E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గుప్త రింగ్ కొట్టేసిన ఆరు  

Nindu Noorella Saavasam Serial Today November 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గుప్త రింగ్ కొట్టేసిన ఆరు  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మనోహరి ఒంటరిగా కారులో వెళ్తుంటే.. అంతకు ముందు అటాక్‌ చేసిన ముసుగుదొంగ ఎదురుపడతాడు. దీంతో మనోహరి కారులో ఉన్న తన గన్‌ తీసుకుని కారు దిగి రేయ్‌ ఎవర్రా నువ్వు.. నాకు నీకు ఏంట్రా సంబంధం.. నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నావు.. నేను చేసిన ద్రోహం ఏంటి..? నా మీద నీకు పగ ఏంటి..? రేయ్‌ మర్యాదగా బయటకు రారా..? రేయ్‌ పిరికోడిలా దాక్కోవడం కాదు బయటకు రా..? నువ్వు ధైర్యం ఉన్న మగాడివే అయితే నా ముందుకు రా.. ఫేస్‌ టూ ఫేస్‌ తేల్చుకుందాం  రారా బయటకు అంటూ తిడుతుంది. ఇంతలో మనోహరి భుజం మీద వెనక నుంచి ఎవరో చేయి వేయగానే.. మనోహరి భయపడిపోతుంది. మెల్లగా తిరిగి చూస్తూ అక్కడ అమర్‌ ఉంటాడు. అమర్‌ను  చూసిన మనోహరి రిలాక్స్‌ అవుతుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మనోహరి.. నీ చేతిలో ఈ గన్‌ ఏంటి..? ఎవరిని వెతుకుతున్నావు అని అమర్‌ అడగ్గానే.. అది నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించింది అమర్‌. అని చెప్పగానే..

ఎవరు ఫాలో చేస్తున్నారు అని అమర్‌ అడుగుతాడు. తెలియదు తల నుంచి కాళ్ల వరకు బ్లాక్‌ డ్రెస్‌ వేసుకున్నాడు. తను నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని  మనోహరి చెప్పగానే.. నేను నిన్ను ఇంట్లో ఉండమన్నాను కదా..? బయటకు ఎందుకు వచ్చావు.. అంటాడు అమర్‌. అది చిన్న పని ఉండి వచ్చాను.. అని చెప్తుంది మనోహరి. దీంతో అమర్ ఏంటా పని అని అడగ్గానే.. అది పర్సనల్ పని అమర్‌ అని చెప్తుంది మనోహరి. సరే నీ పర్సనల్‌ నేను అడగను కానీ నీకు థ్రెట్‌ ఉందని తెలుసు కదా..? బయట తిరగొద్దని చెప్పాను కదా అంటాడు. అయినా నీకు ఈ గన్‌ ఎక్కడిది..? ఎవరు ఇచ్చారు..? అని అమర్‌ అడగ్గానే..

Advertisement

నేనే  నా సేప్టీ కోసం తీసుకున్నాను.. లైసెన్స్‌ ఉందా..? పోలీస్‌ స్టేషన్‌లో పర్మిషన్‌ తీసుకున్నావా..? అని అమర్‌ అడగ్గానే.. లేదు. తీసుకోలేదని మనోహరి చెప్తుంది. దీంతో అమర్‌ కోపంగా ఏంటి మనోహరి ఇది ఒక మిలటరీ ఆఫీసర్‌ ఇంట్లో ఉంటూ పర్మిషన్‌ లేకుండా లైసెన్స్‌ లేని గన్‌ వాడుతున్నావా..? ఇది ఎంత క్రైమో తెలుసా..? నీకు అంటూ అమర్‌ తిట్టగానే.. మనోహరి సారీ అమర్‌ నాకు ఈ ఫార్మాలీటీస్‌ ఏమీ తెలియదు.. నాకు థ్రెట్‌ ఉందని తీసుకున్నాను అంతే..అని చెప్తుంది. దీంతో అమర్‌ కోపంగా నా ఇంట్లో ఉన్నంత వరకు నీ బాధ్యత నాది నన్ను దాటి నీ జోలికి ఎవ్వరూ రారు.. నీ ఏ వెపన్‌ అవసరం లేదు.. పద ఇంటికి వెళ్దాం అంటూ ఇద్దరూ ఇంటికి వెళ్తారు..

