MS Dhoni: మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహేంద్రసింగ్ ధోని తన ఆట తీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన అద్భుతమైన ఆటతో టీం ఇండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ప్రస్తుతం మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం ఐపిఎల్ మ్యాచ్ లను మాత్రమే ఆడుతున్నాడు. అందులో ధోని చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐదుసార్లు టైటిల్ ను తీసుకోచ్చాడు. కెరీర్ పరంగా ధోని ఎంతో సక్సెస్ సాధించాడు.
మహేంద్ర సింగ్ ధోని ఏపీకి చెందిన బైక్ ను వాడుతున్నాడు. ధోనీకి బైక్ లు, కార్లు అంటే ఎంతగానో ఇష్టం. ధోని ఎప్పటికప్పుడు రిలీజ్ అయిన బైక్ లను, కార్లను కొనుగోలు చేసి తన గ్యారేజీలో పెట్టుకుంటాడు. ధోనికి చెందిన మూడు అంతస్తుల భవనంలో కేవలం కార్లు, బైకులు మాత్రమే ఉండడం విశేషం. ధోనికి కార్లు, బైకుల కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ధోని బైక్ మీద వెళుతున్న సమయంలో కెమెరా కంటపడ్డాడు. ఆ బైక్ ఏపీకి చెందిన బైక్. ధోని నడుపుతున్న బైక్ మీద ఏపీకి సంబంధించిన నంబర్ ప్లేట్ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పైన కొంతమంది అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అందులో కొంతమంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బైక్ కొనుగోలు చేశాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ దూసుకెళుతోందని, ఈ తరుణంలో ఏపీలో ధోని బైక్ కొనుగోలు చేసినట్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఆ బైక్ కొనుగోలు చేసింది ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆ బైక్ కొనుగోలు చేశాడని మరికొంతమంది స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు. ఈ విషయం పైన అసలు విషయం తెలియాల్సి ఉంది.
ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 15 నుంచి మే 31 వరకు జరగనున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ టోర్నమెంట్ కోసం ఈ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన మినీ వేలం నిర్వహించనున్నారు. గతంలో ఈ వేలాన్ని విదేశాల్లో నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ముంబైలో నిర్వహించనున్నారు. ఇలాంటి నేపథ్యంలో చాలామంది కీలక ప్లేయర్లు ఇతర జట్లనుంచి మరో జట్లకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే వచ్చే సీజన్లో ధోని ఆడడంపై సందిగ్ధత నెలకొంది. కొంతమంది ధోని ఆడతారని అంటుంటే మరికొంతమంది ధోని ఆడడం కష్టమేనని అంటున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ధోని, ఐపీఎల్ 2026 సీజన్ పూర్తయిన తర్వాత 2027 సంవత్సరంలో రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లుగా సమాచారం అందుతుంది.
Also Read: Kane Williamson Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ మామ..ఇక అతని శకం ముగిసింది