Kiran abbavaram: షార్ట్ ఫిలిం బ్యాగ్రౌండ్ వచ్చిన అతి తక్కువ మంది హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. చాలా తక్కువ మంది షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి హీరో లైన్ వాళ్ళు ఉన్నారు. ఆ ప్రస్తావన వస్తే మొదటి వినిపించే పేరు కిరణ్ అబ్బవరం. రవి కిరణ్ కోల దర్శకత్వంలో వచ్చిన రాజా గారు రాణి గారు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ గా నిలిచింది. ఆ సినిమాతోనే కిరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
స్వతహాగా తనలో ఒక రైటర్ కూడా ఉండడంతో తను చేసిన రెండవ సినిమా ఎస్ఆర్ కళ్యాణమండపం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమా సక్సెస్ సాధించటంతో కిరణ్ కు వరుస అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్లాడు. అయితే అవకాశాలన్నీ కూడా డిజాస్టర్ గా మారిపోయాయి. కొంతకాలం గ్యాప్ తీసుకున్న తర్వాత క సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.
కిరణ్ అబ్బవరం మీద విపరీతమైన నెగిటివిటీ నడిచింది. వరుసగా కిరణ్ సినిమాలు వచ్చేయడంతో కొన్ని సినిమాల్లో కూడా కిరణ్ గురించి కామెడీ చేయడం మొదలుపెట్టారు. అయితే కిరణ్ వాటన్నిటిని తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడటం అనేది మామూలు విషయం కాదు.
ఆల్మోస్ట్ కిరణ్ అబ్బవరం పని అయిపోయింది అనుకున్న తరుణంలో క సినిమా తనకు ఊపిరి పోసింది. కాన్సెప్ట్ ను నమ్ముకుని కం బ్యాక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం కూడా కిరణ్ పైన నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. కిరణ్ వాటన్నిటిని కూడా చాలా సక్సెస్ఫుల్గా తట్టుకొని నిలబడుతున్నాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం.
తెలుగు సినిమా ఫిలిం జర్నలిస్టులు ఎలా ఉన్నారు అని కొత్తగా ఉదాహరణలు చెప్పాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళు హర్ట్ అవుతారు అని మినిమం ఆలోచన కూడా లేకుండా విపరీతంగా కామెంట్స్ చేయటం అలవాటైపోయింది. ఏ ప్రశ్న పెడితే ఆ ప్రశ్న అడగడం కూడా అలవాటు చేసుకున్నారు జర్నలిస్టులు.
ప్రదీప్ రంగనాథన్ ను హీరో మెటీరియల్ కాదు కదా అని డైరెక్ట్ గా అనేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి కూడా కిరణ్ అబ్బవరం రియాక్ట్ అవుతూ నన్ను ఏవైనా అడగండి నేను తీసుకుంటాను. కానీ పక్క రాష్ట్రం నుంచి మన దగ్గరికి ఒకరు వచ్చినప్పుడు వాళ్ళని రెస్పెక్ట్ చేయటం అనేది మన గౌరవం అని కిరణ్ మాట్లాడిన విధానం రీసెంట్ గా చాలామందిని ఆకట్టుకుంది. రేపు కిరణ్ నటిస్తున్న K-Ramp సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల కానుంది. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.
Also Read: Pawan Kalyan: తమిళ్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా ప్లానింగ్, మళ్లీ ఎందుకని ఆ రిస్కు?