యమలోకంలో ఉన్న ఆరు మనోహరిని ఎవరో కాల్చడం చూస్తుంది.  అసలు మనోహరిని చంపాలని ప్రయత్నిస్తున్నది ఎవరు..? అతన్ని ఎలా కనిపెట్టాలి అని ఆలోచిస్తూ.. ఆ మాయాదర్పణంలో చూస్తే తెలుస్తుంది కదా..? అయినా ఆ దర్పనం తెరవాలంటే గుప్త గారి రింగ్‌ ఉండాలి. గుప్త గారు ఎక్కడ ఉన్నారు.. అంటూ అటూఇటూ వెతుకుతుంది. గుప్త ఒక దగ్గర నిద్రపోతుంటాడు. ఆ గుప్త గారు మంచి నిద్రలో ఉన్నారు.. రింగ్‌ తీసుకోవడానిక ఇదే మంచి సమయం అని గుప్త దగ్గరకు వెళ్లి రింగు తీసుకుని పక్కకు వెళ్లి రింగును తన వేలికి పెట్టుకుని మాయాదర్పణం రావాలని కోరుకుంటుంది. వెంటనే మాయా దర్పణం వస్తుంది. అది ఓపెన్‌ చేసి మనోహరిని చంపాలనుకున్న ఆ హంతకుడు ఎవరు చూపించు అని అడుగుతుంది.

Advertisement

దర్పణంలో హంతకుడి ముఖం కనిపించే లోపే దర్పణం మూసుకుపోతుంది. ఇదేంటి కరెక్టుగా అతని ముఖం చూసే లోపే మూసుకుపోయింది అని ఆరు అనుకుంటుండగానే.. యముడు వస్తాడు. ఏమి  చేయుచున్నావు బాలిక.. భవిష్య వాణి నీ చేతుల్లోకి ఎలా వచ్చినది అని అడగ్గానే.. అయ్యయ్యో నా చేతుల్లో పడలేదు.. నా తల మీద కూడా పడలేదు.. ఇక్కడ ఉంటే ఏంటా  అని చూస్తున్నాను అంతే అని చెప్తుంది ఆరు. దీంతో యముడు కోపంగా అసత్యం ఆడకుము బాలిక ఆ ఆంగుళీకము లేనిదే భవిష్య వాణి గోచరించదు.. తెరువబడదు.. అనగానే.. ఆరు రింగ్‌ దాచిపెడుతుంది. ఏంటది అని యముడు అడగ్గానే.. ఏమీ లేదు అని చెప్తుంది.

దీంతో యముడు అనుమానంగా మళ్లీ మా దేవి అంగుళీయకము దొంగిలించితివా..? అని అడగ్గా లేదని గుప్త గారికి తీసుకున్నాను అని ఉగరం చూపిస్తుంది ఆరు. వెంటనే ఆ ఉంగరాన్ని లాక్కుంటాడు యముడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. వల్లి మళ్లీ పుల్లేట్టేసింది.. ప్రేమ మారుతుందా..?

Intinti Ramayanam Today Episode: కన్నతండ్రి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. నిజం చెప్పేస్తాడా..?

Illu Illaalu Pillalu Narmada : నర్మద పెళ్లి చేసుకోబోతుందా..? అబ్బాయి ఎవరంటే..?

Sunday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే.. ఆ నాలుగు డోంట్ మిస్…

Nindu Noorella Saavasam Serial Today Episode September 6th ‘నిండు నూరేళ్ల సావాసం’  సీరియల్‌: బుజ్జమ్మ కోసం బయలుదేరిన ప్రచండ

Big Stories

Advertisement
×