BigTV English

Kolkata Crime: బర్త్ డే చేస్తామని పిలిచి.. డోర్ లాక్ చేసి.. కోల్ కతాలో యువతిపై..

Kolkata Crime: బర్త్ డే చేస్తామని పిలిచి.. డోర్ లాక్ చేసి.. కోల్ కతాలో యువతిపై..

ఈ రోజుల్లో మనవాళ్లు ఎవరో? మంది వాళ్లు ఎవరో? ఎవరిని నమ్మలో? ఎవరికి నమ్మకూడదో? తెలియడం లేదు. మన చుట్టు ఉన్నవాళ్లే మనకు నమ్మకద్రోహం చేస్తున్నారు. నమ్మి వెళ్తే నట్టేట ముంచుతున్నారు. తాజాగా బెంగాల్ లో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే, మనుషులు ఇలా ఉంటారా? అని షాకవ్వడం ఖాయం. తెలిసిన వాళ్లే కదా అని వెళ్లిన యువతిపై ఇద్దరు యువకులు ఘోరానికి పాల్పడ్డారు. బర్త్ డే సెలబ్రేట్ చేస్తామని పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకుని బయటపడ్డ బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

కోల్ కతాలోని హరిదేవ్‌ పురాకు చెందిన యువతికి చందన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చందన్ ఫ్రెండ్ అయిన దీప్ తోనూ ఆమెకు పరిచయం ఏర్పడింది. తాజాగా ఆమె బర్త్ డే కావడంతో ఈ విషయాన్ని చందన్ కు చెప్పింది. చందన్ ఈ విషయాన్ని దీప్ కు చెప్పాడు. ఇద్దరు కలిసి ఓ దారుణమైన ప్లాన్ చేశారు. చందన్ ఆమె బర్త్ డే ను చేసుకుందామని చెప్పి దీప్ ప్లాట్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె బర్త్ డే చేశారు. డిన్నర్ చేశాక ఆమె ఇంటికి వెళ్తానని చెప్పింది. కానీ, నిందితులు ఆమెను పోకుండా అడ్డుకున్నారు. డోర్ లాక్ చేశారు. ఇద్దరు కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత రోజు ఇంటి నుంచి తప్పించుకున్న ఆమె, తన ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు    ప్రస్తుతం పరారీలో ఉన్న ఇద్దరు యువకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

బాధితురాలు ఫిర్యాదులో ఏం చెప్పిందంటే?

బాధిత యువతికి చందన్ తనకు కొన్ని నెలల క్రితం పరిచయం అయ్యాడు. అతడి ద్వారా దీప్‌ తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ముగ్గురు తరచుగా కలిసేవారు. సౌత్ కోల్‌ కతాలోని దుర్గా పూజా కమిటీలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తానని వారిద్దరు ఆమెకు చెప్పారు. తాజాగా తన బర్త్ చేస్తామని దీప్ గదికి తీసుకెళ్లి ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.


కోల్ కతాలో వరుస అత్యాచార ఘటనలు

అటు వరుస అత్యాచార ఘటనలు కోల్ కతాలో సంచలనం సృష్టిస్తున్నాయి.  జూన్‌ 25న కోల్‌ కతాలో లా స్టూడెంట్‌ అత్యాచారానికి గురైంది. అదే కాలేజీకి చెందిన ఓల్ట్ స్టూడెంట్ మనోజిత్‌ మిశ్రా లా విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత అతడు అరెస్ట్ అయ్యాడు. గత ఏడాది RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ లో ట్రైనీ డాక్టర్‌ పై అత్యాచారం, హత్య జరిగింది. ఈ సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుడు సంజయ్ రాయ్‌ కు కోర్టు జీవిత ఖైదు విధించింది.

Read Also: అబ్బా.. ఎవరీ హ్యాండ్సమ్.. నెట్టింట వైరల్ అవుతున్న రైల్వే టీసీ వీడియో!

Related News

UP News: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై డెలివరీ, బేబీ పుట్టిన గంటకే

Meerut News: రూటు మార్చిన చెడ్డీ గ్యాంగ్.. ఉత్తరాదిలో ఆగడాలు.. టార్గెట్ మహిళలు-అమ్మాయిలే

Delhi News: రూటు మార్చిన దొంగలు.. ఎర్రకోటలో భారీ చోరీ, బంగారు కలశాలు మాయం!

Attack On Law Student: కారులో బంధించి 60 చెంపదెబ్బలు.. వామ్మో, ఇలా కూడా కొడతారా? ఇదిగో వీడియో

Nagarkurnool Crime: చేతబడి చేశాడన్న అనుమానం.. కొడుకు చేతిలో తండ్రి దారుణ హత్య!

Big Stories

×