BigTV English

Bigg Boss 9 Telugu : హౌస్ లోకి ఫోక్ సింగర్.. అప్పుడు మిస్ వరల్డ్.. ఇప్పుడు బిగ్ బాస్..

Bigg Boss 9 Telugu : హౌస్ లోకి ఫోక్ సింగర్.. అప్పుడు మిస్ వరల్డ్.. ఇప్పుడు బిగ్ బాస్..

Bigg Boss 9 Telugu : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు బిగ్ బాస్.. తెలుగులో ఇప్పటివరకు ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకుంది.. 9వ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్ళకు వాళ్ళ కల నెరవేరి పోయింది. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గ్రాండ్ గా ప్రారంభమైంది. సెలబ్రిటీలు సామాన్యులతో హౌస్ మొత్తం కళకళలాడిపోతుంది. వీళ్ల కన్నా ముందుగా హౌస్ గురించి మాట్లాడుకోవాలి.. గత ఎనిమిది సీజన్లో లేని విధంగా ఈసారి హౌస్ ని డిజైన్ చేశారు. డబుల్ డోస్.. డబుల్ డోస్ అని ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా ఉంది. ఇప్పటివరకు హౌస్ లోకి 10 మంది కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. 11వ కంటెస్టెంట్ గా ఫోక్ సింగర్ రామ్ రాథోడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన గ్రాండ్ ఎంట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.


11వ కంటెస్టెంట్ గా ఫోక్ సింగర్.. 

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నా టాప్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్.. 8 సీసన్లను పూర్తి చేసుకున్న ఈ షో 9 వ సీజన్ కొద్ది నిమిషాల క్రితం ప్రారంభమైంది.. హౌస్ లోకి సెలబ్రిటీలు సామాన్యులు కలిసి పదిమంది ఎంట్రీ ఇచ్చేశారు. 11వ కంటెస్టెంట్ గా ఫోక్ సింగర్ రామ్ రాథోడ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు.. అద్దాల మేడలు ఉన్నాయి సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేసి స్టేజ్ దద్దరిల్లిలేలా చేశాడు. అనంతరం నాగార్జునతో ఆయన మాట్లాడిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది..


వరల్డ్ స్టేజ్ పై రామ్ సాంగ్.. 

స్టేజ్ మీదకు రాగానే సింగర్ రామ్ రాథోడ్ ను గ్రాండ్ గా ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేశారు.. ఈయన ఎంతగా ఫేమస్ అయ్యారో అందరికీ తెలుసు రాను బొమ్మకు రాను పాటని వరల్డ్ స్టేజ్ మీద ప్లే చేయడం మామూలు విషయం కాదు అంటూ నాగార్జున అతనిపై ప్రశంసలు కురిపించాడు. ఇప్పటివరకు ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయని నాగార్జున అడిగాడు. దానికి రామ్ 560 మిలియన్లు వ్యూస్ వచ్చాయిని అన్నాడు. మామూలు సినిమా పాటలు కూడా అంతగా వ్యూస్ రావు నువ్వు సామాన్యుడి కాదయ్యా అని నాగార్జున సెటైర్లు వేస్తాడు.. ఇక రామ్ ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు సార్ మీ మీద కూడా నేనొక సాంగ్ రాసాను అని అంటాడు.. ఈయన నాగార్జున మీద పాడిన పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. సక్సెస్ఫుల్గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పాటల మాంత్రికుడు రాథోడ్.. హౌస్ లో ఎలా కొనసాగుతాడో తెలుసుకోవాలంటే ప్రతి ఎపిసోడ్ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

Nagarjuna Remuneration: బిగ్ బాస్ 9తో నాగార్జున సరికొత్త రికార్డు.. ఈ సారి అన్ని కోట్లా? కింగ్ అనిపించుకున్నాడుగా!

Commoners vs Celebrities : రెండు ఇళ్ల పంపకం… ఎవరికి ఏ ఇళ్లు ఇచ్చారంటే?

Bigg Boss Telugu season 9: ఆ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ అక్క… 10వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి

Bigg boss 9 Telugu: 9వ కంటెస్టెంట్ గా మూడవ కామనర్.. పుషప్స్ తో పిచ్చెక్కిస్తూ!

Bigg Boss season 9: ఇంట్లో అడుగు పెట్టకముందే ఎలిమినేషన్.. నాగబాబు ఫ్రెండ్‌కు నో ఛాన్స్

Big Stories

×