Bigg Boss Telugu 9 Day 58 Episode Review: హౌజ్ లో రీతూ, డిమోన్ తర్వాత ఇమ్మాన్యుయేల్, తనూజ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. అది మొన్నటి వరకే. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత ఈ స్నేహితుల మధ్య మెల్లిమెల్లిగా దూరం పెరిగింది. నిన్నటి నామినేషన్స్ ఇక వీరిద్దరి పూర్తిగా దూరమయ్యారని అంత అనుకున్నారు. అంతగా నిన్నటి నామినేషన్ లో వాదించుకున్న వీరు ఆ వెంటనే కలిసిపోయారు. పెళ్లి కూతురు చీరకట్టుకుని కూర్చుకున్నట్టు కూర్చున్నావ్ అన్న కామెంట్స్ పై జోకులు వేసుకుంటూ నవ్వుకున్నారు. పైగా ఎందుకురా నన్ను అంత శత్రువుల చూస్తున్నావ్ అంటూ మాట్లాకుని ఒక్కటయ్యారు.
ఇక ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మొదలైంది. బిగ్ బాస్ ఫోన్ ద్వారా మాత్రమే ఆదేశాలు జారీ చేస్తూ కంటెస్టెంట్స్ లో కన్ ఫ్యూజ్ క్రియేట్ చేశాడు. ఇందుకోసం హౌజ్ లో ల్యాండ్ ఫోన్ ఏర్పాటు చేశారు. మొదట ఫోన్ తనూజ లిఫ్ట్ చేసి మాట్లాడుతుండగా.. అందరిని బయటకు వెళ్లమని చెప్పమని ఆదేశించాడు. ఆ తర్వాత తనూజకి కెప్టెన్స్ కంటెండర్ టాస్క్ మొదలైందని, ఈ విషయం వెళ్లి హౌజ్ మేట్స్ చెప్పమన్నాడు. అయితే తనూజ బయటకు వెళ్లి ఇదే విషయం చెప్పగా ఎవరూ నమ్మలేదు. సీక్రెట్ టాస్క్ ని తనూజని అనుమానించారు. ఈ సారి కెప్టెన్సీ కోసం పోటీ పడే టాస్క్ అంత సీక్రెట్ కొనసాగుతుంది. వీరిలో రెబల్స్ ఉంటారు. వార సీక్రెట్ టాస్క్ లో గెలిచిన ప్రతిసారి కంటెస్టెంట్స్ నుంచి ఒకరిని కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగించాలి.
అదే వాళ్లు దొరికిపోతే మాత్రం రెబల్స్ కంటెండర్స్ నుంచి అవుట్ అవుతారు. ఆ తర్వాత బిగ్ బాస్ మళ్లీ ఫోన్ చేయగా సంజన లిఫ్ట్ చేసింది. ఈసారి ఫోన్ రీతూకి ఇవ్వమని చెప్పాడు. రీతూతో తనూజ చెప్పింది నమ్మారా? అని అడగ్గా లేదు అనుమానంగా ఉందని చెప్పడంతో ప్రశంసించి. ఈ టాస్క్ అంత నమ్మకమై ఉంటుందని హింట్ ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇప్పటికే మొదలైందని రీతూకి స్పష్టం చేశాడు బిగ్ బాస్. ఆ తర్వాత కంటెండర్ షిప్ కోసం కంటెస్టెంట్స్ మూడు టీంలుగా విభజించాడు. బ్లూ, ఆరేంజ్, పింక్ టీంగా డివైడ్ చేశారు. తనూజ, ఇమ్మాన్యుయేల్, రాము, గౌరవ్ లు ఆరేంజ్ టీం.. భరణి, రీతూ, నిఖిల్, డిమోన్ లు బ్లూ టీం. దివ్య, సుమన్, కళ్యాణ్, సాయి పింక్ టీం ఉండగా.. సంజనని ఎవరూ సెలక్ట్ చేసుకోకపోవడంతో సింగిలైపోయింది. దీంతో ఆమె కంటెండర్ టాస్క్ కు దూరమైంది.
సమయానుసారంగా బిగ్ బాస్ ఒక్కొసారి ఒక్కొ హౌజ్ మేట్ తో మాట్లాడారు. భరణితో మాట్లాడిన తన టీం వివరాలు అడిగారు. ఆ తర్వాత సుమన్ శెట్టికి ఫోన్ చేసి హౌజ్ తనే రెబల్ అని చెప్పి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. టాస్క్ కి సంబంధించిన వివరాలను ఓ యెన్వాలప్ లో రాసి హౌజ్లో ఏదోక ప్లేస్ లో సీక్రెట్ పంపిస్తుంటే అది హౌజ్ మేట్స్ కంట పడకుండ రెబల్స్ తీసుకుని టాస్క్ పూర్తి చేయాలి. అయితే ఎల్వాప్ చదవలేకపోవడంతో బిగ్ బాస్ రెండో రెబల్ గా దివ్యని సీక్రెట్ గా ఎంపిక చేశాడు. వీరిద్దరు కలిసి సీక్రెట్ గా టాస్క్ ఆడాలి. మొదటి టాస్క్ లో భాగంగా హౌజ్ లో ముగ్గురిని తమ సీట్ల నుంచి లేపి రెబల్స్ కూర్చోవాలి. అలా దివ్య.. భరణి, గౌరవ్, కళ్యాణ్, రీతూలను తమ ప్లేస్ నుంచి లేపి కూర్చుంది.
Also Read: Bigg Boss:మితిమిరిన గొడవలు.. కొట్టుకున్న కంటెస్టెంట్స్, అసలేమైందంటే
ఈ టాస్క్ గెలవడంతో వారు కళ్యాణ్ ని కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగిస్తున్నట్టు సైలెంట్ బిగ్ బాస్ వెల్లడించారు. ఇదే విషయాన్ని బిగ్ బాస్ ఫోన్ లో కళ్యాణ్ చెప్పి హౌజ్ లోకి అందరికి చెప్పమన్నాడు. సంజన తర్వాత కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ నుంచి అవుట్ అయ్యాడు. టీంలకు బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్ లో ఆరేంజ్ టీం నుంచి ఇమ్మాన్యుయేల్ గెలిచాడు. దీంతో ఆరేంజ్ టీంకి గ్రీన్ బ్యాడ్జ్ వచ్చింది. ఈ బ్యాడ్జ్ పొందిన వారు రెబల్స్ ఎలిమినేషన్ నుంచి బయటపడి కంటెండర్ గా కొనసాగవచ్చు. ఇది గెలిచిన టీంలో ఎవరోకరికి ఇవ్వాలి. దీంతో ఆరేంజ్ టీం కలిసి ఇమ్మాన్యుయేల్ కే ఆ బ్యాడ్జ్ ఇచ్చారు. ఆ తర్వాత బిగ్ బాస్ రెబల్స్ రెండో సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా హౌజ్ లోని పాలు తాగాలి.. మిగిలినవి ఎవరూ చూడకుండ స్టోర్ రూంలో పెట్టాలి. ఇది తెల్లేవారు సాంగ్ ప్లే అవ్వడాని కంటే ముందే చేయాలి. అలా రాత్రంత మెలవకువగా ఉండి టాస్క్ పూర్తి చేశారు దివ్య, సుమన్ శెట్టి.