Bigg Boss 9 Telugu Day 57 Episode Review: ఫుడ్ మానిటర్ గా సంజన ఎక్స్ ట్రా కర్రీ వేసుకోవడంపై తనూజ చేసిన గొడవ గురించి వివరణ ఇచ్చుకుంది. హౌజ్ లో అంత వేసుకుంటున్నప్పుడు ప్రశ్నించినప్పుడు మిగతా వాళ్లను చూడవా? సంజన వేసుకోలేద అంటున్నారు. అది మీకు ఎక్స్ ప్లేయిన్ చేస్తుంటే నువ్వు వినిపించుకోలేదు. ఇమ్మూ అయితే మీకు బాగా చెప్తారని అని చెప్పగానే.. సంజన నాకు నిన్ను అసలు పాయింట్ చేయాల్సిన అవసరం లేదు. నేను నా ఆట ఫోకస్ పై ఉన్న అంటూ చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత నామినేషన్స్ ప్రాసెస్ మొదలైంది. గతంలో లాగే ఈసారి కూడా బొమ్మలే టాస్క్ పెట్టారు. బజర్ మోగగానే వేరే వారి ఫోటో ఉన్న బొమ్మ పట్టుకుని సేఫ్ జోన్ లోకి వెళ్లాలి. అలా చివరిగా వెళ్లినవారు వారి చేతిలో ఉన్న బొమ్మ మీద ఎవరి ఫోటో ఉంటే వాళ్లు నామినేషన్ లో ఉంటారు. వీరిద్దరి ఎవరూ స్ట్రాంగ్ అని డిఫెండ్ చేసుకోవాలి. అందులో ఎవరి పాయింట్ స్ట్రాంగ్ ఉంటే వారిని సంచాలక్ సేఫ్ చేసి మరోవ్యక్తిని నామినేట్ చేయాలి. మొదటి రౌండ్లో సంజన సింగిల్ అయిపోయింది. తన బొమ్మ ఎవరూ తీసుకోకపోవడంతో సంజన తన బొమ్మతో తానే బయట ఉండిపోయింది.
దీంతో సంచాలక్ కెప్టెన్ దివ్యని సంజనతో ఒకరిని స్వాప్ చేయాలని ఆదేశించగా.. దివ్య రీతూని స్వాప్ చేసింది. రీతూ, పవన్ సాయంతోనే మొదటి నుంచి టాస్క్ ఆడుతుందని పాయింట్ పెట్టింది. దానికి రీతూ స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసింది. హౌజ్ లోకి అందరికి ఒక బాండ్ ఎలా ఉందో తనకు అలాగే డిమోన్ తో ఉందని చెప్పింది. ఎవరూ ఏం అనుకున్న తాను డిమోన్ తో బాండింగ్ అలాగే ఉంటుందని ఇచ్చిపడేసింది. అంతేకాదు బాండింగ్స్ ఉన్న ఎవరో వచ్చి నా ఆట ఆడాలని చూడలేదని.. మొదటి నుంచి నా ఎఫర్ట్స్ పెట్టుకుంటునే ఉన్నానని చెప్పింది. వీరిద్దరిలో రీతూ స్ట్రాంగ్ అనిపించడంతో దివ్య సంజనను నామినేట్ చేసింది.
నామినేషన్ లో రీతూని అన్న మాటాలకు సంజన ఏడ్చింది. కారణాలు లేక తన బాండింగ్స్ గురించి మాట్లాడనని, నా కోసం హెయిర్ కట్ చేయించుకున్న రీతూ ఎప్పుడు ఏం అనకుండ ఉండాలనుకున్న, కానీ తప్పలేదంటూ కోళాయి తెరిచింది. ఇది చూస్తున్న వారికి అంత డ్రామాలా అనిపించింది. గౌరవ్ కూడా అదే అంటూ కెమెరాలతో మాట్లాడాడు. నెక్ట్స్ రౌండ్ లో తనూజ బొమ్మ పట్టుకున్న సుమన్ లాస్ట్ లో వెళ్లాడు. దీంతో తనూజ సుమన్ లు నామినేషన్ కి రాగా.. సుమన్ తనదే తప్పు పరుగెత్తలేకపోయానంటూ తనని తానే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానంటాడు.
