Meghana- Indraneel : సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు. అటు టీవీ సీరియల్స్ లో నటిస్తున్న వాళ్లు సైతం ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ రోజుల్లో మాత్రమే కాదు గతంలో కూడా చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమధ్య చేసుకున్న వాళ్లయితే మనస్పర్థలతో విడాకులు తీసుకుంటున్నారు కానీ.. ఆ రోజుల్లోని వాళ్ళు ఇప్పటికీ కలిసి ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.. అలాంటి వారిలో హరిత జాకీ, ప్రీతీ నిగమ్ వంటి వారితో పాటుగా చక్రవాకం సీరియల్ యాక్టర్స్ ఇంద్ర నీల్, మేఘన జంట ఒకటి. వీరిద్దరూ కూడా సీరియల్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు.. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు.. కానీ పెళ్లయి 20 ఏళ్ల అయినా సరే వాళ్ళ జీవితంలో కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన మాత్రం అలానే ఉండిపోయింది.. ఇంతకీ ఆ ఘటన ఏంటి? అసలు ఏం జరిగిందో అన్న దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇంద్రనీల్ కన్నా మేఘన చాలా పెద్దది. అయినా ప్రేమకు వయసు అడ్డురాదని ఆ ఇద్దరూ కూడా తమ కుటుంబాలలోని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.. ఆ తర్వాత నుంచి పలు సీరియల్స్ సినిమాలలో నటించిన ఈ ఇద్దరు కూడా ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా తమ దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వీరికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్న విషయం తెలిసిందే. దాని ద్వారా ఫుడ్ కు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తుంటారు. అయితే వీరి పెళ్లి అయ్యి 20 ఏళ్లు అయినా సరే ఇంకా వీళ్ళకు పిల్లలు కలగలేదు. ఇదే తమకు జీవితంలో కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటనని అనేక ఇంటర్వ్యూలలో ఈ జంట బయటపెట్టారు. ఎంతో ప్రేమగా ఉండే మాకు మా ప్రేమకు ప్రతిరూపంగా ఒక బిడ్డ ఉంటే బాగుండేది అని ఈమధ్య పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈ జంట బయటపెట్టారు.. ఎంతో అన్యోన్యమైన జంట వీళ్ళకి ఒక బాబు గానీ పాప ఉంటే బాగుండేది కదా అని నెటిజన్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
2002లో పెళ్లి చేసుకున్న ఈ జంట అప్పట్లో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండేవారు. అయితే తల్లినైనా కొన్ని రోజులకి వరుసగా సీరియల్ చేసే అవకాశం రావడంతో మేఘన అతి కష్టం మీద ఒప్పేసుకుందట.. కానీ ఓ సీరియల్ షూటింగ్ వల్ల గర్భస్రావం అయ్యిందని మేఘన ఇటీవల ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ప్రెగ్నెన్సీతోనే ఒకసారి సీరియల్ షూటింగ్‌కు వెళ్లాను. అప్పుడు నాకు రెండో నెల అనుకుంటా.. ఈ సీరియల్ షూటింగ్ సమయంలో 40 సార్లు పైకి కిందకి మెట్లు ఎక్కించాడు. దాంతో నాకు గర్భస్రావం అయింది. ఆ తర్వాత పిల్లలు పుట్టే అవకాశం కోల్పోయాను అని ఆమె అన్నారు. ఆ తర్వాత ఆమెకు పెళ్లి అయ్యే భాగ్యం లేకుండా పోయింది అని బాధపడ్డారు. దాదాపు 50 కి దగ్గరలో ఉన్న ఈ టైంలో పిల్లల్ని కావాలి అనుకోవడం తప్పే.. మాకు పిల్లలు లేకపోయినా సరే.. మాకు మేమే పిల్లలం అని ఆమె అన్నారు. ప్రస్తుతం సీరియల్స్లలో పెద్దగా కనిపించలేదు కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రం నిత్యం అభిమానులని ఆకట్టుకుంటూనే ఉన్నారు.