OTT Movie : 2022 లో వచ్చిన ‘కాంతార’ సినిమా ఒక సంచలనమే సృష్టించింది. రిషబ్ శెట్టి దర్శకుడిగా, కథానాయకుడిగా, ఈ సినిమాలో వన్ మ్యాన్ షో ఇచ్చాడు. ఈ సంచలనం ఇంకా కళ్ళముందు కనబడుతుండగానే, ‘కాంతార: చాప్టర్ 1’ తో మరోసారి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. అయితే ‘కాంతార: చాప్టర్ 1’ రావడంతో, 2022 లో వచ్చిన ‘కాంతార’ ఓటీటీలో ట్రెండింగ్ అవుతోంది. అందరూ ఈ సినిమాని సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. వీటి వివరాలను తెలుసుకుందాం పదండి.
‘కాంతార: చాప్టర్ 1’ 2025 అక్టోబర్ 2న రిలీజ్అవ్వడంతో పాటు, బాక్స్ ఆఫీస్‌లో భారీ హిట్ కొట్టింది. 10 రోజుల్లో ₹400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంకా కలెక్షన్ల పరంపర కొనసాగుతోంది. ఈ హైప్ వల్ల ఒరిజినల్ ‘కాంతార’, Netflix లో 4వ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. చాప్టర్ 1 రిలీజ్ తర్వాత, పాత మూవీని అందరూ రీవాచ్ చేస్తున్నారు. అయితే మొదటి మూడు స్థానాల్లో ‘సెర్చ్: ది నైనా మర్డర్ కేస్’ (హిందీ వెబ్ సిరీస్). వార్ 2 (హిందీ యాక్షన్ మూవీ), కురుక్షేత్ర: ది గ్రేట్ వార్ ఆఫ్ మహాభారత (యానిమేటెడ్ సిరీస్) వంటి సినిమాలు ఉన్నాయి.
Read Also : ఏం సిరీస్ గురూ… సరస్సులో అమ్మాయి మృతదేహం… ప్రైవేట్ వీడియో లీక్… క్షణక్షణం ఉత్కంఠ, బుర్రబద్దలయ్యే ట్విస్టులు
ఈ కథ కర్ణాటక లోని ఒక గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక రాజు తన భూమిని పంజుర్లి దైవానికి ఇస్తాడు. కథ 1990కి టర్న్ తీసుకుంటుంది. శివ అనే యువకుడు ఆ గ్రామంలో, ఒక దూకుడు స్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. అయితే అతను తన గ్రామాన్ని, తన మనుషులను చాలా ప్రేమిస్తుంటాడు. రాజు వారసుడైన దేవేంద్రతో భూమి విషయంలో గొడవపడతాడు. అదే సమయంలో శివ, లీలతో ప్రేమలో పడతాడు. కానీ ఫారెస్ట్ ఆఫీసర్ మురళీతో విరోధం పెట్టుకుంటాడు. ఎందుకంటే మురళీ ఆ గ్రామ భూమిని కాపాడాలనుకుంటాడు. ఈ సమయంలో దేవేంద్ర ల్యాండ్ కబ్జా చేయడానికి ప్లాన్ చేస్తాడు. దీంతో మొదటగా శివను టార్గెట్ చేస్తాడు. క్లైమాక్స్‌లో శివ దైవ శక్తిని (పంజుర్లి రూపం) తీసుకుని, భారీ యాక్షన్ సీన్‌లో దేవేంద్రను ఓడిస్తాడు. ఆ గ్రామంలో ఉండే భూమిని కాపాడతాడు. క్లైమాక్స్ ఉత్కంఠభరితంగా సాగుతుంది.