BSNL Offers: బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లందరికీ దీపావళి బొనాంజా ఆఫర్లను ప్రకటించింది. దీపావళి పండుగ నేథ్యంలో కొత్త కస్టమర్ల నుంచి వినియోగదారుల వరకు, వ్యక్తిగత వినియోగదారుల నుండి వ్యాపారుల వరకు, సీనియర్ సిటిజన్లందరికీ ప్రత్యేక ప్రయోజనాలతో పండుగ ఆఫర్ల ప్రవేశపెట్టింది. అక్టోబర్ 18, 2025 నుండి నవంబర్ 18, 2025 వరకు ఈ బొనాంజా అందుబాటులో ఉంటుంది. కొత్త కస్టమర్ల కోసం దీపావళి బొనాంజా 4G ప్లాన్ అమలు చేస్తుంది.
దీపావళి కొత్త కనెక్షన్లను రూ.1కే అందిస్తుంది. ఈ ప్లాన్ లో కొత్త కస్టమర్లకు ఒక నెల ఉచిత మొబైల్ సేవలను అందిస్తుంది. కొత్త వినియోగదారులు 30 రోజుల అపరిమిత కనెక్టివిటీని పొందుతారు.
బీఎస్ఎన్ఎల్ మరో సూపర్ గిఫ్ట్ ను ప్రకటించింది. అక్టోబర్ 20, 18, 19, 20 తేదీల్లో సెల్ఫ్-కేర్ యాప్ లేదా BSNL వెబ్‌సైట్ ద్వారా 100 లేదా అంతకంటే ఎక్కువతో రీఛార్జ్ చేసుకునే ప్రతి BSNL వినియోగదారుడు లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. పది మంది కస్టమర్లకు ప్రతిరోజూ ఒక్కొక్కరు 10 గ్రాముల వెండి నాణేలు గెలుచుకునే అవకాశం ఉంటుంది.
బీఎస్ఎన్ఎల్ కార్పొరేట్ క్లయింట్‌ల కోసం ప్రత్యేక కార్పొరేట్ కాంబో ఆఫర్‌లను ప్రకటించింది. కనీసం 10 కొత్త పోస్ట్-పెయిడ్ BSNL కనెక్షన్‌లు, ఒక FTTH కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు, మొదటి నెల ఎఫ్ఎంసీ పై 10% తగ్గింపు ఇస్తారు.
బీఎస్ఎన్ఎల్ “గిఫ్ట్ ఎ రీఛార్జ్” ఈవెంట్ ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా బీఎస్ఎన్ఎల్ కస్టమర్ దీపావళి బహుమతిగా తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ప్రీపెయిడ్ రీఛార్జ్ లేదా టాప్-అప్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. మీ తల్లిదండ్రులు వేరే నగరంలో ఉంటే లేదా మీరు స్నేహితుడిని ఆశ్చర్యపరచాలనుకున్నా, టాక్-టైమ్ లేదా డేటాను బహుమతిగా ఇవ్వవచ్చు.
అదనపు ఫెస్టివల్ బోనస్‌గా BSNL ప్రతి రీఛార్జ్‌పై కొంచెం అదనపు విలువను అందిస్తుంది. 2.5 శాతం అదనపు ప్రయోజనం పొందవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 18, 2025 నుండి నవంబర్ 18, 2025 వరకు అమలులో ఉంటుంది.
BSNL దీపావళి బొనాంజాలో భాగంగా సీనియర్ సిటిజన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా, డిస్కౌంట్ టారిఫ్‌లు, అదనపు ప్రయోజనాలు, ఎక్కువ వాడుకలో సౌలభ్యంతో రూపొందించారు.
సీనియర్ సిటిజన్ కోసం ఈ కొత్త కనెక్షన్ ఆఫర్ అక్టోబర్ 18, 2025 నుండి నవంబర్ 18, 2025 వరకు అమలులో ఉంటుంది. BSNL సెల్ఫ్-కేర్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా రూ.485 మరియు రూ.1,999 ప్లాన్‌లపై 5% పండుగ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 18, 2025 నుండి నవంబర్ 18, 2025 వరకు కొనసాగుతుంది.
Also Read: Bangalore News: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య
BSNL ప్రతి రీఛార్జ్‌పై అదనపు విలువను అందిస్తోంది. ఇచ్చిన మొత్తంపై 2.5% అదనపు ప్రయోజనాలు పొందుతారు. ఈ ప్రమోషన్ అక్టోబర్ 18, 2025 నుండి నవంబర్ 18, 2025 వరకు అమలులో ఉంటుంది. ఏమైన సందేహాలు ఉంటే సమీపంలోని BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) ని సందర్శించవచ్చు లేదా 1800-180-1503 కు డయల్ చేయండి లేదా bsnl.co.in ని సందర్శించండి.