తనూజ కూడా సుమన్ తో తనకు ఎలాంటి పాయింట్స్ లేవు కానీ, తాను హౌజ్ లో ఎందుకు ఉండాలో చెప్పింది. ఇద్దరిలో తనూజ స్ట్రాంగ్ ఉందని సుమన్ ని నామినేట్ చేసింది సంచాలక్ సంజన. ఇక్కడ బొమ్మలు తమ నామినేషన్ పాయింట్స్ ఉన్నవాళ్లవి తీసుకోవాలి. కానీ, తమ ఫెవరేట్ వాళ్లవి తీసుకుని వెళుతున్నారు టాస్క్ రూల్స్ బ్రేక్ చేస్తుండటం బిగ్ బాస్ నియమాలు మార్చారు. ఈ రౌండ్ లో ఎవరూ చివరిగి సెఫ్ జోన్ వెళతారో వాళ్లు వాళ్ల దగ్గర ఉన్న బొమ్మ ఫోటో ఉన్నవారు నామినేషన్ లోకి వస్తారు.
మూడో రౌండ్ లో డిమోన్ ముందుగా సేఫ్ జోన్ కి సాయి చివరిగా వెళ్లాడు. సాయి దగ్గర డిమోన్ బొమ్మ ఉండటంతో సంచాలక్ గా ఉన్న డిమోన్ నామినేషన్ పాయింట్ వచ్చాడు. డిమోన్ భరణిని సాయి, తనూజని నామినేట్ చేశాడు. భరణి ముందు నుంచి సేఫ్ ఆడుతున్నారు. సిచ్చ్యవేషన్ బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఆ తర్వాత క్షమాపణలు చెబుతున్నాడు. హౌజ్ లో ఎక్కువ సేఫ్, సారీ చెబుతున్నారనే కారణంతో భరణిని నామినేట్ చేశాడు. తనూజ కొత్త గా వచ్చిన వాళ్ల పట్ట పార్శల్ గా ఉంటుంది. సేఫ్ గేమ్స్ ఆడుతుంది. ఈ పాయింట్ పై ఎలా వివరణ వినాలనుకుంటున్న అంటూ తనూజని సాయి నామినేట్ చేశాడు. ఈ క్రమంలో నామినేషన్ లో తనూజ, భరణి మధ్య నామినేషన్ వార్ వచ్చింది.
న నామినేషన్ తనూజని అని చెప్పాడు. నేను రెండు టాస్క్‌ల్లో తనూజని సేవ్ చేశాను.. కానీ, తనూజ నన్ను ఏ టాస్క్‌లో సేవ్ చేయలేదు అని భరణి అననాడు.దానికి ఒక టాస్క్‌లో సేవ్ చేశారు.. ఎందుకంటే అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి అని సులువుగా సమాధానం ఇచ్చింది తనూజ. తనకంటే నేనే టాస్క్‌లు బాగా ఆడుతున్న అన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. మాట్లాడితే ఇమ్మాన్యుయే, దివ్య అంటుంటే మధ్య తనూజ మాట, వాయిస్ అక్కడ స్పేస్ ఎక్కడ ఉందని గట్టిగా అరిచింది. ఏం మాట్లాడిన మై పర్సనల్.. మై పర్సనల్ అంటున్నారు. మీకు ఏమైనా పర్సనల్ ఉంటే పోయి బయటపెట్టుకోండి హౌజ్‌లో కాదని మాట్లాడింది.
ఏదైతే బాండింగ్స్ పేరుమీద నేను బయటకు వెళ్లానో.. ఒక్కసారి తను కూడా బాధ్యత తీసుకుని బయటకు వెళితే పరిస్థితులు అర్థమవుతాయి.. అందుకు తనూజ బయటకు వెళ్లాలని కోరుకుంటున్న అని భరణి తన అభిప్రాయం చెప్పాడు. ఈ ఇద్దరి తనూజ పాయింట్స్ స్ట్రాంగ్ గా ఉండటంతో దివ్య భరణిని నామినేట్ చేసింది. ఆ తర్వాత పక్కన కూర్చోన తనూజ, దివ్యలు మాట్లాడుకుంటున్నారు. హౌజ్ భరణి కారు మీ బ్రదర్ అనే ఫీలింగ్ ఆయన తనని తాను డిఫెండ్ చేసుకోవట్లేదని నువ్వు ఆయన తరపున నిలబడి మాట్లాడుతున్నాడు. ఇక్కడ అది బ్యాడ్ గా వెళుతుందని, ఆయన గేమ్ ఆయనని ఆడనివ్వు అంటూ చెబుతుండగా.. మీరు ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి.. కానీ, నా ప్రస్తావన తీసుకురాకండి ప్లీజ్ అని భరణి వారిని హెచ్చరించాడు. ఈ రోజు నామినేషన్ తో ఈ తండ్రి కూతుళ్ల బాండింగ్ తెగిపోతుందేమో అనిపిస్తుంది.
