Bigg Boss 9:తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీజన్ ప్రారంభమైనప్పుడే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఇది చదరంగం కాదు రణరంగం అంటూ హౌస్ లో జరగబోయే పరిస్థితుల గురించి ముందే చెప్పేసిన విషయం తెలిసిందే. ఇక అందుకు తగ్గట్టుగానే ప్రతి విషయంలో కంటెస్టెంట్స్ సైతం ఆశ్చర్యపోయేలా భిన్న విభిన్నమైన టాస్క్ లతో ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ తొమ్మిదవ సీజన్ లోకి ఏకంగా తొమ్మిది మంది సెలబ్రెటీలు, 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా మరో ఆరుగురు సెలబ్రిటీలు హౌస్ లోకి వచ్చేసారు. వైల్డ్ కార్డు ఎంట్రీలు వచ్చిన తర్వాతే హౌస్ లో టాస్కులు మరింత ఆసక్తిగా మారాయి.
ఎలిమినేట్ అవుతారు అనుకున్న వారు కెప్టెన్లు అవుతున్నారు. మరొకవైపు టాప్ లో ఉంటారు అనుకున్న కంటెస్టెంట్లు అనూహ్యంగా ఎలిమినేట్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు సుమన్ శెట్టిపై ఆశలు వదులుకున్న అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. అందులో భాగంగానే ఈ వారం కెప్టెన్ గా గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇకపోతే ఈసారి ఏకంగా ఆరవ వారానికి సంబంధించి ఇద్దరు కెప్టెన్లు హౌస్ లోకి ఎన్నికవ్వడం గమనార్హం.
వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన గౌరవ్ గుప్తాతో పాటు సుమన్ శెట్టి ఇద్దరూ కూడా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి కెప్టెన్లుగా బాధ్యతలు చేపట్టారు. మొత్తానికైతే ఈ వారం ఇద్దరు కెప్టెన్లు అవ్వడమే కాకుండా ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకున్నారు అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా హౌస్ లో సుమన్ శెట్టి అసెంబ్లీని తలపించారు అని చెప్పవచ్చు. ఆయన కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సుమన్ శెట్టి మాట్లాడుతూ..”అధ్యక్ష సుమన్ శెట్టి అను నేను.. నీతిగా నిజాయితీగా ఉంటానని హామీ ఇస్తున్నాను” అంటూ ప్రామిస్ చేశాడు. ఇకపోతే సుమన్ శెట్టి చెప్పిన ఈ డైలాగుతో మొత్తం ప్రాంగణం అసెంబ్లీని తలపించిందని చూసే ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే సుమన్ శెట్టి తాను నటించిన సినిమాలోని డైలాగ్ ఇది అన్న విషయం అందరికీ తెలిసిందే . జయం సినిమాలో క్లాస్ రూమ్ లో జరిగే సన్నివేశంలో ఆయన ఒకసారి అధ్యక్ష అంటాడు అదే విషయాన్ని ఇక్కడ రిపీట్ చేశారు. మొత్తానికి అయితే కెప్టెన్సీ బాధ్యతను కూడా చాలా బాధ్యతగా నెరవేరుస్తానని హామీ ఇచ్చిన సుమన్.. ఏ మేరకు తన బాధ్యతను నెరవేరుస్తారో చూడాలి. మరి వారం రోజులపాటు ఈ కెప్టెన్సీ పదవి ఉంటుంది అన్న విషయం తెలిసిందే.
also read:Bigg Boss 9 Promo: పచ్చళ్ళ పాప కోరిక తీర్చిన బిగ్ బాస్.. అడుక్కుంటా అంటున్న ఇమ్మూ
ఈవారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్..
ఇకపోతే ఈ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా నామినేషన్స్ లోకి ఆరు మంది వచ్చారు. అందులో భరణి శంకర్ , తనూజ, డెమోన్ పవన్, దివ్యా నికిత, సుమన్ శెట్టి, రాము రాథోడ్ నామినేషన్స్ లోకి వచ్చారు. ఇందులో రాము రాథోడ్ , దివ్య నిఖిత డేంజర్ జోన్ లో ఉన్నారు.