Asia Cup 2025 : ఆసియా కప్ 2025 (Asia Cup 2025) సెప్టెంబర్ 09న అబుదాబీ వేదికగా ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ అప్గానిస్తాన్, హాంకాంగ్ మధ్య మ్యాచ్ జరుగనుంది. సెప్టెంబర్ 10వ తేదీన టీమిండియా వర్సెస్ యూఏఈ మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే ఆసియా కప్ లో టీమిండియా షెడ్యూల్ ని పరిశీలించినట్టయితే.. సెప్టెంబర్ 10 తో పాటు సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో తలపడనుంది టీమిండియా. అలాగే సెప్టెంబర్ 19న ఇండియా వర్సెస్ ఒమన్ మధ్య జరుగనుంది. లీగ్ దశలో ఇది జరిగితే.. మళ్లీ సెప్టెంబర్ 21న సూపర్ 4లో టీమిండియాకి మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే టీమిండియా గ్రూపు1లో టాప్ లో ఉంటే.. సెప్టెంబర్ 24న, సెకండ్ లో ఉంటే సెప్టెంబర్ 23, 25న మ్యాచ్ ఉంటుంది. టాప్ లో ఉంటే సెప్టెంబర్ 26న టీమిండియా తలపడే అవకాశాలు ఉన్నాయి.
సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్ లో టీమిండియా (Team India) కచ్చితంగా ఫైనల్ కి వెళ్తుందని.. ఫైనల్ కి అప్గానిస్తాన్ లేదా శ్రీలంక వస్తుందని పలువురు క్రీడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. భారత్ -పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనున్న విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ టోర్నమెంట్ టీ-20 ఫార్మాట్ ప్రకారం జరుగనుంది. ఇది ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2026 సన్నాహాల్లో భాగంగా నిర్ణయించారు. ఆ ప్రపంచ కప్ ను భారత్- శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. అయితే నాలుగు జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్, ఒకే గ్రూపులో ఉన్నాయి. గ్రూపు-ఏలో టీమిండియా, పాకిస్తాన్, యూఏఈ, ఓమన్ ఉన్నాయి. గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్గనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి.
ఇప్పటివరకు టీమిండియా (Team India) ఆసియా కప్ ను 8 సార్లు గెలుచుకొని టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. టీమిండియా తరువాత శ్రీలంక జట్టు 6 సార్లు, పాకిస్తాన్ జట్టు 2 సార్లు గెలుచుకుంది. టీమిండియా విషయానికి వస్తే.. తొలిసారిగా 1984లో ఆసియా కప్ గెలుచుకుంది. ఇక ఆ తరువాత 1988, 1990, 1995, 2010, 2016, 2018, 2023 మొత్తం టీమిండియా 8 సార్లు ఆసియా కప్ విన్ అయింది. శ్రీలంక విషయానికి వస్తే.. 1986, 1987, 2004, 2008, 2014, 2022లో మొత్తం శ్రీలంక జట్టు 6 సార్లు ఆసియా కప్ కొట్టింది. పాకిస్తాన్ జట్టు 2000, 2012లో ఆసియా కప్ గెలుచుకుంది. ఇప్పుడు ఈ సారి ఎవ్వరూ గెలుస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారనుంది. ఇక ఆసియా కప్ లో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. అర్ష్ దీప్ సింగ్ 1 వికెట్ తీస్తే.. 100 వికెట్లు పూర్తి చేసుకున్న ఆటగాడిగా, మరోవైపు హార్దిక్ పాండ్య 17 పరుగులు చేస్తే.. మరో అరుదైన రికార్డును సాధించే అవకాశం కనిపిస్తోంది.