Bigg Boss 9 Day 2 Review : టాప్ తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ గా మొదలైంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో సామాన్యుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. 15 మంది హౌస్ లోకి వెళ్లారు. ఇప్పటికే సీజన్లో గొడవలు మొదలైయ్యాయని చూస్తే అర్థమవుతుంది. హౌస్ లోకి వచ్చిన ఒక్క రోజుకే బిగ్ బాస్ అప్పుడే కామనర్స్ & సెలబ్రిటీలు మధ్య ఫైటింగ్ మొదలైంది. ముఖ్యంగా మొదటి రోజు కామనర్స్ ను ఓనర్స్ గా, సెలబ్రిటీలను టెనంట్స్ గా రెండు టీములను డివైడ్ చేశారు.. ఇందులో మాస్క్ మ్యాన్, కమెడియన్ ఇమ్మాన్యుయేల్ మధ్య వాడీ, వేడి వాదన జరిగింది.. రోజు మొదలైనప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ఏదో ఒకరకంగా రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రోమోలు బాగా ఆకట్టుకున్నాయి.
నైట్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వారిని రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఓనర్స్ గా సామాన్యుల టీం ని, అలాగే టెనంట్స్ గా సెలబ్రిటీలను వేరు చేశారు. అయితే రాత్రి దమ్ము శ్రీజ కళ్యాణ్ వీళ్ళందరూ బయట తిరుగుతూ కనిపిస్తారు. సెలబ్రిటీల హౌస్ దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి బిగ్ బాస్ మన మీద పక్షపాతం చూపిస్తున్నాడా అని మాట్లాడుకుంటారు. వాళ్లకి బాత్రూంలు ఉన్నాయి మనకు బాత్రూములు కూడా లేవు అంటూ తమ ఆవేదనను బిగ్ బాస్ తో చెప్పుకుంటారు.. ఆ తర్వాత రాత్రి పడుకునే ముందు సెలబ్రిటీల గురించి ముచ్చట్లు పెట్టుకొని పడుకుంటారు.
ఉదయం 9:45 కి మచ్చా మచ్చా సాంగ్ తో అందరినీ నిద్ర లేచారు బిగ్ బాస్.. హౌస్ లోకి వచ్చి రచ్చ రచ్చ చేసి డాన్స్ అదిరిపోయేలా వేశారు.. ఆ తర్వాత ఒక్కొక్కరికి బిగ్ బాస్ ప్రతి నిమిషం ఓనర్స్ ఎప్పుడు ఓనర్స్ లాగే ఉండాలి రెంటుకున్న వాళ్ళని ఎక్కువగా దగ్గర తీసుకోకూడదు అంటూ సెలబ్రిటీలను దూరం పెట్టేశారు. డాన్స్ పెర్ఫార్మెన్స్ తర్వాత హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్లతో బిగ్ బాస్ రాత్రి నిద్ర బాగా పట్టిందని అడుగుతారు. ఇక సెలబ్రిటీలకు మాత్రం చుక్కలు కనిపించాయని చెప్తున్నాడు.
ఓనర్స్ తమకు కావలసిన పార్ట్నర్స్ ని సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు. రమ్మని బయట ఉన్న బ్యాచ్ లను చూపించి మీకు కావాల్సిన వాళ్లని ఏ పనికి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు చేసుకోవాలని ఆర్డర్ పాస్ చేస్తాడు బిగ్ బాస్. హౌస్ క్లీనింగ్ మాస్క్ మెన్ ఇద్దరినీ సెలెక్ట్ చేసుకున్నారు.. అందులో ముఖ్యంగా ఇమ్మానుయేల్ ని అందరూ టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా తాము చేస్తున్న పని గురించి బిగ్ బాస్ తో చెప్తారు. ఇక్కడ కూడా మాస్క్ మాన్ మిగిలిన సెలబ్రిటీల మధ్య కాస్త వాగ్వాదం జరుగుతుంది. మొత్తానికి ఎవరి కావాల్సిన వాళ్ళని పనులకి సెలెక్ట్ చేసుకుంటారు.
