Bigg Boss 9 First Week Elimination: బిగ్ బాస్ హౌజ్ ప్రస్తుతం వాడి వేడిగా ఉంది.ఈ సారి ఎవరూ ఊహించని మలుపులతో హౌజ్ లో రణరంగ చూస్తారంటూ హోస్ట్ నాగార్జున చెప్పినట్టుగానే.. అప్పుడే హౌజ్ లో గొడవలు, వాగ్వాదాలు మొదలయ్యాయి. ఎవరూ కూడా తగ్గేదే లే అంటున్నారు. వారి తీరు చూస్తుంటే… ఎంతవరకు వీలైతే అంత కంటెంట్ ఇవ్వాలని ముందే ప్లాన్ చేసుకుని హౌజ్ లోకి వచ్చారేమో అనిపిస్తోది. ఇక బిగ్ బాస్ లో కీలక ఘట్టం నామినేషన్స్. ఈ రోజు మొదలు కానున్నాయి. సెలబ్రిటీలు వాళ్లలో వాళ్లే నామినేట్ చేసుకోవాలని బిగ్ బాస్ రూల్ పెట్టాడు.
నామినేషన్ ప్రక్రియ ముగిసేసరికి.. సెలబ్రిటీల నుంచి భరణి తప్పా.. మిగతా వారంత నామినేట్ అయ్యారు. తనూజ, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, రామ్ రాథోడ్, అను ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, కొరియోగ్రాఫర్ శ్రెష్టి వర్మ ఉన్నారు. సామాన్యుల నుంచి ఒకరు నామినేట్ అయ్యారు. ఇక ఈ వారం హౌజ్ నుంచి బయటకు వెళ్లేది సెలబ్రిటీల నుంచే అని తెలుస్తోంది. దీంతో వీరిలో ఎవరూ ఈ వారం హౌజ్ ని విడతారా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఫ్లోరా సైలెన్స్.. సంజన అటీట్యూడ్ ఆడియన్స్ రుచించడం లేదు. ఫ్లోరా సైనీకి తెలుగు రాకపోవడంతో ఆమెకు హౌజ్ లో కంటెస్టెంట్స్ మాటలు, జోక్స్ అర్థం కావడం లేదు.
జోక్స్ కి హౌజ్ అంత నవ్వుతుంటే.. ఆమె నవ్వుతుంది. తెలుగు రాకపోవడంతో ఆమె ఎవరితో మింగిల్ అవ్వలేకపోతుంది. హౌజ్ లో ముందుగా అట్రాక్ట్ చేసేది వారి యాక్షన్స్, తోటి కంటెస్టెంట్స్ తో కలిసిపోవడం. కానీ, ఇక్కడ ఫ్లోరాలో అదే మైనస్ కనిపిస్తోంది. టాస్క్ విషయంలో ఆమె పర్ఫామెన్స్ ఎలా ఉంటుందనేది పక్కన పెడితే.. ప్రస్తుతం మాత్రం హౌజ్ ఆమె యాక్టివ్ గా కనిపించడం లేదు. రెండు రోజులు ఎవరో ఒకరు.. ఏదోక కంటెంట్ ఇస్తున్నారు. కానీ, ఫ్లోరా సైనీ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ కనిపించలేదు. ఇది ఆమెకు పెద్ద మైనస్ అయ్యేలా ఉంది. మరోవైపు సంచలన ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తూ.. హౌజ్ లో అందరికి ఇరిటేషన్ తెప్పిస్తుంది.
ఒక్క షాంపూ విషయంలోనే ఆమె పెద్ద గొడవ చేసింది. ఏం చేసినా, ఏం మాట్లాడిన వాగ్వాదానికి దిగుతుంది. ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తూ.. నెగిటివిటీ పెంచుకుంటుంది. ప్రస్తుతం హౌజ్ మేట్స్ అంత కూడా సంజన తీరుప అసహనంతో ఉన్నారు. ఆమె తీరు ఆడియన్స్ కి కూడా నచ్చడం లేదు. ఈమేని ఎలిమేట్ చేయండి బిగ్ బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం చూస్తే ఫస్ట వీక్ ఎలిమినేట్ అయ్యేది వీరిద్దరిలో ఒకరు అనిపిస్తుంది. బిగ్ బాస్ అంటనే గొడవలు కాబట్టి.. సంజనా నుంచి స్టఫ్ దొరికేలా అనిపిస్తోంది. కాబట్టి వీరిలో ఫ్లోరా సైనీనే బయటకు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. మరి ఈ వారం హౌజ్ ని వీడేది ఫ్లోరా సైనీ? సంజనా? తెలియాంటే వీకెండ్ వరకు ఆగాల్సిందే.