TV Serials : తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియల్స్ ప్రసారమవుతుంటాయి. అందులో కొన్ని సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటీలో స్టార్ మా నుంచి వచ్చిన సీరియల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఛానల్ ఎక్కువగా తెలుగు వాళ్ళ కన్నా కన్నడ స్టార్స్ తో బోలెడు సీరియల్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతోమంది కన్నడ స్టార్స్ ఇక్కడ సీరియస్ చేసి తెలుగులో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో కన్నడ నటి మేఘన లోకేష్ ఒకరు. ఈమె కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. స్టార్ మా లో ప్రసారమైన శశిరేఖా పరిణయం సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది.. ఆ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో బాగా పాపులర్ అయిపోయింది. ప్రస్తుతం కళ్యాణం వైభోగం సీరియల్ లో నటిస్తూ వస్తుంది.. అయితే ఈమె ఒక్క రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది..
శశిరేఖా పరిణయం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కన్నడ నటి మేఘన లోకేష్. పెళ్లికూతురుగా ఆమె అందరినీ ఆకట్టుకుంది. అప్పట్లో ఆ సీరియల్ మంచి క్రేజ్ ని సొంతం చేస్తుంది.. ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించి బిజీగా మారింది. ఇటీవల సడన్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.. అదే ప్రస్తుతం కళ్యాణ వైభోగం సీరియల్ లో నటిస్తూ ప్రేక్షకుల మనసుని దోచుకుంటుంది. అయితే ఆ సీరియల్ కు గాను ఒక రోజుకి ఆమె ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.. నిజానికి ఈమె ఒక్క రోజుకి 25 వేలకు పైగా వసూలు చేస్తుందని తెలుస్తుంది. ఒక సీరియల్ షూటింగు 25 రోజులు అవుతుంది. నెలలు ప్రతిరోజు షూటింగ్ ఉండడంతో ఈమె లక్షలు సంపాదిస్తూ వస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Also Read :పెళ్ళై 20 ఏళ్లు.. అమ్మ పిలుపు లేదు..కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..
మొదట స్టార్ మా చానల్ తో ఎంట్రీ ఇచ్చిన కూడా ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్లలో నటిస్తూ వస్తుంది. కల్యాణ వైభోగం అనే సీరియల్ లో నిత్య, మంగల అని ద్విపాత్రాభినయం చేస్తుంది, రక్త సంబంధం అనే సీరియల్ లో “తులసి” పాత్ర లో నటిస్తుంది.. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు సినిమాల్లో కూడా నటించింది. ఇది మా ప్రేమ కథ అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. మేఘన భర్త పేరు స్వరూప్. ఆయన సపోర్ట్ చేయడం వల్లే సీరియల్స్లలో నటిస్తుంది అని చాలా సందర్భాల్లో బయటపెట్టింది. ప్రస్తుతం జీ తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు స్టార్ మా లో ఏవైనా సీరియల్స్ చేస్తూనేమో చూడాలి.. ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.