Bigg Boss 9: దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ జంట భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టింది. దాదాపు 22 రోజులపాటు హౌస్ లో ఉంది. వాస్తవానికి టాప్ ఫైవ్ లో వెళ్తుందని ఆమె క్రేజ్ ను బట్టి అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది మాధురి. ఇకపోతే స్టేజ్ మీదకు వచ్చిన మాధురి హౌస్ మేట్స్ రంగులు బయటపెట్టి.. ఎవరు ఎలాంటివారో చెప్పి అటు ఆడియన్స్ ని కూడా అలర్ట్ చేసింది. మరి మాధురి ఎవరి గురించి ఏం చెప్పింది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
6 మంది కామనర్స్.. 9 మంది సెలబ్రిటీలతో ప్రారంభమైన ఈ షోలో మధ్యలో మరో కామనర్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 6 మంది వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎనిమిది వారాలు పూర్తికాగా.. అందులో 9 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటివారం శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. వరుసగా మర్యాద మనీష్ , హరిత హరీష్ , ప్రియా శెట్టి, ఫ్లోరా షైనీ , దమ్ము శ్రీజ, రమ్య మోక్ష, భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యారు. అయితే గతవారం భరణి శంకర్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎనిమిదో వారానికి సంబంధించి ఎలిమినేషన్ లో భాగంగా దివ్వెల మాధురి ఎలిమినేట్ అయింది. వాస్తవానికి గౌరవ్ ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ మాధురి ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక స్టేజ్ పైకి రాగానే మాధురి బిగ్ బాస్ జర్నీ ఏవి చూసి ఎమోషనల్ అయింది. అటు తనూజ కూడా కన్నీళ్లు పెట్టుకుంది.
ALSO READ:Jayammu Nischayammu Raa: రష్మికకు కొత్త ట్యాగ్.. ఆ ముగ్గురు కలిసొచ్చారంటూ!
వైల్డ్ ఫైర్ లా హౌస్ లోకి అడుగుపెట్టిన మాధురి.. మొదట్లో గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. కానీ హోస్ట్ నాగార్జున సలహాలు , సూచనలు మేరకు తనను తాను మార్చుకొని ఇప్పుడిప్పుడే గేమ్ మొదలు పెట్టగా.. ఇంతలోనే ఎలిమినేట్ అవ్వడం బాధాకరం. ఇక కంటెస్టెంట్స్ గురించి చెబుతూ నేను బయట ఉన్నప్పుడు తనూజ మాస్క్ తో ఆడుతోంది అనుకున్నాను. కానీ ఆమె ఆమెలాగే ఆడుతోంది. చాలా మంచిది అని చెప్పింది. కళ్యాణ్ చాలా జెన్యూన్ అని చెప్పిన మాధురి.. డెమోన్ పవన్ క్యూట్ బాయ్ అంటూ తెలిపింది.
భరణి శంకర్ కి ముళ్ళు ఇస్తూ 100% ఫేక్ పర్సన్.. భరణి మాస్క్ తో ఆడుతున్నాడు అందరికీ వెన్నుపోటు పొడుస్తున్నారు అని చెప్పింది. అలాగే దివ్యకి కూడా ముళ్ళు ఇస్తూ ఈమె తన గేమ్ కంటే పక్క వాళ్ళ గేమ్ పై కాన్సెంట్రేట్ చేస్తుంది అని చెప్పింది. అలా మొత్తానికి ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.