Bigg Boss 9 Promo:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ కూడా ప్రసారం అవుతోంది. పైగా ఐదు వారాలు పూర్తి చేసుకోగా ఆరవ వారం కూడా చివరి దశకు చేరుకుంది. 5 వారాలకు గానూ మొత్తం 6 మంది హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయారు. పైగా ఐదవ వారం మరో ఆరుగురు హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. నిజం చెప్పాలి అంటే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య పోరు మరింత ఆసక్తిగా సాగుతోంది.
అందులో భాగంగానే తాజాగా 40వ రోజుకు సంబంధించిన రెండవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఈ రెండవ ప్రోమోలో నిర్వహించిన ఫిజికల్ టాస్క్ లో ఇద్దరు సరైన వ్యక్తులని బిగ్ బాస్ ఛాలెంజ్ కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో గెలిచేది ఎవరు? అనే సందేహాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. మరి తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ మాట్లాడుతూ.. నిఖిల్ మీ దగ్గర ఉన్న కంటెండర్ పవర్ ను ఉపయోగించి కెప్టెన్ అయ్యే సమయం ఆసన్నమైంది. కొత్తగా కెప్టెన్ బాధ్యతలను తీసుకున్న ఇద్దరిలో నుంచి ఒకరిని ఎంపిక చేసుకొని వారిని మీరు నేరుగా చాలెంజ్ చేయవచ్చు. ఒకవేళ ఆ ఛాలెంజ్ మీరు గెలిస్తే ఆ కొత్త కెప్టెన్ బాధ్యతలను మీరే తీసుకోవచ్చు అంటూ బిగ్ బాస్ తెలిపాడు.. ఇకపోతే కొత్తగా హౌస్ లోకి గౌరవ్ తో పాటు సుమన్ శెట్టి కొత్త కెప్టెన్లుగా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక నిఖిల్ సుమన్ శెట్టిని ఎంపిక చేసుకొని తన లెవెల్స్ ని తగ్గించుకోకుండా.. అతనికి దీటుగా ఉండే గౌరవ్ ను ఎంచుకొని సత్తా ఏంటో చాటడానికి సిద్ధం అయిపోయారు.
ALSO READ:Kantara Chapter 1: ఆస్కార్ బరిలోకి కాంతార 2..ఆ నమ్మకం వర్కౌట్ అవుతుందా?
టాస్క్ లో భాగంగా కాలు కింద పెట్టకుండా వెయిట్ బాగ్స్ ని హ్యాండిల్ చేస్తూ ఎవరు ఎక్కువ సేపు హ్యాండిల్ చేస్తారో వారే కొత్త కెప్టెన్ అని బిగ్ బాస్ టాస్క్ నిర్వహించారు. అందులో భాగంగానే సమయం మారే కొద్దీ వెయిట్ బ్యాగ్స్ జోడిస్తూ కింద కర్రలపై నిలబడ్డ వీరిని అటు ఒకసారి ఇటు ఒకసారి మార్చి నిలబడమని చెబుతూ కాస్త డిఫికల్ట్ గానే టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. పైగా ఇద్దరు జిమ్ బాడీస్.. సరైన వ్యక్తులు.. మరి ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు ? ఎవరు కొత్త కెప్టెన్ అవుతారు? అనే విషయం కాస్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. వీరిద్దరిలో ఎవరైతే హౌస్ లో కెప్టెన్ అవ్వకూడదు అనుకుంటున్నారో వారి వైపు సంచాలక్ చెప్పినట్టుగా వెయిట్ బ్యాగ్స్ జోడిస్తూ వారిని ఓడించే ప్రయత్నం చేయవచ్చని మిగతా కంటెస్టెంట్స్ కి కూడా టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. మరి ఇద్దరిలో ఎవరు ఫైనల్ గా కెప్టెన్ అవుతారో చూడాలి.