Bigg Boss 9: బిగ్ బాస్ 9 లో ఉన్న చాలామంది కంటెస్టెంట్స్ లో సంజన ప్రత్యేక అని చెప్పాలి. మొదటి వారంలోనే ఎలిమినేషన్ అయిపోతుంది అని చాలామంది ఊహించారు. కానీ తాను ఆడుతున్న గేమ్ ప్లాన్ ప్రకారం ఇప్పటివరకు హౌస్ లో సర్వైవ్ అవుతూ వచ్చింది. ఒక తరుణంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ఏకంగా బయటకు పంపించే ప్రయత్నం చేశారు. అందరూ కూడా బయటకు వెళ్లిపోయింది అని అనుకున్నారు.
కానీ సంజనను సీక్రెట్ రూమ్ లో ఉంచి, హౌస్ మేట్స్ గురించి తెలుసుకునేలా చేశారు. కొంతమంది త్యాగం వలన మళ్ళీ హౌస్ లోకి సంజన ఎంట్రీ ఇచ్చారు. భరణి, ఇమ్మానుయేల్, రీతు చౌదరి సపోర్ట్ చేయడంతో మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది సంజన. కొన్ని ఫిజికల్ టాస్క్ కు సంబంధించి సరిగ్గా ఆడలేక పోతుంది అనే కంప్లైంట్ తప్ప ఇంకో విషయంలో సంజనపై కంప్లైంట్ లేదు.
అయితే రీసెంట్ గా జరిగిన నామినేషన్ ప్రక్రియలో రీతు చౌదరి తనకోసం జుట్టు కట్ చేసుకున్న కూడా రీతూకి ఎదురు తిరగాల్సి వచ్చింది అని సంజన కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే రీతు దానిని సీరియస్ గా తీసుకోలేదు. బాగానే అర్థం చేసుకుంది.
సంజనకు హౌజ్ లో ఎవరి సపోర్టు లేదు. అమ్మ అంటూ ఇమ్మన్యుయేల్ పక్కనే ఉంటున్న టాస్క్ విషయంలో ఆమెను పక్కన పెడుతున్నాడనిపిస్తోంది. నిన్న బొమ్మల టాస్క్ లో సంజన బొమ్మని ఎవర తీసుకోలేదు. ఇవాళ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో మూడు టీంస్ డివైట్ చేసి ముగ్గురు ముగ్గురు పేర్లు ప్రకటించాడు బిగ్ బాస్. దీంతో సంజన, డిమోన్, రాము, సుమన్ శెట్టి లు మిగిలిపోయారు.
వారిలో ఈ మూడు టీంలు ఒక్కొక్కరిని తమ టీంలో వచ్చేలా చేసుకోవాలి. అందులో ఆరేంజ్ టీం రాముని, బ్లూ టీం డిమోన్ ని, పింక్ టీం సుమన్ శెట్టి ఎంచుకుంది. కానీ, సంజనను ఎవరూ సెలక్ట్ చేసుకోకపోవడంతో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. దీంతో కెప్టెన్సీ కంటెండర్ పోరు నుంచి ఆమె అవుట్ అయ్యింది.
హౌజ్ లో అందరికి బాండింగ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, సపోర్టర్స్ ఉన్నారు. కానీ, సంజన కోసం అని హౌజ్ లో ఎవరూ లేనట్టు అనిపిస్తోంది. ఆమె కోసం ఆడేవాళ్లు, నిలబడే వాళ్లు లేక ఒంటరైంది సంజన. దీనికి ఆమె అతి వాదనలు, గొడవలే కారణమా.
Also Read: Ram Charan: ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా, ఈసారి హిట్ ఖాయం