Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. నటుడిగా ఎంత సక్సెస్ అయ్యాడో అందరికీ తెల్సిందే. కానీ, హోస్ట్ గా మాత్రం నాగ్ ప్రతిసారి ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు అన్నది నెటిజన్స్ మాట. రియాల్టీ షో అంటే.. న్యాయం అందరి వైపు చూపించగలగాలి. నాగ్.. బిగ్ బాస్ లో ప్రతి సీజన్ కి ఒక కంటెస్టెంట్ ను తప్ప ఇంకొకరి మీద ఫోకస్ పెట్టడం లేదు అన్నది జనాల మాట. మిగతా సీజన్స్ కంటే బిగ్ బాస్ సీజన్ 9 మాత్రం మరింత వరస్ట్ అని మండిపడుతున్నారు. నాగార్జున హోస్టింగ్ కూడా అలాగే ఉంది.
ఒక హోస్ట్ అనేవాడు.. వారం రోజులు జరిగిన దాని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అందరి తప్పుల గురించి.. ఒప్పుల గురించి మాట్లాడాలి. మలయాళంలో మోహన్ లాల్ కానీ, కన్నడలో సుదీప్ కానీ అదే పని చేస్తారు. ఎంత పెద్ద తోపు తురుము సెలబ్రిటీ అయినా లోపలికి వెళితేవారు కేవలం కంటెస్టెంట్ మాత్రమే. వారు తప్పు చేస్తే నిర్మొహమాటంగా అడిగే రైట్ హోస్ట్ కి ఉంటుంది. కానీ, నాగ్ మాత్రం ఫేవరెట్స్ ను పక్కన పెట్టి.. ఏమి మాట్లాడలేని వారిపై మండిపడడం ప్రేక్షకులకు మింగుడు పడడం లేదు.
సీజన్ 9 లో ప్రతి వీక్ లో తనూజ, మాధురి చాలా తప్పులు చేస్తూ కనిపిస్తారు. కానీ నాగార్జున వారి తప్పులను కళ్యాణ్ మీదకు, సంజన మీదకు నెట్టేసి మాట్లాడడం ఎవరికీ నచ్చడం లేదు. తనూజను విన్నర్ గా చేయాలనుకున్నప్పుడు మిగతావారిని ఎందుకు లోపలి తీసుకెళ్లి ఆడించడం. ప్రతివారం కళ్యాణ్, పవన్ ను ఏదో ఒకటి అని వారి కాన్ఫిడెన్స్ ను దెబ్బతీసేలా మాట్లాడడం నాగార్జునకు అలవాటుగా మారిపోయింది. మరి తప్పు చేసినవారిని , మాట మార్చినవారిని ఏమి అనడం లేదు. ఒకవేళ అనాల్సివస్తే ఆడాయి మార్చుకోవాలమ్మా.. ఇది మార్చుకోవాలమ్మా అని సున్నితంగా చెప్పుకొస్తున్నాడు. ఇదెక్కడి పార్షియాలిటీ అనేది ఎవరికి అర్ధం కావడం లేదు.
బాడీ షేమింగ్ చేసిన మాధురిని ఏమి అనలేదు కానీ, దివ్యను రోడ్ రోలర్ అన్న సంజనపై మండిపడ్డాడు. బెండకాయ కూర చేయమని చెప్పిన పాపానికి ఆర్డర్ వేసాడని కళ్యాణ్ మీద అరిచిన నాగార్జున .. కళ్యాణ్ పై అరిచి రచ్చ చేసిన తనూజను ఏమి అనలేదు. అసలు ఈ హౌస్ లో ఏమి జరుగుతుంది అనేది ఎవరికి అర్ధం కాకుండా పోయింది. గొడవ చేసిన రీతూ బాగానే ఉంది. ఆమెను నెట్టాడన్న ఒకే ఒక్క విషయంతో పవన్ నెగిటివ్ గా మారాడు. మోకాళ్ళ మీద నిలబడి క్షమాపణలు కోరేవరకు తీసుకొచ్చాడు. ఇదంతా అతను మనసులో నాటుకుపోతుంది. అది కాన్ఫిడెన్స్ దెబ్బతీయడమే కాదా.. ఇదెక్కడి పద్దతి. ఇదేనా హోస్ట్ గా సమన్యాయం చేయడం అంటే.. అని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఛీఛీ ఇలాటి ఒక వరస్ట్ హోస్ట్ ను ఎక్కడా చూడలేదు అని కామెంట్స్ చేస్తున్నారు.