OTT Movie : నిజమైన నెరస్థుల నేర చరిత్ర ఆధారంగా, ఒక బెంగాలీ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. అయిదు ఎపిసోడ్స్ తో తెరకెక్కిన ఈ సిరీస్ అంథాలజీ ఫార్మాట్ లో వచ్చింది. ప్రతీ ఎపిసోడ్ ఒక క్రిమినల్ లైఫ్‌ను చూపిస్తుంది. ఈ సిరీస్ లో మామూలు మనిషులు వయలెన్స్ దారి ఎంచుకుని ఫేమ్ అవుతారు. ఈ ఐదు స్టోరీలు థ్రిల్లర్ ఎలిమెంట్స్ వైబ్ లో ఉంటాయి. ఇది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ప్రియులు తప్పక చూడాల్సిన సిరీస్. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
“గణోషత్రు” (Ganoshotru) 2025లో విడుదలైన బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ అంథాలజీ సిరీస్. డైరెక్టర్స్ శ్రీమంత సెంగుప్త, మొధురా పలిట్, సయాన్ దాస్ , అభిరూప్ ఘోష్ దీనికి దర్శకులుగా పనిచేశారు. ఇందులో రుద్రానిల్ ఘోష్, సుబ్రత్ దత్త, ఆయుష్ దాస్, దేబోప్రియో నటించారు. ఐదు ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ఐయండిబిలో 7.5/10 రేటింగ్ పొందింది. ఈ సిరీస్ 2025 అక్టోబర్ 31 నుంచి ZEE5 లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : గోడ లోపల వింత శబ్దాలు… కట్ చేస్తే ఒళ్ళు జలదరించే ట్విస్ట్… ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారా భయ్యా
ఎపిసోడ్ 1లో ఒక సాధారణ మనిషి ఫ్యామిలీ పోగొట్టుకుని అనాధాలా పెరుగుతాడు. పవర్ కోసం సీరియల్ కిల్లర్ అవుతాడు. అతను కలకత్తా స్లమ్స్‌లో మొదలు పెట్టి, రిచ్ విక్టిమ్స్‌ను టార్గెట్ చేస్తాడు. అతను మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న ఒక మృగం. కోర్ట్ ట్రయల్‌లో అతని నేరాలు బయట పడతాయి. ఎపిసోడ్ 2లో డార్జిలింగ్ హిల్ స్టేషన్ లో ఒక యువకుడు పవర్ కోసం నేర ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అతను లోకల్ టూరిస్ట్ గైడ్ నుంచి క్రైమ్ మొదలు పెట్టి, ఎన్నో ఘోరాలకు కారణం అవుతాడు. ఎపిసోడ్ 3లో ఒక మహిళ ఫ్యామిలీ కష్టాల వల్ల కిల్లర్ అవుతుంది. ఆమె డబ్బు కోసం రిచ్ ఫ్యామిలీలను టార్గెట్ చేస్తుంది. ఎపిసోడ్ 4 సీరియల్ కిల్లర్ ల గ్యాంగ్స్ దారుణాలతో నడుస్తుంది. ఎపిసోడ్ 5 లో ఒక మహిళ రివెంజ్ తీర్చుకునే క్రమంలో కథ నడుస్తుంది. చివరి ఎపిసోడ్‌లో కోర్ట్ ట్రయల్స్ చూపిస్తారు. క్రిమినల్స్ అందరికీ శిక్ష పడుతుంది. ఈ క్రిమినల్స్ అంతా నేరాల బాట పట్టి ఫేమ్ అవుతారు. కానీ వాళ్ళు ఫేమ్ అవ్వడానికి ఎంచుకున్న దారి భయంకరంగా ఉంటుంది.