Bigg Boss Telugu 9 Day 57 Promo 2: నేటి (సోమవారం) ఎపిసోడ్ లో నామినేషన్ హీట్ ఓ రేంజ్ ఉండబోతుంది. మాధురి ఎలిమినేషన్లో ఇక హౌజ్లో పెద్ద గొడవలు కనిపించవేమని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. కానీ, వారు పెద్దగా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తోంది ఈ ప్రొమోలు చూస్తుంటే. సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ ప్రియుల పండగే. వారమంత సేఫ్ గేమ్ ఆడినా.. ఈ రోజు ఎవరు ఎంటన్నది బయటపడుతుంది. నామినేషన్స్ వంకతో తమకు పడని వారిపై రివేంజ్ తీసుకుంటారు. అయితే ఈసారి ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది హౌజ్లో.
మొన్నటి వరకు నాన్న-కూతురు అంటూ బాండింగ్స్‌తో ఉన్న తనూజ, భరణి మొదటిసారి గొడవపడ్డారు. తనూజ హౌజ్ నుంచి వెళ్లిపోవాలని కోరుకుంటున్న అంటూ ఆమెను నామినేట్ చేశాడు. ఈ రోజు నామినేషన్స్ మొత్తం తనూజ చూట్టే జరిగాయి. తాజాగా విడుదలైన రెండో ప్రొమోలో తనూజ–ఇమ్మాన్యుయేల్, తనూజ– భరణి నామినేషన్ చూపించారు. ఒకరి బొమ్మను ఒకరు పట్టుకుని డెన్లోకి పరుగెత్తాలి. ఒకరౌండ్లో చివరిలో ఉండిపోయిన తనూజ ఇమ్మాన్యుయేల్ని నామినేట్ చేసింది. ఇమ్మాన్యుయేల్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని చాలా క్లియర్గా అర్థమవుతుందంది.
ఒక సపోర్టర్గా నా వంతు అయినవరకు మోయగలను.. నా భుజాలు నొప్పి పెడతాయి అన్నపుడు దించేస్తానన్నాంటూ ఇమ్మూ సమాధానం ఇచ్చాడు. మోయలేను భూజాలు నొప్పి వస్తాయన్నప్పడు మోయకని తనూజ అరచింది. అందకే దించేశా అంటూ ఇమ్మాన్యుయేల్ తనూజపై ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత సాయి శ్రీనివాస్ కూడా తనూజని నామనేట్ చేశాడు. ఆ భరణి వంతు వచ్చింది. తన నామినేషన్ తనూజని అని చెప్పాడు. నేను రెండు టాస్క్ల్లో తనూజని సేవ్ చేశాను.. కానీ, తనూజ నన్ను ఏ టాస్క్లో సేవ్ చేయలేదు అని భరణి అననాడు.
దానికి ఒక టాస్క్లో సేవ్ చేశారు.. ఎందుకంటే అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి అని సులువుగా సమాధానం ఇచ్చింది తనూజ. తనకంటే నేనే టాస్క్లు బాగా ఆడుతున్న అన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. మాట్లాడితే ఇమ్మాన్యుయే, దివ్య అంటుంటే మధ్య తనూజ మాట, వాయిస్ అక్కడ స్పేస్ ఎక్కడ ఉందని గట్టిగా అరిచింది. ఏం మాట్లాడిన మై పర్సనల్.. మై పర్సనల్ అంటున్నారు. మీకు ఏమైనా పర్సనల్ ఉంటే పోయి బయటపెట్టుకోండి హౌజ్లో కాదని మాట్లాడింది. ఏదైతే బాండింగ్స్ పేరుమీద నేను బయటకు వెళ్లానో.. ఒక్కసారి తను కూడా బాధ్యత తీసుకుని బయటకు వెళితే పరిస్థితులు అర్థమవుతాయి.. అందుకు తనూజ బయటకు వెళ్లాలని నేను కోరుకుంటున్నా అని భరణి తన అభిప్రాయం చెప్పాడు.