Bigg Boss Telugu 9 Day 1: చాలామంది బుల్లితెర అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదలైపోయింది. కామన్ మెన్స్ మరియు సెలబ్రిటీలతో ఇస్ సో స్టార్ట్ అయింది. ముఖ్యంగా ప్రతి బిగ్ బాస్ సీజన్ లోను ఒక జంటను మనం చూస్తూ ఉంటాం. అది కొన్ని రోజులు చూడడానికి బానే ఉంటుంది ఆ తర్వాత ఆ జంట మధ్యనే చాలా గొడవలు అవుతాయి. ఇదే బిగ్ బాస్ మనకి ఎప్పుడూ ఇచ్చే ట్విస్ట్.
గతంలో కూడా ఇలాంటి జంటలు బిగ్ బాస్ లో చాలా చూశాం. అందుకే చాలామంది బిగ్ బాస్ ని స్క్రిప్ట్ అంటుంటారు కూడా. అయితే బిగ్ బాస్ సీజన్ 9 లో రీతు ఒక లవ్ ట్రాక్ సెట్ అయిపోయింది అనిపిస్తుంది. ఇది సెట్ అవ్వకపోయినా కూడా కొంతమందికి ఆ ఫీల్ వస్తుంది. ముఖ్యంగా రీతు కళ్యాణ్ పడాల ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నప్పుడు పక్కనున్న వాళ్ళు పాడే పాటలు ఏదో లవ్ ట్రాక్ పనికి వస్తాయి అనేటట్లు ఉన్నాయి.
కొన్ని సీరియల్స్ తోను, అలానే కొన్ని ఎపిసోడ్స్ లో జబర్దస్త్ లో కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంది రీతూ చౌదరి. ఇకపోతే బిగ్బాస్ తెలుగు సీజన్ 9 రెండవ రోజు హౌస్ లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. కళ్యాణ్ పడాల కంటి రెప్ప నుంచి పడిపోయిన ఒక వెంట్రుకను తీసి ఏదైనా కోరుకో అని చెప్పింది.
అదేంటి అని కొత్తగా అడిగాడు కళ్యాణ్ పడాల. వెంటనే ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు తీక్షణంగా చూసుకోవడం మొదలుపెట్టారు. కొన్ని క్షణాల పాటు కల్లార్పకుండా ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడే పక్క నుంచి రామ్ రాథోడ్ ధీర ధీర పాటను అందుకున్నాడు. ఆ వెంటనే అనిమల్ సినిమాలోని ఎవరెవరో పాటను అందుకున్నాడు. ముందు ముందు ఇంకేం చేస్తారో అనే లిరిక్ ని కూడా పాడాడు. మొత్తానికి కళ్యాణ్ పడాలని రీతు చూసిన చూపు చూస్తుంటే ఖచ్చితంగా కళ్యాణ్ పడాలతో ట్రాక్ కొనసాగిస్తుందేమో అనిపిస్తుంది.
Also Read: Kajal Agarwal: కాజల్ అగర్వాల్ కు ఘోర ప్రమాదం, అసలు విషయం చెప్పిన చందమామ!