BigTV English
Advertisement

Bigg Boss 9 Promo: బిగ్ బాస్ ముద్దుబిడ్డ.. ఫైనల్ గా గుట్టు రట్టు.. శ్రీజ మాటలు నిజమేనా?

Bigg Boss 9 Promo: బిగ్ బాస్ ముద్దుబిడ్డ.. ఫైనల్ గా గుట్టు రట్టు.. శ్రీజ మాటలు నిజమేనా?

Bigg Boss 9 Promo:బిగ్ బాస్ (Bigg boss).. తెలుగులో 8 సీజన్లు పూర్తయ్యాయి. కానీ ఏ సీజన్లో కూడా ఒక వ్యక్తిని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ.. వారికి సపోర్టుగా నిలిచిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. కానీ తొలిసారి బిగ్ బాస్ సీజన్ 9 లో అన్ని ట్విస్ట్ లే అంటూ చెప్పిన బిగ్ బాస్.. అందులో భాగంగానే కన్నడ ముద్దుబిడ్డ తనూజాను టైటిల్ విజేతగా నిలపడం కోసం ఆమె ఫేవర్ గా ప్రవర్తిస్తూ.. ఇప్పుడు అందరిలో అనుమానాలు రేకెత్తేలా చేశారు బిగ్ బాస్. ముఖ్యంగా ఇప్పటికే తనూజాపై హౌస్ లో వ్యతిరేకత మొదలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా నాగార్జున ఇటు బిగ్బాస్ ఇద్దరూ కూడా తనూజాకు సపోర్టుగా నిలుస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి. దీనికి తోడు దమ్ము శ్రీజ కూడా ప్రతి వారం తనూజాను మాత్రమే కన్ఫెషన్ రూమ్ కి పంపించి, ఆమెకు మాత్రమే సలహాలు, సూచనలు ఇస్తున్నారు.. ఎందుకు తనూజ మాత్రమే ప్రతి వారం కన్ఫెషన్ రూమ్ కి వెళ్తోంది? అంటూ అసలు విషయం చెప్పి అందరిలో అనుమానాలు రేకెత్తించింది.


తనూజ పట్ల మొదలైన వ్యతిరేకత..

ఇక ఈ విషయంపై అటు హౌస్ మేట్స్ లో కూడా అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ అనుమానాలను మరింత పెంచుతూ బిగ్ బాస్ చేసిన పని ఇంటి సభ్యులలో తనూజా పట్ల వ్యతిరేకత నెలకొనేలా చేసిందని చెప్పవచ్చు. అంతేకాదు తనూజ గురించి దమ్ము శ్రీజ చేసిన కామెంట్స్ అక్షర సత్యం అంటూ ఇప్పుడు ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తాజాగా 58వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ లో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

ALSO READ:Kamal Hassan: రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న విక్రమ్.. ఎప్పుడంటే?


బిగ్ బాస్ పెట్టిన చిచ్చు..

ప్రోమో విషయానికి వస్తే.. ప్రోమో మొదలవగానే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. అక్కడ అంతమంది ఉన్నా తనూజ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఫోన్ రిసీవ్ చేసుకుంటుంది. తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ.. తనూజ మనం మాట్లాడుతున్న మాటలు హౌస్ మేట్స్ అందరూ వింటున్నారు. వారిని కాస్త దూరంగా వెళ్ళమని చెప్పండి అంటూ చెబుతారు. దాంతో తనూజ బిగ్ బాస్ అందర్నీ దూరంగా వెళ్ళమని చెబుతున్నారు కాబట్టి వెళ్లిపోండి అని చెబుతుంది. ఇక అప్పటికే అనుమానం మొదలైన హౌస్ మేట్స్ కాదనలేక అక్కడ నుంచి వెళ్ళిపోతారు. బిగ్ బాస్ మాట్లాడుతూ.. తనూజ ఇప్పటినుంచి కంటెండర్ షిప్ టాస్క్ మొదలయ్యింది. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి అంటూ బిగ్ బాస్ కాల్ కట్ చేస్తారు.

బిగ్ బాస్ ముద్దుబిడ్డను ఎవరూ నమ్మడం లేదే..

ఆ తర్వాత తనూజ హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ.. కంటెండర్ షిప్ గురించి అలాగే ఇక ఏది ఉన్నా..ఇకపై బిగ్ బాస్ ఫోన్లోనే మాట్లాడతారట. అని చెబితే.. దివ్యా నికిత మాట్లాడుతూ అది ఓకే.. నీకేం చెప్పారు అని అడగ్గా.. అదే చెప్పారు అంటూ తనూజ సమాధానం ఇచ్చింది. రీతు చౌదరి మాట్లాడుతూ.. సీక్రెట్ టాస్క్ చెప్పడం రావట్లా నీకు.. ఇక దాన్ని కవర్ చేయడం అస్సలు రావట్లేదు. అని తన అనుమానం వ్యక్తం చేయగా.. ఈ టైంలో ఫ్రాంక్ చేయడం కరెక్ట్ కాదు.. నాకు కూడా ఆ ఎమోషనల్ ఉంది.. కాబట్టే నేను అదే ఆలోచనలో ఉన్నాను అని తనూజ చెబుతుంటే.. రీతూ చౌదరి ఇది నమ్మితే ఈమె కంటెండర్ అవుతుందేమో అంటూ కామెంట్ చేసింది. మొత్తానికి అయితే అటు శ్రీజ మాటలు నిజం అవ్వడమే కాకుండా ఇటు హౌస్ మేట్స్ అందరికీ కూడా తనూజపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. మొత్తానికైతే ఇన్ని రోజులు బిగ్ బాస్ ముద్దుబిడ్డ అని పిలిపించుకున్న ఈమెపై ఇప్పుడు ఇలాంటి అనుమానాలు మొదలయ్యాయి. మరి దీని నుండి తనూజ ఎలా బయటపడుతుందో చూడాలి.

Related News

Bigg Boss 9 Divvela Madhuri: వాడు అమ్మకే పుట్టలేదు… భరణితో రిలేషన్ ఎపిసోడ్‌పై మాధురి ఫైర్

Bigg Boss 9 day 57 Highlights: నా గురించి మాట్లాడకండి.. తనూజ, దివ్యలకు భరణి రిక్వెస్ట్, బాండింగ్స్ కి ఫుల్ స్టాప్ పడ్డట్లేనా?

Bigg Boss 9 Day 57: తెగిపోయిన తండ్రికూతుళ్ల బాండింగ్.. రాము త్యాగం వృథా, నామినేషన్ ఉన్నది వీళ్లే

Bigg Boss 9: హీట్ ఎక్కిన నామినేషన్ ప్రక్రియ, ఈ వారం వీళ్లు బయటకు సిద్ధం

Bigg Boss 9: బెడ్ టాస్క్ లో చీర కట్టుకొని పెళ్లి కూతురు లా కూర్చున్నావు, ఇమ్మానియేల్ మాస్

Bigg Boss 9 Promo: మీ పర్సనలైతే బయట చూసుకోండి.. భరణిపై రెచ్చిపోయిన తనూజ!

Bigg Boss 9: హౌస్ మేట్స్ నిజ స్వరూపం బయటపెట్టిన మాధురి.. అతడే ఫేక్ అంటూ!

Big Stories

×