Bigg Boss 9 Bharani Warns Divya and Thanuja: బిగ్ బాస్ హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన భరణి శంకర్ బాండింగ్స్ వల్ల వీక్ అయ్యారంటూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. తనూజని కూతురు, సంజన చెల్లి, సుమన్ తో బ్రదర్ బాండింగ్ పెట్టుకుని బిగ్ బాస్ ఫ్యామిలీ షోలా మార్చాడంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇవన్ని చూసి సహా కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ కూడా కుటుంబం.. భరణి గారి కుటుంబమంటూ పాటలు పాడుతూ ఆటపట్టించాడు. మరోవైపు సేఫ్ గేమ్స్. టాస్క్ లో త్యాగాలతో భరణి ఫుల్ నెగిటివ్ అయ్యాడు. చివరికి సేఫ్ గేమ్, బాండింగ్స్ వల్ల ఆడియన్స్ ఆదరణ పొగొట్టుకుని ఆరో వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు భరణి.
మరోవైపు హౌజ్ భరణితో బాండింగ్ పెట్టుకుని సేఫ్ గేమ్ ఆడావని, నీవల్లే భరణి ఎలిమినేట్ అయ్యాడని హౌజంత తనూజని నిందించింది. వైల్డ్స్ కార్డ్స్ రమ్య, ఆయేషాలు కూడా ఇదే కారణంతో తనూజని నామినేట్ చేశారు. కొత్త లో మాధురి కూడా తనూజతో ఇవే కారణాలతో గొడవ పెట్టుకుంది. బాండింగ్స్ వల్ల గేమ్ పక్కన పెట్టి ఎంత నెగిటివ్ అయ్యాడనేది బయటక వచ్చాక భరణికి కూడా తెలిసిపోయింది. ఈ తరుణంలో భరణికి మళ్లీ రీఎంట్రీ ఇచ్చి పర్మినెంట్ హౌజ్ మేట్ అయ్యాడు. హౌజ్ లోకి రాగానే భరణి ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ముఖ్యంగా తనూజ, దివ్యలతో తన బాండ్ కొనసాగించాలా వద్దానే డైలామాలోనే ఉండిపోయారు.
రీఎంట్రీ ఇవ్వగానే దివ్యని అవైయిడ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, టాస్క్ లో భరణి తరపున ఆడి గెలిపించింది. దీంతో భరణి దివ్యపై పాజిటివ్ కార్నర్ ఏర్పడింది. అందుకే కెప్టెన్సీ టాస్క్ లో దివ్యకు సపోర్టు చేస్తానని తనూజతో చెప్పాడు. కానీ, ఇద్దరికి ఇవ్వలేదు. ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడాడు. వీకెండ్ లో నాగార్జున కూడా ఏదోక తేల్చకుండ సేఫ్ గేమ్ ఆడావని చీవాట్లు కూడా పెట్టారు. ఇక భరణి ఇవన్నీ చూసి బాండింగ్స్ బ్రేక్ చెప్పేశాడని అనిపిస్తోంది. . ఎందుకంటేఈ రోజు నామినేషన్ తనూజ కంటే తానే స్ట్రాంగ్ ప్లేయర్ అని, ఆమె ఇంతకాలం టాస్క్ లు ఆడలేదని, ఆడినవవి కూడా తన సపోర్టుతో గెలిచిందని అన్నాడు.
అవి సపోర్టు టాస్క్ లు కాబట్టి సపోర్టు చేశావంటూ తనూజ తిప్పి కొట్టింది. దివ్య కెప్టెన్ అయిన కారణంగా దీనికి సంచాలక్ గా వ్యవహరించింది. ఈ వాదనలో భరణివి వీక్ పాయింట్ అంటూ అతడిని నామినేట్ చేసి తనూజని సేఫ్ చేసింది. ఆ తర్వాత తనూజ, దివ్య పక్కకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. భరణి.. సంజన పక్కన కూర్చోని ఉన్నాడు. దివ్య.. నువ్వు ఒక బ్రదర్ అనో, ఆయన మీద నీకు పాజిటివ్ కార్నర్ ఉందో ఏదైనా కారణం కావచ్చు. ఆయన తన ఆటలో అయినా, గొడవలో అయిన కరెక్ట్ పాయింట్ పెట్టి డిఫెండ్ చేసుకోవట్లేదనే కారణం మధ్య లో నువ్వు కలుగజేసుకుని ఆయనతో మాట్లాడుతున్నావ్. అది చాలా నెగిటివ్ గా వెళుతుంది. హౌజ్ లోనే ఎంతో మంది నా దగ్గరికి వచ్చారు.
ఆయన గేమ్ ఆయనని ఆడనివ్వు.. ఆయన ఎలా డిఫెండ్ చేసుకుంటారనే నేను నామిటే చేయాలనుకున్నా అంటూ తనూజ, దివ్యలు భరణి గురించి మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో భరణి అక్కడికి వచ్చి. మీరు ఇద్దరు ఏమైనా మాట్లాకుంటే మీ టాపిక్ కే మాట్లాడుకోండి నాకు అనవసరం. కానీ, మీ మధ్యలో నా టాపిక్ తీసుకురాకండి. ప్లీజ్ ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అంటూ తనూజ, దివ్యలకు వార్నింగ్ ఇచ్చాడు. చూస్తుంటే భరణి ఇక బంధాలు తెచ్చుకుని గేమ్ పై ఫుల్ ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడని అనుకుంటున్నారు. అంటే ఇక ఈ తండ్రికూతుళ్ల బాండింగ్ కి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? ఇక రేపటి నుంచి భరణి ఆట ఎలా ఉంటుందా? అని ఆడియన్స్ లో ఆసక్తి కలిగింది.