Bigg Boss 9 Madhuri Comments on Bharani: బిగ్బాస్లోకి భరణి రీఎంట్రీ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పబ్లిక్ ఓటుతో ఎలిమినేట్ అయిన భరణిని మళ్లీ ఆడియన్స్ ఎలా ఓటేశారన్నది ప్రతి ఒక్కరిలో ఉన్న సందేహం. ఆఫీషియల్ ఓటు ప్రకారం చూస్తే శ్రీజ దమ్ముకే ఎక్కు వచ్చాయనేది టాక్. అయితే భరణి రీఎంట్రీ వెనకు మెగా బ్రదర్ నాగబాబు ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. శ్రీజ వీడియోలోనూ అసలు ఈ టాస్క్ పెట్టిందే భరణి రీఎంట్రీ కోసమని, అందులో తనని బలిపశువుని చేశారంటూ ఆమె వీడియోలో చెప్పుకొచ్చింది.
ఈ విషయంలో ఆడియన్స్లోనూ సందేహాలు ఉన్నాయి. తాజాగా దీనిపై దివ్వెల మాధురికి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఎలిమినేషన్ అనంతరం మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్. జర్నలిస్ట్ జాఫర్ కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఇందులో భరణి రీఎంట్రీ వెనకు ఆయన గురువు ఉన్నారంటూ గుట్టు రట్టు చేసింది. వైల్డ్ కార్డుగా బిగ్బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధురి హౌజ్లో చేసిన రచ్చ అంత ఇంత కాదు. కదిలిస్తే చాలు నోరేసుకునిపడిపోయింది. ఇక మాధురితో వాదన అంటటే సింహం బోనులో తలపెట్టినట్టే. అంతగా గొడవలు పడే సంజన సైతం మాధురి నోటికి దడుసుచుకుంది.
కూర్చోవాలి మాట్లాడాలని అని అడిగితే కూడా తప్పే అన్నట్టు వ్యవహరించింది. కూర్చోండి అంటే కూర్చోక ఇక రీతూని నామినేషన్లో అన్ హెల్తీ బాండింగ్ అంటూ అరిచింది. ఇలా హౌజ్లో అందరిని పాయింట్ అవుట్ చేస్తూ గొడవలు పడుతూ రచ్చ చేసింది. మూడు వారాల పాటు హౌజ్మేట్స్ని మూడు చెరువల నీరు తాగించిన మాధురి అనుకొకుండ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఆమె ఎలిమినేషన్ అందరికి షాకిచ్చింది. ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చిన ఆమె ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా హౌజ్లో విశేషాలతో పాటు భరణి రీఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. భరణి రీఎంట్రీ వెనుకు మెగా బ్రదర్ నాగాబాబు హాస్తం ఉందని సందేహాలు ఉన్నాయి.
Also Read: Bigg Boss 9 Divvela Madhuri: వాడు అమ్మకే పుట్టలేదు… భరణితో రిలేషన్ ఎపిసోడ్‌పై మాధురి ఫైర్
అసలు విషయం చెప్పి స్పష్టం చేసింది మాధురి. భరణి రీఎంట్రీ విమర్శలపై ప్రశ్నించారు. వందశాతం నిజం. ఆడియన్స్ ఓటింగ్ వల్ల ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిన ఆయన వన్ వీక్‌లోనే హౌజ్లోకి మళ్లీ ఎలా వస్తారు. భరణి రీఎంట్రీకి ఆయ గురువు గారే కారణం. కచ్చింతంగా భరణి రీఎంట్రీ వెనకు మెగా బ్రదర్ నాగబాబు ఉన్నారు. ఆయన బ్రదర్ డిప్యూటీ సీఎం కాబట్టి నాగబాబు ఇన్‌ఫ్లూయేన్స్ మా టీవీపై ఉండో అవకాశం. అందువల్ల భరణి రీఎంట్రీ జరిగింది అని అసలు గుట్టు బయటపెట్టింది. అలాగే బిగ్ బాస్ ఎలిమినేషన్, విన్నింగ్ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం జరగదని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పింది. ఎలిమినేషన్ అయితే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం జరగడం లేదని, తమకు నచ్చిన వారిని, నచ్చని వారిని ఎప్పుడు ఎలా పంపించాలో బిగ్ టీం ఇష్టప్రకారం జరుగుతుందని అభిప్రాయపడింది.