Bigg Boss 9: నేడు సోమవారం కాబట్టి బిగ్ బాస్ 9 లో నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఎప్పటిలాగానే నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా కొనసాగింది. చాలామంది కూడా నామినేషన్ ప్రక్రియ గురించి ఎదురు చూస్తుంటారు. ప్రేక్షకులకి అదే అసలైన ఎంటర్టైన్మెంట్. నామినేషన్స్ రోజు ఒకరంటే ఒకరికి మంచి క్లారిటీ వస్తుంది.
నేడు జరిగిన నామినేషన్స్ కూడా కొంచెం ఆసక్తిగానే ఉన్నాయి. ముఖ్యంగా ఎవరూ ఊహించని విధంగా తనుజ, ఇమ్మానుయేల్, భరణిమద్య ఆసక్తికరమైన ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ముఖ్యంగా తనుజ మాట తీరు చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. తాను ఎవరి సపోర్ట్ వలన అక్కడి వరకు వచ్చిందో ప్రేక్షకులు అందరూ కూడా చూశారు. అయితే నేను ఎవరి సపోర్టు తీసుకోలేదు అని మొహం మీద చెప్పేస్తుంది. ఇంతకు నామినేషన్ లో ఉన్నది ఎవరెవరు.?
ఈ వారం నామినేషన్ ప్రక్రియలో సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, సాయి, తనూజ, రాము రాథోడ్ ఉన్నారు. అయితే వీళ్ళలో ఖచ్చితంగా తనుజ అయితే బయటకు వెళ్ళదు ఎందుకంటే, అన్నపూర్ణ ప్రోడక్ట్ కాబట్టి. అంతేకాకుండా ఆమెకు విపరీతంగా యాజమాన్యం సపోర్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి గేమ్ చూస్తే అర్థమవుతుంది కూడా.
అయితే ఈ ఆరుగురిలో ఎవరు బయటకు వెళ్లిపోతారు అని ఆశక్తి అందరికీ నెలకొంది. భరణి రీసెంట్ గానే మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి భరణి అంత త్వరగా బయటికి వెళ్లే అవకాశం లేదు. తర్వాత కొన్ని టాస్కులు పెడతారు కాబట్టి కచ్చితంగా సంజన దానిలో పెర్ఫార్మ్ చేయకపోవచ్చు. సంజన బయటికి వెళ్లిపోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి.
నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఇమ్మానుయేల్ తనుజా ను నామినేట్ చేశాడు. నామినేషన్ చేసిన వెంటనే తనుజ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. తరువాత ఇమ్మానియేల్ కూడా కళ్యాణ్ దగ్గర శ్రీనివాస్ సాయి దగ్గర ఎమోషనల్ అయిపోయాడు.
నేను మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ వాళ్ల దగ్గర అన్నాడు. ఇమ్మానుయేల్ ఇన్ సెక్యూర్ గేమ్ ఆడుతున్నాడు అని ఎప్పటినుంచో మనం ప్రస్తావిస్తూ వస్తున్నాం. ఇంత జరిగిన తర్వాత ఇమ్మానుయేల్ తనలోని ప్లేయర్ని బయటకు తీసి అందరినీ ఆశ్చర్యపరుస్తాడా లేకుంటే అదే రొటీన్ గేమ్ ఆడుతాడా చూడాలి.
Also Read: Bigg Boss 9: బెడ్ టాస్క్ లో చీర కట్టుకొని పెళ్లి కూతురు లా కూర్చున్నావు, ఇమ్మానియేల్ మాస్