Ritu Chaudhary: బిగ్బాస్ సీజన్ 9 చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి 40 రోజులు బిగ్ బాస్ హౌస్ పూర్తి చేసుకుంది. హౌస్ మేట్స్ అందరూ అలవాటు పడిపోయారు అనుకున్న టైంలో కొత్తగా ఆరుగురుని హౌస్ లోకి పంపించి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. చెప్పిన మాదిరిగానే ఫైర్ స్ట్రోమ్ వచ్చిన తర్వాత ఎపిసోడ్ కొంచెం ఆసక్తికరంగా జరగటం మొదలవుతుంది.
ఇది చదరంగం కాదు రణరంగం అన్నట్లు అచ్చం అలానే కొనసాగుతుంది ఎపిసోడ్. హౌస్ లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్న సంగతి తెలిసిందే. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లో ఎంట్రీ ఇస్తూనే కళ్యాణ్ పైన అమ్మాయిలు పిచ్చి అంటూ కామెంట్ చేసింది. మరోవైపు పవన్తో క్లోజ్ గా మూవ్ అయ్యే ప్రయత్నాలు కూడా చేస్తుంది అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య. మరోవైపు పవన్ రీతుతో పులిహోర కలుపుతూ తమ బాండింగ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
హౌస్ లోకి సంజన ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఒక గుడ్డు గురించి బీభత్సమైన గొడవ జరిగిన సంగతి తెలిసిన విషయమే. హౌస్ మొత్తం అల్లుకొల్లలు అయిపోయినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు సంజన. అప్పటినుంచి సంజనాను ఒక దొంగగా హౌస్ మేట్స్ అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. ఆవిడ కోసం ప్రత్యేకంగా బోర్డు కూడా తయారు చేశారు.
ఇప్పుడు సంజనాన్ని మించిన దొంగ రీతు అని అర్థమవుతుంది. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యకు ఒక ఫుడ్ పవర్ అనేది బిగ్ బాస్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిని ఉపయోగించుకొని నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకునే ఆప్షన్ రమ్య మోక్షకి ఉంది. అయితే ఫుడ్ పార్టనర్ గా సుమన్ శెట్టిని ఎంచుకున్న విషయం కూడా తెలిసిందే.
హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ రీతు వెనక తిరుగుతున్నాడు. లవ్ లేదు అంటూనే రీతు హగ్ ఇస్తే మురిసిపోతున్నాడు. మరోవైపు రమ్య కూడా పవన్ మీద ఆసక్తిగా ఉన్నట్లు నిన్నటి ఎపిసోడ్ చూస్తే తెలిసింది.
ఈ తరుణంలో రమ్యకు వచ్చిన ఫుడ్ లోని ఐస్ క్రీమ్ ని రీతు,తనుజ, దివ్య దొంగతనంగా తిన్నారు. ఇది హౌజ్ లో రచ్చ అయ్యే అవకాశం ఉంది. అసలే రమ్య, రీతూ మీద కోపంగా ఉంది. ఈ విషయం తెలిస్తే చాలా గొడవ జరగడం ఖాయం.
ఈ పాయింట్ తో రీతూని టార్గెట్ చేయొచ్చమో అసలు విషయం తెలిస్తే. ఇప్పుడు బయట పడక పోయినా వీకెండ్ లో నాగార్జున బయటపెడతే.. ఆ నెక్ట్స్ వీక్ నుంచి రమ్యకు రీతూ టార్గెట్ అవ్వోచ్చు. అసలే లవ్ ట్రాక్. ఇప్పుడు ఐస్ క్రీం దొంగతనంతో రమ్య రీతూని పగపట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: Bigg Boss Ayesha : కెప్టెన్సీ చేజర్చుకోవడమే కాకుండా సైకో బిహేవియర్, కొంచెం డేంజర్ లా ఉందేంటి?