Formula E race case: ఫార్ములా ఈ -రేసు కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ తో సహా నలుగురి ప్రాసిక్యూషన్ కి ఏసీబీ సిద్ధమైంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక సమర్పించింది. ఛార్జ్ షీట్ దాఖలుకు గవర్నర్ అనుమతి కోసం.. ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక పంపారు. అనుమతి రాగానే ఏ1, ఏ2, ఏ3, ఏ4, ఏ5 పై ఛార్జ్ షీట్ ఫైల్ చేసే యోచనలో ఏసీబీ ఉన్నట్టు తెలుస్తోంది.
దాదాపు 9 నెలలకు పైగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై ఏసీబీ విచారణ చేపట్టింది.. కేటీఆర్, ఐఏఎల్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, కిరణ్, ఎఫ్ఈవో సీఈవోపై ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు నాలుగు సార్లు విచారించారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఐదు సార్లు విచారించారు.
ALSO READ: Weather update: మళ్లీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన, జాగ్రత్త!