Bigg Boss 9 promo 2: తెలుగు బిగ్ బాస్ 9(Big Boss 9)రియాలిటీ షో 58వ రోజు ప్రసారం కాబోతోంది. ఇక ఈరోజు జరగబోయే కార్యక్రమానికి సంబంధించిన రెండవ ప్రోమోని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.ఇందులో భాగంగా ఈవారం కెప్టెన్సీ కంటెండర్స్ కోసం జరిగే పోటీ ప్రారంభించారు. అయితే గుర్తుపెట్టుకోండి మీ మధ్యలోనే ఒక రెబల్ ఉన్నారు అంటూ బిగ్ బాస్ సూచనలు చేశారు అనంతరం సుమన్ శెట్టి(Suman Shetty)తో ఫోన్ మాట్లాడుతూ ఆ సీక్రెట్ రెబల్ మీరే అని చెప్పడమే కాకుండా ఈ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో భాగంగా మీకు కొన్ని సీక్రెట్ టాస్కులు ఇవ్వడం జరుగుతుందని బిగ్ బాస్ సుమన్ శెట్టికి తెలిపారు.
ఈ సీక్రెట్ టాస్కులను మీరు విజయవంతంగా పూర్తి చేసిన ప్రతిసారి హౌస్ లో ఒకరిని ఎలిమినేట్ చేసే పవర్స్ మీకు లభిస్తాయని బిగ్ బాస్ సుమన్ శెట్టికి సూపర్ పవర్స్ ఇచ్చారు.ఇక కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులలో భాగంగా సీసా బ్యాలెన్స్ టాస్క్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఇద్దరు సభ్యులు కలిసి ఆరు డంబెల్స్ తో కూడిన టవర్ నిర్మించాలని టాస్క్ ఇచ్చారు . ఇలా టవర్ నిర్మించిన తర్వాత ఆ సీసాలు కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ ఐదు సెకండ్లు కౌంట్ చేస్తూ బ్యాలెన్స్ చేయాలని తెలిపారు. అయితే ఈ టాస్క్ ను అందరికంటే ముందుగా ఇమ్మానియేల్ పూర్తి చేశారని ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది.ఇక ఈ టాస్కును ఎవరు విజయవంతంగా పూర్తి చేశారనేది తెలియాలి అంటే ఎపిసోడ్ చూడాల్సిందే.
ఇక ఇప్పటివరకు తెలుగులో ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం 9వ సీజన్ ప్రసారమవుతుంది అయితే ఈ తొమ్మిదో సీజన్ లో భాగంగా ముందుగా చెప్పినట్టే ట్విస్టులతో ఉందని చెప్పాలి. ఇకపోతే ఈ సీజన్లో బిగ్ బాస్ మొదటి నుంచి కూడా తనూజ(Tanuja)కే పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టమవుతుంది.ఇక నాగార్జున(Nagarjuna) కూడా ప్రతివారం తనూజకే మద్దతుగా మాట్లాడటంతో ఈసారి నిర్వాహకులు ముందుగానే విజేతను ఫిక్స్ చేసి హౌస్ లోకి పంపించారనే వాదనలు కూడా వినపడుతున్నాయి.
తనూజకు ఫేవర్ గా బిగ్ బాస్..
ఇలా తనూజకు బిగ్ బాస్ ఫేవర్ గా ఉన్న నేపథ్యంలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు కూడా ఆమెకు వ్యతిరేకంగా మారిపోయారు. ఇక గతవారం హౌస్ నుంచి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన దివ్వెల మాధురి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఓటింగ్ విషయంలో ఎప్పటికప్పుడు మారిపోతున్న నేపథ్యంలో ఊహించని విధంగా కంటెస్టెంట్ లో హౌస్ నుంచి బయటకు వస్తున్నారు. మరి ఈ వారం ఎవరు డేంజర్ జోన్ లో ఉండబోతున్నారు హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Biker OTT: శర్వానంద్ బైకర్ ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే!