Bigg Boss 9 Divvela Madhuri on Trolls: హౌజ్లో ఫైర్బ్రాండ్లా రెచ్చిపోయిన దివ్వెల మాధురి అనుకోకుండ బయటకు వచ్చేసింది. ఆమె ఎలిమినేషన్ ఇప్పటికీ షాకింగ్గానే ఉంది. సేవ్ అయ్యే అవకాశాలు ఉన్న వాటిని మాధురి సద్వినియోగం చేసుకోలేదు. కావాలనే ఎలిమినేట్ అయ్యింది. దువ్వాడ శ్రీనివాస్ కోసం తాను ఇంత తొందరగ బయటకు వచ్చినట్టు బజ్ ఇంటర్య్వూలోనూ స్పష్టం. మాధురి ఎలిమినేషన్తో హౌజ్మేట్స్తో పాటు ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. మాధురి ఇంకొంతకాలం హౌజ్లో ఉంటే బాగుండని కోరుకున్నవారంత డిసప్పాయింట్ అవుతున్నారు.
మాధురి లేకపోవడం బిగ్‌బాస్ కూడా కొందరిలో ఆసక్తి సన్నగిల్లింది. వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన మాధురి కదిలిస్తే చాలు కయ్యానికి పోయేది. మాట మాట్లాడితే గొడవలు. ఇక గొడవకి దిగితే రచ్చ రచ్చే. ఓ వైపు ఓదార్పులు, గొడవులు, అభిమానం కురిపిస్తూ హౌజ్లో సందడి చేసింది. ఆమె ఉన్నంత కాలం కెమెరాలన్ని కూడా మాధురినే ఫోకస్ చేశాయి. అంతగా బిగ్ బాస్ హౌజ్లో సందడి చేసిన మాధురి ఎలిమినేషన్ ఇప్పటికీ ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే హౌజ్ నుంచి బయటకు రాగానే దువ్వాడ శ్రీనివాస్తో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది.
ఈ సందర్భంగా ఆమెకు భరణితో రిలేషన్, ట్రోల్స్ పై ప్రశ్న ఎదురైంది. ఎంట్రీ ఇచ్చిన రోజు భరణిని చూస్తూ ముసిసి నవ్వింది, దీపావళి ఎపిసోడ్లో భరణితో కలిసి డ్యాన్స్ చేయడం.. ఓ వైపు తనూజ రాజు బాండింగ్ ఇలా పలు అంశాలపై ఆమెపై ట్రోల్స్ జరిగాయి. ముఖ్యంగా భరణిని నాన్న అని, మాధురిని అమ్మ అంటూ ఎన్నో ట్రోల్స్చేశారు. వీరిద్దరి మధ్య బాండింగ్ బలపడేలా ఉందంటూ కూడా ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ చేశారు. తాజాగా దీనిపై మాధురి స్పందించింది. దీపావళి ఎపిసోడ్లో భరణితో డ్యాన్స్ చేయడం ఏమంత అశ్లీలంగా అనిపించిందంటూ యాంకర్పైకి రెచ్చిపోయింది. డ్యాన్స్ చేయమన్నప్పుడు ఎలా రిజెక్ట్ చేస్తాం.. హోస్ట్ చెప్పినప్పుడు చేయరా? పండగ ఎపిసోడ్.. హోస్ట్ నాగార్జున చెప్పడంతో డ్యాన్స్ చేశాం.
అయినా మేము ఎదురెదురుగా ఉండి చేశాం కానీ, పట్టుకున్నామా అసలు. పట్టుకోవడం, హగ్ లాంటి ఉంటే వద్దని చెప్పేదాన్ని. అంత తప్పు ఏం కనిపించింది. మేమైనా చేతుల పట్టుకున్నామా? హగ్ చేసుకున్నామా? అక్కడ అంత తప్పుగా ఏముంది. భరణి గారితో కలిపి నన్ను ట్రోల్ చేసిన వాడు అమ్మకే పుట్టలేదు అంటూ ఫుల్ సీరియస్ అయ్యింది. అంత నీచాతి నీచంగా చేసిన వాడు నా దృష్టిలో మనిషే కాదు. ఇక దువ్వాడ శ్రీనివాస్ కూడా ట్రోల్స్  తాను కూడా చూశానని, ఎవరూ ఏన్ని ఏమనుకున్నా అవి పట్టించుకోమన్నారు. పండగ ఎపిసోడ్ అంతా జాలిగా జరుగుతుంది. డ్యాన్స్ చేయడాన్ని తప్పుగా చూస్తే దానికి మేమేం చేయలేం.. నాకు మాధురి ఏంటో తెలుసు? నాకు తనేంటో తెలుసు? ఎవడో ఏదో ప్రచారం చేసుకుంటే, మాట్లాడుకుంటే మేం పట్టించుకోమంటూ ట్రోల్స్ ని కొట్టిపారేశారు.