BigTV English
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో హీటేక్కిస్తున్న నామినేషన్స్.. టాప్ 5 ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే..?

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో హీటేక్కిస్తున్న నామినేషన్స్.. టాప్ 5 ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే..?

Bigg Boss 9 Telugu : బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి అయ్యి 9 వ సీజన్ జరుగుతుంది. ఈ సీజన్ లో ఇప్పటికే 8 వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 9 వ వారం కొనసాగుతుంది. గత వారం తక్కువ ఓటింగ్ ను నమోదు చేసుకున్న దువ్వాడ మాధురి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది… ఈమె హౌస్ లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి అందరిని దడదడలాడించేసింది. దాంతో హౌస్ లోకి వచ్చిన మొదటి వారమే ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. మొత్తానికి రెండు వారాల తర్వాత ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.. ప్రస్తుతం 9వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఈవారం నామినేషన్స్ లోకి ఎవరు వెళ్తారు అనే ఆసక్తి జనాల్లో కనిపిస్తుంది. అలాగే ఈ వారం టాప్ ఫైవ్ లో కొనసాగుతున్న కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ టాప్ 5 లో ఎవరున్నారు..? ఈ వారం ఎవరు వెళ్తారు అన్నది ఒకసారి చూద్దాం..


9 వ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలు.. 

బిగ్ బాస్ హౌస్ లో 9 వ వారం రసవత్తరంగా సాగుతుంది.. గతవారంతో పోలిస్తే ఈ వారం హౌస్ లో ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో నామినేషన్స్ లోకి ఎవరు వస్తారా అని ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గత వారం టాస్క్ ల ప్రకారం చూస్తే.. దివ్య, తనూజ, రామ్ రాథోడ్, సుమన్ శెట్టి, గౌరవ్, పవన్, రీతూ మళ్లీ నామినేషన్స్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది.. ఈవారం నామినేషన్స్ మాత్రం వాడి వేడిగా సాగేట్లు కనిపిస్తున్నాయి. ప్రతి సోమ, మంగళవారం నామినేషన్స్ జరుగుతాయన్న సంగతి తెలిసిందే.. ఈ వారం ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తున్నారో మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి.. ఏది ఏమైనా ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read : 17 మంది మృతి… నాగ చైతన్య మూవీ ఈవెంట్ వాయిదా


బిగ్ బాస్ సీజన్ 9 టాప్ కంటెస్టెంట్స్…

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 9 ఎనిమిది వారాలను పూర్తి చేసుకొని తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టింది. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ జరుగుతున్నాయి. అయితే మరి కొద్ది వారాలు మాత్రమే ఈ షో ప్రసారం కానుంది.. దాంతో టాప్ ఫైవ్ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే విన్నర్ ఎవరు అని పోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే ఎనిమిది వారాల పర్ఫామెన్స్ ను బట్టి టాప్ ఫైవ్ లో ఉన్న కంటెస్టెంట్లను చూస్తే.. తనూజ, ఇమ్మానుయేల్, పవన్, దివ్య, రీతూ ఉన్నారని తెలుస్తుంది. మరి చివరి వరకు ఈ ఐదుగురు కొనసాగుతారా? మధ్యలో ఓటింగ్ వల్ల ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తారా అన్నది తెలియాలంటే బిగ్ బాస్ ప్రతి ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే.. ఈవారం కూడా రామ్, గౌరవ్ లు డేంజర్ జోన్లో కొనసాగుతున్నారు. మరి వీరి ప్లేసులు మారుతాయా? లేదా వీళ్లే ఎలిమినేట్ అవుతారా? అన్నది తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ ను మిస్ అవ్వొద్దు..

Related News

Bigg Boss 9 Promo: మీ పర్సనలైతే బయట చూసుకోండి.. భరణిపై రెచ్చిపోయిన తనూజ!

Bigg Boss 9: హౌస్ మేట్స్ నిజ స్వరూపం బయటపెట్టిన మాధురి.. అతడే ఫేక్ అంటూ!

Akkineni Nagarjuna: ఛీఛీ..వరస్ట్ హోస్ట్ ఎవర్.. నాగ్ పై మండిపడుతున్న నెటిజన్స్

Bigg Boss 9 Promo: నామినేషన్ వార్.. బాండింగ్ పై స్పందించిన రీతూ చౌదరి..

Bigg Boss Buzz: భయం అన్నది బ్లడ్ లోనే లేదు.. శివాజీకే ఇచ్చి పడేసిన మాధురి!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ నుంచి మాధురి అవుట్.. 22రోజుల్లో ఎంత సంపాదించిందంటే..?

Bigg Boss 9 day 56 : మాధురి ఎలిమినేటెడ్, తనుజ వెన్నుపోటు, హౌస్ లో ఎవరు ఎలాంటివారు

Big Stories

×