Spirit : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కూడా వచ్చిన అనేక అప్డేట్స్లో అందరికీ హైప్ క్రియేట్ చేసిన సినిమా స్పిరిట్. ఒక్క విజువల్ కూడా లేకుండా కేవలం వాయిస్ తోనే రచ్చ లేపాడు సందీప్ రెడ్డి వంగ.
అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో తన సత్తా ఏంటో చూపించాడు. కబీర్ సింగ్ సినిమాను వైలెంట్ ఫిలిం అని బాలీవుడ్ మీడియా అన్నందుకు అసలైన వైలెంట్ ఫిలిం అంటే ఏంటో నేను మీకు చూపిస్తాను అంటూ అనిమల్ తో చూపించాడు. అనిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 1000 కోట్లు చేసింది.
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని చాలామంది అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఒక తరుణంలో ఈ సినిమా 2026లో మొదలవుతుంది అని కూడా వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన పూజ రేపే జరగనుంది.
మొత్తానికి ఇది ప్రభాస్ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చే విషయం అని చెప్పాలి. ప్రభాస్ ఈ సినిమాకి డేట్స్ కేటాయిస్తే అతి త్వరగా సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉంటాడు సందీప్ రెడ్డి వంగ. సినిమా మొదలుపెట్టడానికి టైం తీసుకుంటాడు గాని మొదలైన తర్వాత అతి త్వరగా పూర్తి చేయగల సామర్థ్యం సందీప్ రెడ్డి వంగకి ఉంది.
యానిమల్ సినిమా ఎంత గ్రాండ్ గా అనిపిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ సినిమాని కేవలం వంద రోజుల్లోనే పూర్తి చేశాడు సందీప్ రెడ్డివంగా. కానీ ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి వాటికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ టైం తీసుకున్నాడు.
ఇక ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ సినిమాను త్వరగా పూర్తి చేసిన కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ టైం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ వివేక్ ఒబెరాయ్ వంటి స్టార్ యాక్టర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ తో మొదటిసారి కలిసి పనిచేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ.
Also Read: Andhra King Taluka : రామ్ చరణ్ దారిలో రామ్ పోతినేని, ఇది శుభ పరిణామం