OTT Movie : యాక్షన్ థ్రిల్లర్ అభిమానులకు ఒక అదిరిపోయే బెంగాలీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన మూడు నెలలకు ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ఒక అమ్మాయి మర్డర్ తో మొదలవుతుంది. ఆ అమ్మాయి చావుకు, తల్లి తీర్చుకునే రివేంజ్ కి థియేటర్ కూడా దద్దరిల్లిపోతుంది. ఈ సినిమా బెంగాలీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘మాడమ్ సెంగుప్త’ (Madam sengupta) 2025లో వచ్చిన బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. సయాంతన్ ఘోసల్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో రితుపర్ణా సెంగుప్త, రాహుల్ బోస్, కౌషిక్ సేన్, అనన్య చటర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 జూలై 4న థియేటర్లలో విడుదల అయింది. అక్టోబర్ 17 నుంచి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. IMDb లో దీనికి 8.7/10 రేటింగ్ కూడా ఉంది.
కలకత్తా మహానగరంలో అను రేఖ ఒక ప్రసిద్ధ కార్టూనిస్ట్. ఆమెకు పెళ్లితో పాటు, విడాకులు కూడా జరిగిపోయి ఉంటాయి. అయితే ఆమె జీవితంలో మరో ట్రాజీడీ జరుగుతుంది. ఆమె కుమార్తె అనన్య ఒక బెంగాలీ యూనివర్సిటీలో మర్డర్ అవుతుంది. అను రేఖకు ఈ మర్డర్ సాధారణమైనది కాదని, ఎవరో పక్కా ప్లాన్ తో చేశారని అనుమానిస్తుంది. ఆమె తన కుమార్తె మరణం వెనుక నిజం తెలుసుకోవడానికి విచారణ మొదలెడుతుంది. ఆమె ఎక్స్-హస్బెండ్ ను కూడా ఆమె అనుమానిస్తుంది. ఈ విచారణలో ఆమె కుమార్తె మరణం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని తెలుస్తుంది. ఈ కుట్రలో శక్తివంతమైన వ్యక్తులు, రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయినట్లు తెలుసుకుంటుంది.
Read Also : భార్య పోగానే గర్ల్ ఫ్రెండ్ తో హనీమూన్‌కు… మెంటల్ మాస్ ట్విస్టు మావా… క్రేజీ కొరియన్ హర్రర్ మూవీ