BigTV English
Advertisement

Prakash Raj: కేరళ రాష్ట్ర అవార్డులు.. ప్రకాశ్ రాజ్ పై చైల్డ్ ఆర్టిస్టు ఫైర్

Prakash Raj: కేరళ రాష్ట్ర అవార్డులు.. ప్రకాశ్ రాజ్ పై చైల్డ్ ఆర్టిస్టు ఫైర్


Child Artist Slams Prakash Raj: ఈరోజుల్లో డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ నిజంగా కళాకారుడు కోరుకునేది కొన్ని చప్పట్లు మాత్రమే. ఆ చప్పట్లు చాలామంది కళాకారుల ఆకలిని తీరుస్తాయి. చాలామంది మంచి పేరు గుర్తింపు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. వాటి కోసమే అహర్నిశలు కష్టపడి తమ ప్రతిభను బయటపెడుతుంటారు. అయితే ఒక సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించడంతోపాటు ఆ సినిమాకి అవార్డులు వస్తే ఆ సినిమాలో నటించిన నటీనటులకు సంతృప్తి ఉంటుంది. అందుకనే ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఇస్తూ ఉంటారు. అయితే కేరళ రాష్ట్రం కూడా ప్రతిష్టాత్మకమైన అవార్డులు ప్రకటించింది. 

9 విభాగాల్లో అవార్డ్స్

అయితే కేరళ రాష్ట్రానికి సంబంధించిన అవార్డుల ఎంపికలో ప్రకాష్ రాజు జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ అవార్డుల ఎంపిక జరిగిది. 2024లో వచ్చిన అన్ని చిత్రాలలో కూడా మంజుమ్మెల్ బాయ్స్ సినిమా ఎక్కువ అవార్డు సాధించుకుంది. ఏకంగా తొమ్మిది విభాగాల్లో ఈ సినిమాకు సంబంధించి అవార్డులు వచ్చాయి. ఈ సినిమాను వాస్తవంగా జరిగిన ఒక సంఘటనను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ముఖ్యంగా గుణ సినిమాలోని ఇళయరాజా పాట ఈ సినిమాతోనే ఎక్కువగా పాపులర్ అయింది. తర్వాత ఇళయరాజా కూడా ఈ సినిమా గురించి కంప్లైంట్స్ ఇచ్చారు అది ప్రస్తుతం అప్రస్తుతం. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఉత్తమ నటుడుగా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఇంతమందికి అవార్డులు వచ్చినా కూడా చైల్డ్ ఆర్టిస్టులు ఈ అవార్డుల పైన విమర్శలు చేశారు.


చైల్డ్ ఆర్టిస్టుల విమర్శలు

నటులు అంటే ఏజ్ తో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుంది. అయితే కేవలం పెద్దవాళ్ళని మాత్రమే గుర్తించారు బాలనటులను గుర్తించలేదు అని దేనానంద జిబిన్ సోషల్ మీడియాలో జ్యూరీని విమర్శించారు. మాలికాపురం, గు వంటి సినిమాల్లో మంచి పేరు సంపాదించుకుంది బాలనటి దేనానంద జిబిన్. అయితే ఏకంగా బాలనట్టులను పక్కకు పెట్టేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

సోషల్ మీడియా పోస్ట్

సోషల్ మీడియాలో చిన్న పిల్లలకు పోస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి తమ తల్లిదండ్రుల అకౌంట్ ద్వారా దేవానంద తన ఇన్ స్ట్రామ్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. మీ కళ్ళతో పిల్లల్ని దగ్గరగా చూడండి. అంతేకానీ ఇక్కడ అంతా చీకటిగా ఉంది అని మాత్రం చెప్పకండి. పిల్లలు కూడా ఈ సమాజంలో భాగమే రాబోయే తరానికి 2024 మలయాళ సినిమాలు అవార్డులు ప్రకటించడంలో జ్యూరీ కళ్ళు మూసుకుపోయాయి. ఎన్నో సినిమాల్లో పిల్లల నటించారు కానీ ఆ పిల్లలకు అవార్డులు ఇవ్వకుండా కూర్చోవటం కరెక్ట్ కాదు. పిల్లలు మరిన్ని సినిమాలు చేయడానికి ప్రయత్నించండి. కనీసం ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్టుల కైనా అవార్డులు ఇచ్చి ఉంటే అది నాలాంటి వాళ్ళకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేది అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

Related News

Megastar Chiranjeevi : అన్నపూర్ణ స్టూడియోలో మన శంకరవరప్రసాద్ గారు, సినిమా పూర్తయ్యేది అప్పుడే

Sai Durgha Tej : స్టార్డం అంటే హీరోలతో ఫోటోలు దిగడం కాదు, సాయి తేజ్ అలా అనేశాడేంటి?

Ram Charan: ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా, ఈసారి హిట్ ఖాయం

Thiruveer: ఆ సినిమా టికెట్ కౌంటర్ లోనే చచ్చిపోతా అనుకున్నా

Kaantha First Spark: దుల్కర్ కాంత.. చాలా గట్టిగానే ఉండబోతున్నట్టుందే

Parasakthi: సింగారాల సీతాకోకవే.. ఏముందిరా సాంగ్.. నెక్స్ట్ లెవెల్ అంతే

Ustaad Bhagat Singh : సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ, మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి?

Big Stories

×