ONGC Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బిగ్ భారీ గుడ్ న్యూస్. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఢిల్లీ (ONGC) నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులకు పండగ లాంటి వార్త. పీజీ, బీఈడీ, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఇంటర్, టెన్త్, డిప్లొమా. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం ఉంటుంది. లక్షల రూపాయల్లో జీతాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు – వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫీజు గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఢిల్లీ (ONGC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,623 ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 6న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2623
ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఢిల్లీలో వివిధ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ల్యాబ్ కెమిస్ట్, అనలిస్ట్, పెట్రోలియం ప్రొడక్ట్స్, డిసిల్ మెకానిక్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సివిల్ ఎగ్జిక్యూటివ్, పెట్రోలియం ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
సెక్టార్లు – ఖాళీల వివరాలు..
1. నర్తర్న్ సెక్టార్: 165 పోస్టులు
2. ముంబయి సెక్టార్: 569 పోస్టులు
3. వెస్టర్న్ సెక్టార్: 856 పోస్టులు
4. ఈస్టర్న్ సెక్టార్: 458 పోస్టులు
5. సౌతర్న్ సెక్టార్: 322 పోస్టులు
6. సెంట్రల్ సెక్టార్: 253 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 16
దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 6
వయస్సు: 2025 నవంబర్ 6వ తేదీ నాటికి 18 నుంచి 24 ఏళ్ల వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
స్టైఫండ్: నెలకు ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.9,600 – రూ.10,560 స్టైఫండ్ ఉంటుంది. డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300 స్టైఫండ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ALSO READ: EMRS Jobs: 7267 ఉద్యోగాలు బ్రో.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, కొంచెం కష్టపడితే జాబ్ మీదే