గౌరవ్ సుమన్, ఆయెషా మాధురి, సాయి రమ్య పెయిర్ ఆడారు. ఈ టాస్క్ లో ఒకరు యాక్టివిటీ ఎరియాలో ఉన్న కాఫీన్ లో పెడతారు. మరోకరు గార్డెన్ ఎరియాలో ఉన్న కాజ్ కాఫిన్ లో కీ కోడ్ ఉంటుంది. దాన్ని బట్టి కాఫిన్ ముందుగా తెరిచిన వారు విన్.
ఇందులో ముందు ఆయెషా వెళ్తుంది. కానీ, కళ్లు కనిపించక కోడ్ సరిగా ఎంటర్ చేయలేదు. దీంతో ముందు గౌరవ్ తెరిచాడు. ఇక్కడ ఆయెషా తప్పయిన హౌజ్ లో ఫుల్ గా ఏడ్చింది. ముందు నేనే వెళ్లాను. నా సైట్ వల్ల పోయింది. అంటూ కాసేపు ఫుల్ డ్రామా చేసింది.
తనూజ నామినేషన్ లో ఆట మనమే ఆడాలని, మనల్ని ప్రూవ్ చేసుకోవాలని మాట్లాడింది ఆయేషా. ఇప్పుడు టాస్క్ లో ముందు పోయినా కూడా తన తప్పువల్ల పోయింది. తనకి గేమ్ రూల్ కూడా సరిగా అర్థం కాలేదు అని ఈజీగా అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ అయ్యింది. తనూజ నామినేషన్ లో అంత స్ట్రాంగ్ మాట్లాడిన ఆమె ఆటలో మాత్రం స్ట్రాంగ్ లేదు.
ఆమె ఆట అంత కేవలం మాటల వరకే ఉంది. గేమ్ లో లేదు. అలాగే నామినేషన్ లో బాల్ విషయంలో కూడా ఏడ్చి గౌరవ్ నుంచి బాల్ తీసుకుంది. కేవలం అరవడం మాత్రమే కానీ గేమ్స్ ఆడటం విషయంలో కొంత మేరకు వెనుక ఉంది ఆయేషా అని తన గేమ్ పర్ఫామెన్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఎప్పుడూ గలగల మాట్లాడే ఆయేషా కన్నీళ్లు పెట్టడం అనేది. ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కేవలం మాటలు చెబుతుంది కానీ గేమ్ మాత్రం సరిగ్గా ఆడటం లేదు అనేది ఆయేషా ను చూస్తే అర్థమవుతుంది.
Also Read: Kiran abbavaram: ఇంత ఓపిక ఎలా వచ్చింది అన్న? అంతా భలే తట్టుకుంటున్నావ్