BigTV English
Advertisement

Bigg Boss : ఇంటికి కొత్త మెగా చీఫ్.. గంగవ్వ ఆశీర్వాదంతో..!

Bigg Boss : ఇంటికి కొత్త మెగా చీఫ్.. గంగవ్వ ఆశీర్వాదంతో..!

Bigg Boss : పాశ్చాత్య దేశాలలో బిగ్ బ్రదర్ (Big Brother) పేరిట ప్రారంభమైన ఈ రియాల్టీ షో హిందీలో తొలిసారి బిగ్ బాస్ (Bigg Boss) పేరిట మొదలయి ఇండియన్ సెలబ్రిటీస్ ని ఆకట్టుకుంది. దీంతో చాలామంది ఇందులో పాల్గొనడానికి ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలోనే హిందీలో ప్రస్తుతం 18 వ సీజన్ మొదలవగా.. అటు తెలుగులో కూడా 8 వ సీజన్ మొదలైంది. ఎనిమిదవ సీజన్లో భాగంగా ఏడవ వారం చివరి దశకు చేరుకుంది. ఇక మెగా చీఫ్ కోసం సాగిన టాస్క్ చివరి వరకు ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ హౌస్ కి కొత్త మెగా చీఫ్ గా అశ్వద్ధామ 2.0 అలియాస్ గౌతమ్ ఎన్నికయ్యాడు.


వారిద్దరి పై షాకింగ్ కామెంట్స్ చేసిన గంగవ్వ..

టాస్క్ విషయానికి వస్తే.. ప్లాస్మా లో చూపించిన బొమ్మలు ఏ కుషన్ పై ఉంటాయో.. ముందు వెతికి దాన్ని తీసుకొని ముందు ఉన్న బాక్స్ లోకి వెళ్ళాలి. ఈ టాస్క్ లో సరైన కుషన్ ను తీసుకెళ్లే సభ్యుడిని బాక్స్ లోకి వెళ్లే ముందు వరకు కూడా ఆపవచ్చు. ఒకవేళ తప్పు కుషన్ తీసుకెళ్తే మళ్ళీ వెనక్కి రావచ్చు అంటూ తెలిపాడు బిగ్ బాస్. ప్రతి రౌండ్ కు ఎంత మంది సభ్యులు ఆడాలో కూడా వివరించాడు. దాని ప్రకారమే ఎవరు ఎక్కువ రౌండ్స్ గెలిస్తే వాళ్లే టాస్క్ గెలిచినట్లు అని తెలిపాడు. అలా మొదలైందో లేదో రెండు రౌండ్లు గెలిచింది ఓజీ క్లాన్. ఆ తర్వాత మిగిలిన రౌండ్స్ అన్నీ రాయల్ క్లాన్ సభ్యులు గెలిచారు. ఇక టాస్క్ లో రాయల్ క్లాన్ విన్ అయినందుకు వారికి ఒక ప్రయోజనం ఇచ్చాడు బిగ్ బాస్. రాయల్ క్లాన్ గెలిచిన కారణంగా అడ్వాంటేజ్ పొందారు. ఇప్పుడు ఓవర్ స్మార్ట్ చార్జర్స్ నుండి ఇద్దరిని తొలగించండి అని బిగ్ బాస్ చెప్పగా రాయల్ క్లాన్ అంతా డిస్కషన్ చేసుకొని మెగా చీఫ్ గంగవ్వకు చెప్పగా.. ఆవిడ నిఖిల్ గాడిని తీసేయాలి వాడు పెద్ద డేంజర్ గాడు అలాగే నబీల్ ని కూడా తీసేయాలి అంటూ కామెంట్ చేసింది.


గంగవ్వ ఆశీర్వాదం తీసుకున్న కొత్త మెగా చీఫ్..

ఆ తర్వాత పట్టుకో లేదంటే వదులుకో అనే టాస్క్ బిగ్ బాస్ పెట్టగా.. ఈ గేమ్ కూడా స్కూల్ పిల్లలు ఆడే కుర్చీల ఆటలాగా ఉంది. సర్కిల్లో ఒక వస్తువు నుంచి దానిని ఎవరైతే ముందుగా తీసుకుంటారో వారికి ఒక పవర్ లభిస్తుంది. అలా చాలా గేమ్‌లో ఎక్కువసార్లు గౌతం నెగ్గుతాడు. దీంతో చాలామందిని గేమ్ నుంచి తప్పిస్తాడు కూడా ..ఫైనల్ గా గంగవ్వ గౌతమ్ మాత్రమే మిగులుతారు. వారిలో గౌతమ్ మెగా చీఫ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అతడికి తోడుగా గంగవ్వ – హరితేజ ఇద్దరూ మినీ చీఫ్ లుగా ఉండనున్నారు. ఇకపోతే గంగవ్వ, గౌతమ్ మధ్య జరిగిన టాస్క్ ఏంటో తెలియదు కానీ మెగా చీఫ్ గా ఎన్నికైన తర్వాత గంగవ్వ ఆశీర్వాదాన్ని గౌతమ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే చీఫ్ గా గెలిచి తనను తాను నిరూపించుకున్నారు.

Related News

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Big Stories

×