Bigg Boss 9 Day 40 Episode Review: హౌజ్ తగ్గేదే లే అంటూ కదిలిస్తే గొడవలకు దిగుతూ.. హౌజ్ ని హీటెక్కిస్తుంది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ నుంచి ఇంట్లో ఫైర్ స్ట్రోమ్ చూపిస్తోంది మాధురి. తప్పు తనదైన, ఎదువాళ్లదైనా.. శివంగిలా రెచ్చిపోయిన మాధురి తొలిసారి కన్నీరు పెట్టుకుంది. ఇంతకి మాధురిని బాధపెట్టిన విషయం ఏంటీ? అసలు హౌజ్ లో ఏం జరిగిందో చూద్దాం.
నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్ ఫస్ట్ లెవెల్లో ఒక్క సుమన్ తప్ప ఓల్డ్ హౌజ్ మేంట్స్ అంత ఒడిపోయారు. ఫైర్ స్ట్రోమ్స్ తో పాటు సుమన్ కూడా కెప్టెన్సీ టాస్క్ కు ఎన్నికయ్యాడు. నేటి కెప్టెన్సీకి పోటీ జరిగింది. అయితే ఈ లెవల్ ని పెయిర్ గా ఆడాల్సి ఉంది. ఎవరూ ఎవరితో పెయిర్ అవుతారనేది కూడా బిగ్ బాస్ కంటెండర్స్ చేతిలో పెట్టాడు. దీంతో గౌరవ్ సుమన్ ని, సాయి రమ్యని, ఆయెషా మాధురిని అనుకున్నారు. కెప్టెన్సీ ట కోసం ‘విడిపించు గెలుపోందు’ టాస్క్ ఆడి గెలవాలి. . ఈ టాస్క్ లో గెలిచిన ఇద్దరు హౌజ్ కెప్టెన్స్. ఇందుకోసం జంటలో ఒకరు యాక్టివిటీ ఏరియాలో అమర్చిన కాఫీన్ లో పెట్టి తాళం వేస్తారు.
ఆ ఏరియా మొత్తాన్ని డార్క్ చేశారు. అయితే వారిని దాచిన కాఫిన్ జంటలో మరోకరి కనిపెట్టి.. వారి క్లూ ఆధారం తాళం కనుక్కొని కాఫిన్ తెరవాలి. మాధురి, రమ్య, సుమన్ లో కాఫిన్ లో పెట్టి తాళం వేశారు. ఈ టాస్క్ లో మొదట ఆయెషా యాక్టివిటి రూంకి వెళ్లింది. కానీ, ముందుగా కాఫిన్ తెరవలేకపోయింది. మాధురి కోడ్ చెప్పిన తను తెరవలేకపోయింది. పైగా కీ కోసం మధ్యలో కన్ ఫ్యూజ్ అయ్యింది. ఆ తర్వాత సాయికి వచ్చినా అతడు కూడా కాఫిన్ తెరవలేకపోయాడు.ఈ గ్యాప్ లో గౌరవ్ వచ్చి సుమన్ కాఫిన్ తెరిచి గార్డెన్ ఎరియాలో ఉన్న బెల్ కొట్టేశాడు. అయిన ఆయోషా, సాయిలు ఇంకా కాఫిన్ తెరవడం దగ్గరే ఉండిపోయారు.
ఎలాగోలా ఆయెషా కాఫిన్ తెరించింది. తను ఆడలేకపోవడానికి కారణం తన సైట్ అని, తన కళ్లు వల్లే కెప్టెన్సీని కోల్పాయనంటూ బోరుమని ఏడ్చింది. కానీ, ఆమె మాత్రం తనని తని కొట్టుకుంట సెల్ఫ్ హార్మ్ చేసుకుంది. ఓవైపు మాధురి ఆయెషాను సమర్థిస్తూనే కెప్టెన్సీ చేజారడంపై మాధురి కూడా కన్నీరు పెట్టుకుంది. కాసేపు ఏడ్చి ఆ తర్వాత నార్మల్ అయ్యింది.
ఆ తర్వాత రీతూ రమ్య ఐస్ క్రీం దొంగతనంగా తినేసింది. తనూజ, దివ్యలు కూడా వెళ్లి రీతూతో జాయిన్ అయ్యారు. తలా ఒక స్పూన్ టెస్ట్ చేశారు. కెప్టెన్సీ జారడంతో డీలా అయిన ఆయెషా మళ్లీ దూకుడు చూపించింది. తన డ్రెస్ స్టీమ్ పట్టివ్వవా హెల్ప్ అడిగిన కళ్యాణ్ కి కాసేపు క్లాస్ పీకింది. నేను ఏమైనా పనిమనిషినా.. నా పని నేనే చేసుకోనూ పక్కవాళ్లది చేస్తానా. ఇక్కడ అందరికి హెల్ప్ కావాలి. కానీ, ఇక్కడ ఎవరూ ఎవరు ఎవరిని ప్యాంపర్ చేయరు. ఎవరీ గేమ్ వాళ్లు ఆడుకోవాల్సింది. బిగ్ బాస్ అంటే ఒక్క టాస్క్ మాత్రమే అనుకుంటున్నారంటూ హితబోధ చేసింది.