Team India : టీమిండియా ప్రస్తుతం ఆసియా కప్ లో పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్ సెప్టెంబర్ 09న ప్రారంభం కానున్న విషయం విధితమే. తొలుత ఆసియా కప్ లో అప్గానిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ మ్యాచ్ తో ఆసియా కప్ ప్రారంభం కానుంది.. టీమిండియా మ్యాచ్ యూఏఈతో సెప్టెంబర్ 10న ప్రారంభం కానుంది. ఆసియా కప్ తో పాటు ఈ ఏడాది వెస్టిండీస్ (Westindies) తో టెస్ట్ మ్యాచ్.. ఆస్ట్రేలియా(Australia) తో వన్డే, టీ20, సౌతాఫ్రికా (South Africa) తో టెస్ట్ మ్యాచ్, అలాగే దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్, టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఏయే మ్యాచ్ లు ఎప్పుడూ ఆడనుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : Asia Cup 2025 : ఆసియా కప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన డేంజర్ ప్లేయర్లు వీళ్లే.. లిస్టులో మనోళ్లే అంతా
ఆసియా కప్ (Asia Cup) లో సెప్టెంబర్ 10న యూఏఈ, సెప్టెంబర్ 14న పాకిస్తాన్, సెప్టెంబర్ 19న ఒమన్ తో భారత్ తలపడనుంది. అలాగే సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ పాల్గొనే అవకాశం ఉంది. అక్టోబర్ 02 నుంచి 14 వరకు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ జరుగనుంది. మరోవైపు అక్టోబర్ 19 నుంచి నవంబర్ 08 వరకు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, టీ 20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 14 నుంచి నవంబర్ 26 వరకు సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్.. అలాగే నవంబర్ 30 నుంచి డిసెంబర్ 19 వరకు సౌతాఫ్రికాతోనే వన్డే, టీ 20 మ్యాచ్ లు ఆడనుంది టీమిండియా. సెప్టెంబర్ 09 నుంచి డిసెంబర్ 19 వరకు చాలా బిజీ బిజీగా గడపనున్నారు టీమిండియా ఆటగాళ్లు. ఇప్పటికే ఆసియా కప్ 2025 (Asia Cup 2025) కోసం టీమిండియా ఆటగాళ్లు దుబాయ్ కి చేరుకొని అక్కడ జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ టోర్నీ కి టీమిండియా (Team India) స్పాన్షర్ జెర్సీ లేకుండానే మ్యాచ్ లు ఆడుతోంది. మరోవైపు త్వరలోనే స్పాన్సర్ ని బిడ్ ద్వారా ఎంపిక చేయనుంది బీసీసీఐ.
వెస్టిండీస్ టెస్ట్ (West Indies) మ్యాచ్ అక్టోబర్ 02 న విజయదశమి రోజే ప్రారంభం కావడంతో అప్పటి వరకు స్పాన్సర్ షిప్ ఫైనల్ కానుంది. వెస్టిండీస్ (Westindies) సిరీస్ లో టీమిండియా (Team India) స్పాన్సర్ జెర్సీతోనే బరిలోకి దిగనుంది. మరోవైపు టీమిండియా ఆటగాళ్లు కొందరూ బ్రాంకో టెస్ట్ (Bronco Test) ని పూర్తి చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆసియా కప్ కి వెళ్లిన ఆటగాళ్లు అంతా ఈ టెస్ట్ లో పాల్గొనలేదు. కొందరూ మాత్రమే పాల్గొన్నారు. వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ ఆడే ప్రతీ ఆటగాడికి ముందుగానే టెస్టులు చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అది కుదిరే అవకాశం లేదు. కొంత మంది ఆసియా కప్ కి ఆడుతున్న ఆటగాళ్లు సెప్టెంబర్ 28న దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ ఆడనున్నారు. ఆ తరువాత అక్టోబర్ 02 కోసం కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంటాయి. దీంతో కొంత మంది ఆటగాళ్లకు బ్రాంకో టెస్ట్ (Bronco Test) నిర్వహించే అవకాశం లేదు. మరోవైపు కొంత మంది ఆటగాళ్లకు మాత్రం ఆ అవకాశం ఉండనుంది. ఏది ఏమైనా ఈ ఏడాది మొత్తం టీమిండియా ఫుల్ బిజీ షెడ్యూల్ తో గడపనుందని స్పష్టంగా అర్థమవుతోంది.