Bigg Boss 9 Telugu : తెలుగు బుల్లితెరపై టాప్ రియాల్టీ షో గా కొనసాగుతున్న ఏకైక షో బిగ్ బాస్.. ఇప్పటికే 8 సీజన్లను పూర్తి చేసుకుంది.. గత కొన్ని రోజులుగా సీజన్ 9 గురించి వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇవాళ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ గా ప్రారంభమైంది.. కొన్ని నిమిషాల క్రితమే ఈ సీజన్ ప్రారంభమైంది. హౌస్ లోని ప్రత్యేకతలతో మొదలైంది షో.. ఎన్నడు లేనివిధంగా నాగార్జునకి టాస్కులు మీద టాస్కులు ఇచ్చి మరి హౌస్ లోకి తీసుకెళ్లారు బిగ్ బాస్. సామాన్యులకు సంబంధించిన అగ్ని పరీక్ష గురించి నాగార్జున స్టేజ్ మీద చెప్పారు. అనంతరం మొదటి కంటెస్టెంట్ గా తనుజ గౌడ ఎంట్రీ ఇచ్చింది. రెండు కంటెస్టెంట్ గా ఫ్లోరా షైనీ( ఆశా షైనీ ) ఎంట్రీ ఇచ్చింది. ఈమె సంబందించిన వీడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఆమె గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..
హౌస్ లోకి సెకండ్ కంటెస్టెంట్ గా ఫ్లోరా షైనీ..
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 కాసేపటి క్రితమే ప్రారంభమైంది.. మొదటి కంటెస్టెంట్ గా ముద్దమందారం సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ ఎంట్రీ ఇచ్చింది.. ఈమె గురించి ఒక ఆడియో క్లిప్ ని బిగ్ బాస్ ప్లే చేస్తారు. అనంతరం రెండో కంటెస్టెంట్ గా ఫ్లోరా షైనీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.. మిరాయ్ మూవీలోని హిట్ సాంగ్ వైబ్ ఉందిలే బేబీ అంటూ అదిరిపోయే సాంగ్ తో ఈమె ఎంట్రీ ఇచ్చింది. అదిరిపోయే స్టెప్పులతో ఈమె చేసిన పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. స్టేజ్ మీదకి ఎంట్రీ ఇవ్వగానే ఆమె అసలు పేరు ఏంటో అందరికీ వివరించింది. అనంతరం నాగార్జున ఆమెకు సంబంధించిన ఆడియో క్లిప్ ని ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..
కన్నీళ్లు తెప్పిస్తున్న ఫ్లోరా షైనీ స్టోరీ..
బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా షైనీ గురించి ఓ వీడియోని బిగ్ బాస్ తీశారు.. అందులో ఆమెకు వచ్చిన సినిమా అవకాశాల గురించి అందరికీ వివరించింది. సినిమాలకు దూరమైన తర్వాత హిందీలో ఆమె చేస్తున్న వాటి గురించి వివరించింది. తర్వాత తన భర్త గురించి సంచల నిజాలను బయటపెట్టింది. కన్నీళ్లు తెప్పిస్తున్న ఆమె స్టోరీ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. అతనికి అయితే గ్రాండ్ గా ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక హౌస్ మేట్స్ తో ఎలా ఆడుకుంటుందో.. టాస్క్ లో ఎలా చూపిస్తుందో చూడాలి..