ఇక ఈ ముగ్గురు బాండింగ్ వదిలేసి ఎవరికి వారే అన్నట్టు అనిపిస్తోంది. నెక్ట్స్ నామినేషన్ లో తనూజ, రీతూలు చివరిగా వెళ్లారు. పవన్ మొదట వెళ్లి సంచాలక్ గా ఉన్నాడు. తనూజ ఇమ్మాన్యుయేల్ ని నామినేట్ చేసింది. మాస్క్ పెట్టుకుని చాలా సేఫ్ గా గేమ్ ఆడుతున్నాడని, ఇప్పటికైనా మాస్క్ తిసి ఆడతాడని అనుకుంటున్న అంటుంది. దీంతో నా భుజాల వరకు మోయగలిగేంత వరకు మోస్తాను.. బరువైనప్పుడు దింపేస్తా. బరువు అన్నప్పుడు మోయద్దని తనూజ చెప్పింది. అందుకే దింపేశా అంటాడు. బెడ్ టాస్క్ లో సేఫ్ గేమ్ ఆడవని తనూజ అంటే.. అక్కడ నువ్వు ఏమైనా ఆడాననుకుంటున్నావా? నేను చెప్పడం వల్ల నువ్వు ఇక్కడికి వరకు వచ్చావు.
బెడ్ టాస్క్ లో వీరనారిలా ఆడితే లేవు.. నువ్వు చీరకట్టుకుని పెళ్లి కూతురిలా ఉంటే నేను అందరిని అడగడం వల్ల నువ్వు టాప్ లో ఉన్నావంటూ ఇమ్మాన్యుయేల్ తనూజతో డిఫెండ్ చేసుకున్నాడు. ఆ తర్వాత రీతూ రాముని నామినేట్ చేసింది. రాము వచ్చి కళ్యాణ్ ని నామినేట్ చేశాడు. మొన్నటి టాస్క్ లో సంచాలక్ గా సుమన్, కళ్యాణ్ లు ఫెయిల్ అయ్యాడనే కారణంతో నామినేట్ చేశాడు. చివరికి ఇమ్మూ, కళ్యాణ్ లో సంచాలక్ డిమోన్.. కళ్యాణ్ నామినేట్ చేసి ఇమ్మాన్యుయేల్ ని సేఫ్ చేశాడు. నెక్ట్స్ రౌండ్ లో చివరిగా డిమోన్, రీతూ ఉన్నారు. ఇమ్మాన్యుయేల్ తనూజని నామినేట్ చేశాడు. సేఫ్ గేమ్ ఆడుతుందని, భరణి అన్న వచ్చి కత్తి ఇస్తే వద్దు అని అన్నది. అలా వద్దు అని సేఫ్ గేమ్ ఆడిందనిపించింది అని చెప్తాడు. రీతూ మళ్లీ రాముని నామినేట్ చేసింది. కెప్టెన్ టాస్క్ లో ఫెయిర్ డెసిజన్ ఇవ్వలేదంటూ రాముని ఓటేసింది.
ఫైనల్ గా నామినేషన్ లో తనూజ, రాములు వచ్చారు. వీరిద్దరి తనూజనే స్ట్రాంగ్ అని, రీతూ అన్నట్టు హోం సిక్ తో టాస్క్ లు ఆడలేకపోయానంటూ రాము స్వయంగా నామినేషన్ లోకి వచ్చాడు. ఆ తర్వాత గౌరవ్, తనూజలు చివరిగా నిలిచారు. వారిలో ఇద్దరు లోపలికి వెళ్లాలి. కానీ, ఇద్దరు వెళ్లలేదు. దీంతో గౌరవ్ చేతిలో నిఖిల్, తనూజ చేతిలో ఇమ్మాన్యుయేల్ బొమ్మ ఉండటంతో వారు వచ్చి నామినేషన్ మొదలు పెట్టారు. దీంతో ఇమ్మాన్యుయేల్ వచ్చి సాయిని, నిఖిల్ తనూజని నామినేట్ చేశాడు. తనూజ స్ట్రాంగ్ కంటెస్టెంట్, బయట ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి.. తను సేఫ్ అవుతుందని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. చివరికి వీరిద్దరి తనూజ పాయింట్స్ స్ట్రాంగ్ ఉన్నాయని సంచాలక్ డిమోన్ సాయిని నామినేట్ చేశాడు. తర్వాత బిగ్ బాస్ కెప్టెన్ దివ్యకి డైరెక్ట్ నామినేషన్ పవర్ ఇవ్వగా.. ఆమె తనూని నామినేట్ చేసింది. దీంతో రాము త్యాగం వృథా అయ్యింది. దీంతో ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, సాయి, తనూజ, రాము నామినేషన్ లో నిలిచారు.