Bigg Boss 9 Telugu: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరొకసారి అలరించడానికి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్ళీ వచ్చేసింది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు స్టార్ మా వేదికగా తొమ్మిదవ సీజన్ కూడా ఘనంగా ప్రారంభం అయింది. గ్రాండ్ లాంచ్ పేరిట సెప్టెంబర్ 7 రాత్రి 7:00 చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు హోస్ట్ నాగార్జున. ఇకపోతే సామాన్యుల కేటగిరీలో అగ్నిపరీక్ష ద్వారా 13 మంది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 సెట్స్ పైకి వచ్చారు. వీరిలో ఐదు మందిని హౌస్ లోకి పంపించారు.అందులో ముగ్గురిని ప్రజల ఓటింగ్ ద్వారా.. మరో ఇద్దరిని జ్యూరీస్ స్పెషల్ నియామకం ద్వారా మొత్తం ఐదు మందిని హౌస్ లోకి పంపించారు.
ఇకపోతే కామనర్స్ ను హౌస్ లోకి పంపించడానికి కంటే ముందే సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టారు. అలా మొదట ‘ముద్దమందారం’ సీరియల్ తో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న తనూజ(Thanuja ) హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టగా.. ఆ తర్వాత ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా షైనీ (Flora Saini) రెండవ కంటెస్టెంట్గా హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇక మూడవ కంటెస్టెంట్ గా మొదటి సామాన్యుడు ఆర్మీ సైనికుడు కళ్యాణ్ (Army Soldier Kalyan) హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇలా ఒక్కొక్కరిగా హౌస్ లోకి ప్రవేశిస్తూ అభిమానులలో సరికొత్త జోష్ నింపారు..
కామనర్స్ కి ఎంత రెమ్యూనరేషన్ అంటే?
హౌస్ లోకి మొత్తం 9 మంది సెలబ్రిటీలు 5 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారు అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కామన్ మ్యాన్ క్యాటగిరి లో కళ్యాణ్, శ్రీజ, మనీష్, ప్రియా, హరీష్ ఇలా మొత్తం ఐదు మంది హౌస్ లోకి అడుగుపెట్టారు. ఈ ఐదు మందికి ఒక్కొక్కరికి రోజుకు రూ.15,000 నుండీ రూ.20,000 వరకు ఇవ్వనున్నట్లు సమాచారం.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రెమ్యునరేషన్..
ఇక సెలబ్రిటీల కంటే కాస్త తక్కువ ఫేమ్ ఉన్న వారు అనగా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకొని హౌస్ లోకి అడుగుపెట్టిన వారికి రూ.20,000 నుంచీ రూ. 25 వేల వరకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ రెమ్యూనరేషన్ అందుకోబోతున్న జాబితాలో జానపద గాయకుడు రాము రాథోడ్ ఉన్నట్లు తెలుస్తోంది
పాపులర్ సెలబ్రిటీస్ రెమ్యూనరేషన్..
ఇక పాపులర్ సెలబ్రిటీలుగా పేరు సొంతం చేసుకున్న సంజనా గర్లాని , శ్రేష్ఠి వర్మ, తనూజ , ఫ్లోరా షైనీ లకు రోజుకి 30 వేలకు పైగా రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
టాప్ సెలబ్రిటీస్ రెమ్యూనరేషన్..
ఇక అలాగే టాప్ సెలబ్రిటీలుగా హౌస్ లోకి అడుగుపెట్టిన రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఇమ్మానుయేల్, భరణి లాంటి వారికి సుమారుగా రూ.40 వేలకు పైగా రోజుకి రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇకపోతే ఒక్కొక్క సెలబ్రిటీ పాపులారిటీని బట్టి రెమ్యూనరేషన్ ను ఫిక్స్ చేశారు.. అలా మొత్తానికైతే హౌస్ లోకి వెళ్లబోతున్న వీరందరికీ రోజుకి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు కాబట్టి మరి ఎవరు ఎన్ని రోజులు హౌస్ లో ఉండి ఎంత రెమ్యూనరేషన్ తో బయటకు వెళ్తారో చూడాలి.
also read:Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి జానపద గాయకుడు.. ఎవరీ రాము రాథోడ్.. ఒక్క పాటతో కోటి లాభం!