అనంతరం ఒంటిగంటకు సెలబ్రిటీలు సామాన్యులు అందరూ కలిసి కూర్చొని తింటూ ఉంటారు. అయితే సెలబ్రిటీలను ఓనర్స్ కి ఇవ్వాల్సిన ప్రదేశాలని వాళ్ళకి ఇచ్చేయండి అని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఇక తిన్న వరకు చాలు అక్కడ పెట్టేసి బయటకు వెళ్ళండి అని బిగ్ బాస్ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. తింటున్న ఫుడ్ ని అక్కడ పెట్టేయడంతో ఓనర్స్ ఫీల్ అయిపోతారు. తిని ఫుడ్ ని సగంలో ఆపేసి స్టోర్ రూమ్ లో పెట్టమనడంతో ఓనర్స్ ఫీల్ అయిపోతారు.. దమ్ము శ్రీజ బయట ఉన్న వాళ్లకి సెలబ్రిటీలకు బిస్కెట్లు పనులు ఇస్తుంది. హరీష్ సెలబ్రిటీల కోసం పండ్లను తీసుకొని వస్తాడు కానీ బిగ్ బాస్ మాత్రం ఆ పండ్లను స్టోర్ రూమ్ లో పెట్టమని అంటాడు.
అందరూ తింటున్న సమయంలో బిగ్బాస్ సెలబ్రిటీల నుంచి ఫుడ్డు తీసుకొని స్టోర్ రూమ్ లో పెట్టమని ఆదేశిస్తాడు. బిగ్బాస్ ఆ మాట అనడంతో మాస్క్ మాన్ ఫీల్ అయిపోయి వాళ్లకోసం పండ్లను తీసుకొని వస్తారు. బిగ్బాస్ మీరు ఆ ఫుడ్ ని తీసుకుని వెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టండి అని అంటాడు. ఆకలితో ఉన్నారు బిగ్ బాస్ అందుకే నేను వాళ్ళ కోసం పన్ను ఇచ్చాను అని అంటాడు. అయితే బిగ్ బాస్ మాట మేరకు ఆ పండ్లను తీసుకొని వెళ్లి స్టోర్ రూమ్ లో పెడతాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి హరీష్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. ఆకలితో ఉండడం నాకు నచ్చలేదు అందుకే నాకు చాలా బాధేసింది అని అంటాడు.
సాయంత్రం ఏడు గంటలకి బిగ్ బాస్ హౌస్ మేట్స్ కోసం అదిరిపోయే సర్ప్రైజ్ని ఇస్తాడు.. అందరికీ నోరూరించే ఫుడ్ ని పంపిస్తారు.. అందరూ ఉదయం నుంచి సరిగ్గా తినకపోవడంతో ఒక్కసారిగా ఆ ఫుడ్ ని లాగించేస్తారు. ఇకమీదట ఓనర్స్ టెనంట్స్ తో మీకు కావాల్సిన ఫుడ్ ని తయారు చేయించుకుని తినొచ్చు అని ఆదేశిస్తాడు. అలాగే సెలబ్రిటీలకు కావాల్సిన పోషకాహారం ఇలాంటి రుచులతో ప్రతిరోజు నేను మీకు పంపిస్తాను అని అదిరిపోయే ఆఫర్లు ఇస్తాడు. ఇమ్మాన్యూయల్ ను ఫ్లోర్ ను క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుందని మానిటర్ హరీష్ ని అడుగుతారు. హరీష్ ఇమ్మానియేల్ మధ్య పెద్ద రచ్చ జరుగుతుంది. బాడీ షేవింగ్ విషయంలో నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అని హరీష్ వార్నింగ్ ఇస్తాడు. ఇమ్మానియేల్ vs హరీష్ మధ్య రచ్చ జరుగుతుంది.. అనంతరం అందరూ హరిష్ గురించి మాట్లాడతారు.. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో ఫుడ్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఈ ఎపిసోడ్ చూసిన బిగ్ బాస్ లో ఫుడ్ కోసం పెద్ద రచ్చ జరుగుతుంది ఇది కామనే అని కామెంట్ లో పెడుతున్నారు. మరి రేపటి ఎపిసోడ్ లో ఈ రెండు టీమ్ ల మధ్య బిగ్ బాస్ ఎలాంటి గొడవలు పెడతాడు చూడాలి..